20, మార్చి 2015, శుక్రవారం

పద్యరచన - 854

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“వీడ్కోలు”

10 కామెంట్‌లు:

 1. ఎన్నో మధురస్మృతులిం
  కెన్నో సంతోష ఘడియలీ వత్సరమం
  దున్నవి జయనామాబ్దమ
  కన్నీటితొ వీడుకోలు గావించెదనే

  రిప్లయితొలగించండి
 2. వెన్నంటి మన్మధొచ్చెను
  పన్నీటిని గురిపించ నెంచి పరవశ మందున్
  కన్నీటిని వీడ్కో లిడగను
  మన్నించుము జయనామ మంచు మదినేవేడన్

  రిప్లయితొలగించండి
 3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘తో, తోన్’ ప్రత్యయాన్ని ‘తొ’ అని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘కన్నీటను వీడుకోలు....’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  నాలుగు పాదాల్లోను గణదోషం. నా సవరణలతో మీ పద్యం.....
  వెన్నంటి వచ్చె మన్మథ
  పన్నీటిని గురియ నెంచి పరవశ మందున్
  కన్నీటను వీడ్కో లిడ
  మన్నించుము జయ యటంచు మది నే వేడన్.

  రిప్లయితొలగించండి
 4. పలుకుదు వీ డ్కోలునునిక
  పలుకుదు జయ వత్సరంబ ! బాధను దోడన్
  పలురకముల జయములనే
  బలముగ మఱి యిచ్చితీవు వత్సర మంతన్

  రిప్లయితొలగించండి
 5. జయనామమ్మును గల్గియు
  నయమును గూర్చక సమాజ నాశము గోరన్
  భయవిహ్వలులమ్మైతిమి
  దయచేయగ వీడు కోలు తరలుము తల్లీ!

  రిప్లయితొలగించండి
 6. వీడును-జయ|మాయందరి
  తోడుగ?మన్మథుడు|వచ్చుతొలగుముజయనీ
  నీడగ జయవిజయంబులు
  వాడకనేనిలుపుకొందు వాత్చల్యమునన్|

  రిప్లయితొలగించండి
 7. భారత దేశపు భవితపై నాశలు
  .........చివురింప జేసిన చెలియ శలవు
  తెలుగు నేలకు కడు తీరని వ్యధలను
  .........పంచి నవ్వుచు పోవు పగతు శలవు
  కళలు మాయగ విశాఖను కబళించిన
  .........గాలివాన నిడిన ఘనమ శలవు
  మేటి దిగ్గజముల మ్రింగి చిత్రావని
  .........కడుపును కోసిన కత్తి శలవు

  పేరునకు జయమవే గాని తీరు జూడ
  నేతి బీరవేమందును నిజము సుమ్ము
  అయిన దైనది కానిమ్ము హాయిగాను
  పోయి రమ్మిక వీడ్కోలు పొమ్ము జయమ!

  రిప్లయితొలగించండి
 8. జయముల నీయక బోయిన
  భయపెట్టిన, మా విశాఖ ప్రాంతము నంతన్
  జయ వత్సముకు నతులిడి
  ప్రియముగ వీడ్కోలిడెదను వినయము తోడన్!!!

  రిప్లయితొలగించండి
 9. జయనామ వత్సరమ్మున
  జయాపజయములు గలిగెను జనులకునెల్లన్
  రయమున గడిచెను సమయము
  దయచేయుము వీడుకోలు తరుణంబయ్యెన్!

  రిప్లయితొలగించండి