20, మార్చి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1627 (కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా.

26 కామెంట్‌లు:

 1. కవులిందరిపిలిపించియు
  కవితలచదువంగకోర ఙానము లేదా
  యెవరీకవితల వినెదరు
  కవిసమ్మేళనమనంగ గడుభయమగురా

  రిప్లయితొలగించండి
 2. కవులందరు నొక వేదిక
  భవబంధ ములుమరచి బహు సంప్రీతిన్
  పవివంటి దీభావ పరంపర
  కవిసమ్మేళన మనంగఁ గడుభయ మగురా

  రిప్లయితొలగించండి
 3. బిందు యతి - "జ్ఞ" తో "౦క, ౦ఖ, ౦గ, ౦ఘ" కు యతి చెల్లుతుంది. కవితల ముందున్న "క" బిందు పూర్వకము కాదు కాబట్టి యతి చెల్ల దనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 4. కవులసభయటంచుపిలిచి
  కవనములనువినక తుదకు కాలా తీత
  మ్మువలన ముగించితి మనెడు
  కవిసమ్మేళనమనంగఁ గదు భయమగురా!

  రిప్లయితొలగించండి
 5. కవిపుంగవులెల్ల కలసి
  కవితా పఠనమ్ముజేసి కమ్మలు కట్టన్
  సవసవ కవులకు భువిలో
  కవిసమ్మేళనమనంగ గడుభయమగురా

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘జ్ఞానము’ టైపాటువల్ల ‘ఙానము’ అయింది. క,ఖ,గ,ఘ,జ్ఞ లకు ‘విశేషయతి’ పేర యతి చెల్లుతుంది.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణలోని భావం సందిగ్ధంగా ఉంది. 3,4 పాదాల్లో గణదోషం. మరో ప్రయత్నం చేయండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘నవనవ’... టైపాటువల్ల ‘సవసవ’ అయినట్టుంది.

  రిప్లయితొలగించండి
 8. గురువర్యా!
  టైపాటు కాదు. "సవసవ" చిన్న-చిన్న- అల్పమైన
  అన్న అర్థం లో వ్రాసితిని. నాబోటి నవనవ కవులు సవసవ
  కవులే కదా!

  రిప్లయితొలగించండి
 9. మన్మధనామ సంవత్సరము తనమదిలో భయపడిందను భావంతో:

  కవనమ్మున స్వాగతమని
  భువికిన్ స్వర్గమ్ము దింపు పూనిక నీదన్
  సవినయఁపు నప్పగింతల
  కవిసమ్మేళన మనంగఁ గడు భయమగురా!

  రిప్లయితొలగించండి
 10. కవి సమ్మేళన మనగను
  కవులందఱు గూడి యచట కావ్యా లాప
  న్జవు లూరగ జేయుట గద
  కవి సమ్మేళన మనంగ గడు భయ మగురా !

  రిప్లయితొలగించండి
 11. అవధానుల నడుమ నిలచి
  కవితలు వినిపింప సభను కమనీయముగా
  నవకవులకు గొంతు వణకి
  కవిసమ్మేళన మనంగ గడు భయ మగురా!!!

  రిప్లయితొలగించండి
 12. భవితకుబాటలువేసే
  కవిసమ్మేళనమనంగ?గడుభయమగురా|
  కవితాశక్తులుతననే
  వివరణకోరినవిధాన-వినిపించంగా|

  రిప్లయితొలగించండి
 13. చవు లూరించెడు షడ్రుచు
  లవి యిట సమ్మిళిత మంచు నాలి యనంగన్
  చవిగొన చేదొకటే రా
  కవి! సమ్మేళన మనంగఁ గడు భయ మగురా.

  రిప్లయితొలగించండి
 14. మిస్సన్నగారి పద్యం ఉగాది పచ్చడి విరుపుతో బ్రహ్మాండం.అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. చవులూరించెడు కవితలు
  కవివర్యులు జెప్పుచుండ గడచెను కాలం
  బు, వయిళము లేనొకండనె
  "కవి సమ్మేళనమనంగఁ గడు భయ మగురా"!

  వయిళము=సమయము

  రిప్లయితొలగించండి

 16. కవిసింహపు గర్జనలున్
  కవిగజములరవములతో కలవర మవగా
  కవి కోకిల పలికెనుకద
  కవిసమ్మేళన మనంగ ; గడు భయ మగురా

  రిప్లయితొలగించండి
 17. నవరస భరితము కవనము ,
  శివ కవులును విష్ణు కవులు చిత్తము దెలుపన్
  కవనము వైరము లగుచో
  కవి సమ్మేళన మనంగ c గడు భయమగురా
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 18. కవులే నిరంకుశు లగుచు
  కవితల నిజములను తాము కఠినముగాగా,
  భవముగ తెలుపుట చేతన్
  కవి సమ్మేళనమనంగ కడుభయమగురా

  కవులందరి పిలిచియు,ఘన
  మవు రీతిని వారికిడగ,నందమునౌ సా
  లువలకు సొమ్ములు లేకన్
  కవి సమ్మేళనమనంగ కడుభయమగురా

  కవులిపుడు తాము చెప్పెడి
  కవితలకంటెన్,ఘనమగు కారులు నాదిన్
  నవమగు సౌఖ్యాల్ గూర్పగ
  కవి సమ్మేళనమనంగ కడుభయమగురా

  కవులందరొకట గూడియు
  కవితల్ చెప్పన్ననువగు కమ్రపు సాలే
  భవముగ గూర్పగ దొరకక
  కవి సమ్మేళనమనంగ కడుభయమగురా

  ఎవరే ప్రాంతమువారో
  యెవరికినే భాషయింపొ,నెరుగక పిలువన్
  కవితా బవరమదేర్పడు
  కవి సమ్మేళనమనంగ కడుభయమగురా

  రిప్లయితొలగించండి
 19. కం. కవిగానివాడొకడువే
  రెవనివొకవితలుతనవనియేకరుపెట్టన్
  నవనాడులుకొట్టుకొనెను
  కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా

  రిప్లయితొలగించండి
 20. కవిమిత్రులకు నమస్కృతులు.
  హైదరాబాదు, మియాపూర్‍లో కవిసమ్మేళనంలో పాల్గొని అర్ధరాత్రి ఇల్లు చేరుకున్నాను. ఇప్పుడు మీ పూరణలను సమీక్షించే ఓపిక లేదు. మన్నించండు. రేపు ఉదయం పరిశీలిస్తాను.

  రిప్లయితొలగించండి
 21. అవిరళమౌ రవములతో
  నవరసముల తోడ గూడు నయగారముతో
  చెవులకు తూటులు పొడిచెడి
  కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా!

  కవి = నీటి కాకి

  రిప్లయితొలగించండి


 22. తవికలు సామాన్యులవని
  చవులూరెడుపద్యములు రచనలు జిలేబుల్
  కవిరాజులదను దర్పము
  కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా :)

  జిలేబి
  పరార్ :)

  రిప్లయితొలగించండి
 23. సవరించి బొంగు గొంతుల్
  చవిలేకయె పాడి పాడి చప్పటి పద్యాల్
  జవిరెడి మార్పిడి షాలుల్
  కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా

  రిప్లయితొలగించండి