30, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణము - 1635 (అవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్.
(శ్రీ శలాక రఘునాథ శర్మగారి స్ఫూర్తితో...)

26 కామెంట్‌లు:

 1. కవితా పూరణములలో
  కవులు తెలిసియొ తెలియకయొ కాస్తైనను భ
  క్తవరదు బ్రార్ధించుటచే
  నవలీలగ మోక్షమబ్బు నజ్ఞానమునన్

  రిప్లయితొలగించండి
 2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. శివనామము జపియించగ
  నవిరళ మగు భక్తి తోడ నానందించ
  న్నవనీతము వంటి మనము
  నవలీలగ మోక్ష మబ్బు నజ్ఞా నమునన్

  రిప్లయితొలగించండి
 4. పవరది పోయెనని తలచి
  చివాలున కరెంటు తీగఁ చేతాకినచో
  శవమై మిగలడె వాడిక
  అవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్!!

  రిప్లయితొలగించండి
 5. కం.వివరముగాంచెనుబోయడు
  భవబంధమువీడియుండవల్మీకమునన్
  రవమదిమరామరాయన
  నవలీలగ మోక్షమబ్బునజ్ఞానమునన్.

  రిప్లయితొలగించండి
 6. భవబంధములను బడితివ !
  లవలేశము తెలివిలేద ! లంపట మేలా !
  శివు గొల్వగ తిన్నడి వలె
  యవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్

  రిప్లయితొలగించండి
 7. శివునే నమ్మిన వారికి
  అవలీలగ మోక్ష మబ్బు , నజ్ఞాన మునన్
  శివ భక్తుల దీక్షను మఱి
  యవహేళ న జేయకెపుడు హాస్యము కొఱకున్

  రిప్లయితొలగించండి

 8. అవహారుడు భటులు తఱుమ
  శివగుడి వల జుట్టి దాగె శివరాత్రిని తా
  శివపూజ నటన సేయగ
  నవలీలగ మోక్షమబ్బు నజ్ఞానమునన్
  2.అవనిని అజామిళుడు,కా
  మవశుం డఘముల నెునర్చిమరణమున తనూ
  భవు-నారాయణ-ను బిలువ
  నవలీలగ మోక్షమబ్బు నజ్ఞానమునన్

  రిప్లయితొలగించండి
 9. శివదేవుని సేవించిగ
  నవనిని శ్రీ, కాళ, హస్తు లందవె ముక్తిన్!
  భవుఁజేర మూఢ భక్తికి
  నవలీలగ మోక్షమబ్బు నజ్ఞానమునన్!

  రిప్లయితొలగించండి
 10. శివ నామము దలచుచు దా
  నవా రని దలవక విష్ణునామము నెపుడున్
  బవరము చేసెడి వారల
  కవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్!

  రిప్లయితొలగించండి
 11. అవివేకముతో గొలువగ
  భువనేశ్వరు డొసగె ముక్తి బోయకు గాదా!
  నవిరళ భక్తిని గలిగిన
  నవలీలగ మోక్షమబ్బు నజ్ఞానమునన్!!!

  రిప్లయితొలగించండి
 12. శివపూజల నిష్ట సలుప
  నవలీలగ మోక్ష మబ్బు నజ్ఞా నమునన్
  భవుదూర నరకముకలుగు
  భువిలోనివసించునట్టి మూఢాత్ములకున్

  రిప్లయితొలగించండి
 13. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ ఫూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘...గడు| నవలీలగ...’ అనండి.
  *****
  గోలిహనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వలె| నవలలీలగ...’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వారికి| నవలీలగ...’ అనండి.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘దానవారి+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అబ్బున?’ అని ప్రశ్నార్థకం చేసినప్పుడు ‘జ్ఞా’వల్ల న గురువు కాదు. దానివల్ల గణదోష ప్రమాదం ఏర్పడుతున్నది.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. శివ నామము జపియించుచు
  అవనినిగల భోగ భాగ్య మజ్ఞానమనన్,
  నవ విధ మార్గము లందున
  ఆవలీలగ మోక్ష మబ్బు న జ్ఞానమునన్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 15. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. తవళియునైన కిరాతుడు
  తవ నామము తిరుగ బలికి తానయె ఋషిగా,
  దివికింపునేగె శబరియు
  నవలీలగ మోక్షమబ్బు నజ్ఞానమునన్

  స్తవనీయుడు తిన్నడటుల
  భవలింగము కడిగె గాదె పాపపు నీటన్
  భవుజేరెను కన్నులిడియు
  నవలీలగ మోక్షమబ్బు నజ్ఞానమునన్

  అవగుణుడై కాళి గొలిచి
  స్తవనీయ కవిగ వెలిగెను,తానటు గొల్లం
  డవలీలగ భక్తియుతుల
  కవలీలగ మోక్షమిచ్చు నజ్ఞానమునన్

  కువకువలాడుచు పిట్టయు
  భవులింగముపైన రాల్చి పత్రములను తా
  శివుడంచు నెరుగకున్నను
  నవలీలగ మోక్షమిచ్చు నజ్ఞానమునన్

  రిప్లయితొలగించండి
 17. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. గురుదేవులకు నమస్సులు, సవరణకు ధన్యవాదములు.

  శివ నామము దలచుచు దా
  నవారి యని దలవక హరినామము నెపుడున్
  బవరము చేసెడి వారల
  కవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్!

  రిప్లయితొలగించండి
 19. అవును గురువుగారూ నేను గమనించ లేదు. నా పూరణ వెనక్కి తీసుకొంటున్నాను.

  రిప్లయితొలగించండి
 20. పువు లేల పూజ లేలను
  స్తవ ములు స్తోత్రములు వలదు సద్గురువు కృపన్
  శివదర్శన మగు నెట్లిక
  నవలీలగ మోక్ష మబ్బున జ్ఞానమునన్?

  రిప్లయితొలగించండి
 21. అవిపాము,హస్తి,పురుగుకు
  కవలిలగ మోక్షమబ్బు}నజ్ఞామునన్
  శివసన్నిదిగడు పుటకే
  నివసించి కాళహస్తినిలయమునందె

  రిప్లయితొలగించండి
 22. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ సవరణ బాగుంది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  నాల్గవపాదంలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ...
  అవి పాము,హస్తి,పురుగులె
  యవలీలగ మోక్షమబ్బు నజ్ఞామునన్
  శివసన్నిధి గడుపుటకే
  నివసించెను కాళహస్తినిలయమునందే.

  రిప్లయితొలగించండి
 23. ఎవియో తెలిసియు తెలియక
  కవివర! బొచ్చెడు గుడుంబ కాజీపేటన్
  చవిగొని త్రాగిన వెంటనె
  నవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్

  గుడుంబ = తెలంగాణా కల్తీ సారాయి

  రిప్లయితొలగించండి
 24. సవరించగ ఛందస్సును
  కవివరు డాగ్రహమునొంది కందము లోనన్
  చవిగొని రాజుల తిట్టిన
  నవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్

  రిప్లయితొలగించండి