విద్య నేర్చిన పిమ్మట వెఱ్ఱి బాప లస్థి పంజరమును జూచి యాశ తోడ తాము నేర్చిన విద్యను తారు జదువ సింగ ముగ మారి వారిని మ్రింగ దలచి దూకు చుండెను వారిపై తోయ జాక్షి !
పిరాట్ల ప్రసాద్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. దోషాలు లేవు, కాని కొన్ని సవరణలతో మీ పద్యం.... విధిగ గురువు వద్ద విద్యలన్నియునేర్చి శిధిల మృగమున కిడ జీవితంబు బ్రతికి రుధిర మాంస భక్షణ తలపుగా పైకి దూక విడిరి ప్రాణములను. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. చిత్రం మీకు అసలు కథను గుర్తుకు తెచ్చినట్టు లేదు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ ఖండకృతి బాగుంది. అభినందనలు. మొదటి పద్యం రెండవపాదంలో యతి తప్పింది. ‘అడవిలోన కేశి యస్థులఁ గని’ అనండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, కథ జోలికి వెళ్ళకుండా నీతిబోధకమై మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, పుస్తకం.నెట్ లో అక్కయ్య గారి వ్యాసం చూశాను. ధన్యవాదాలు. మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఆ.వె. విధిగ గురువు వద్ద విద్యలన్నియునేర్చి
రిప్లయితొలగించండిశిధిల మృగము కిచ్చె జీవి తంబు
పచ్చి రుధిర మాంస భక్షణే తలపుగా
చంప పైకి దూక జంకె జనులు
అడవిని బోవగ విప్రులు
రిప్లయితొలగించండిగడబిడ గాచెదరి పోయె ఘర్జన వినగన్
తడబడి తరువుల నెక్కిన
విడలేదట చంపి తినుట మృగ రాజనగన్
విద్య నేర్చినట్టి విప్రులు నల్వురు
రిప్లయితొలగించండిఅడవిరాజునస్థిపంజరమ్ము
అడవిలోన జనుచు నచట జూచి తలచె
శిక్షణమ్మునట పరీక్ష జేయ
సమయ సందర్భములులేక భయములేక
చదువును పరీక్ష సేయగ నొదవు కీడు
ననుచు నొక్కడు జెప్పగా నవ్వినట్టి
మిత్రులన్ వీడి చెట్టెక్కి మిన్నకుండె.
అప్పుడతికించి జేర్చెగా నస్థులొకడు
మాంస, చర్మము, రూపమ్ము మార్చె నొకడు
ప్రాణమున్ బోసె నొక్కడు, రయము నపుడు
పైకి దూకుచు సింహమ్ము వారి జంపె
గట్టిగ లౌక్యము దెలిసిన
చెట్టెక్కిన వాడు దిగెను చింతించి యనెన్
కొట్టుక జెప్పితి తలపై
నిట్టుల పెడ చెవిని బెట్ట నీరీతాయెన్.
విద్య నేర్చిన పిమ్మట వెఱ్ఱి బాప
రిప్లయితొలగించండిలస్థి పంజరమును జూచి యాశ తోడ
తాము నేర్చిన విద్యను తారు జదువ
సింగ ముగ మారి వారిని మ్రింగ దలచి
దూకు చుండెను వారిపై తోయ జాక్షి !
గోలివారు కధమొత్తం చక్కగ వివరించినారు....
రిప్లయితొలగించండిపిరాట్ల ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
దోషాలు లేవు, కాని కొన్ని సవరణలతో మీ పద్యం....
విధిగ గురువు వద్ద విద్యలన్నియునేర్చి
శిధిల మృగమున కిడ జీవితంబు
బ్రతికి రుధిర మాంస భక్షణ తలపుగా
పైకి దూక విడిరి ప్రాణములను.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
చిత్రం మీకు అసలు కథను గుర్తుకు తెచ్చినట్టు లేదు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ఖండకృతి బాగుంది. అభినందనలు.
మొదటి పద్యం రెండవపాదంలో యతి తప్పింది. ‘అడవిలోన కేశి యస్థులఁ గని’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
విద్యవివేకముంచ?నవివేకమునందునపరిక్షజేయుటన్
రిప్లయితొలగించండిఅధ్యయనంబుదోషమ?సహాయకలోపమ?సాటిమిత్రులే
బాధ్యుల?మూర్ఖతత్వమ?నపాయపుసింహముచంపకుండునా
సాధ్యమ?దానిదాడికివిచారణనడ్డుట?సూర్యునడ్డుటే|
గురువులకు నమస్కారములు
రిప్లయితొలగించండిఅవును నిజమే నాకా కధ గుర్తు రాలేదు .అందుకే మామూలుగా రాసాను .ఛందో బద్ధంగా రైటైయిందిగా ఫర్వా లేదన్నమాట
విద్యవివేకముంచ?నవివేకమునందు-పరీక్షజేయుటా?
రిప్లయితొలగించండిఅధ్యయనంబుదోషమ?సహాయకలోపమ?సాటిమిత్రులే
బాధ్యుల?మూర్ఖతత్వమ?నపాయపుసింహముచంపకుండునా
సాధ్యమెదానిదాడికి-విచారమునడ్డుట?సూర్యునడ్డుటే
కె.యెస్,గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండికట్టె సాము చేయుట వడిగ పరుగిడుట
ఏటిలో పడినన్ చావ కీదు టయును
తరువు నెక్కి మృగము నుండి తప్పుకొనుట
అవసరంబగు వేళ కాపాడు మనల
నేర్చన విద్యను బ్రతుకున్
రిప్లయితొలగించండిదీర్చెడు రీతిగ గ్రహించ దేశము మెచ్చున్
కూర్చగ తననే తను పరి
మార్చెడు విధముగ, జనాన మతిమాలుటెగా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపద్య రచన
రిప్లయితొలగించండివృక్ష మెక్కెను బ్రతికె వివేకి యతడు
వేద జడులైన విప్రులు మేదకులయి
మృతిని జెందిన మెకముకు బ్రతుకు నిడుచు
ప్రాణముల్ కోలు పోయిరి దీనులగుచు
నిష్టాగరిష్ఠులై నిఖిల వేదంబుల
రిప్లయితొలగించండి.......... పఠియించి బుద్ధి సంపన్నులైరి
నిజవాసమునకేగ నిశ్చయించుకొని కా
.......... రడవిమాగంబున నడువదొడరి
యస్తిపంజరముగా నడవిరాజచట ని
.......... ర్జీవమై పడియుండ లీలగతిని
బ్రతికించగానెంచి ప్రాణంబులంత సిం
.......... హానికిడిరి తమ హాని మరచి
బ్రతికి సింహమ్ము విప్రుల ప్రాణములను
శీఘ్రమే హరియించె నిశ్శేషముగను
చదువు చదువంగ సరిపోదు సాహసమును
లౌక్య గుణములు లేకున్న రహిని గనరు
గురువుగారు మీ సూచన శిరోధార్యం. మంచి సూచన ఇచ్చినందులకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! ధన్యవాదములు..
రిప్లయితొలగించండిమీ సూచనతో..సవరణ తో....
విద్య నేర్చినట్టి విప్రులు నల్వురు
అడవిలోన జనుచు నస్థికలను
జూచి సింగమువని వేచుచు తలచిరి
శిక్షణమ్మునట పరీక్ష జేయ
సమయ సందర్భములులేక భయములేక
చదువును పరీక్ష సేయగ నొదవు కీడు
ననుచు నొక్కడు జెప్పగా నవ్వినట్టి
మిత్రులన్ వీడి చెట్టెక్కి మిన్నకుండె.
అప్పుడతికించి జేర్చెగా నస్థులొకడు
మాంస, చర్మము, రూపమ్ము మార్చె నొకడు
ప్రాణమున్ బోసె నొక్కడు, రయము నపుడు
పైకి దూకుచు సింహమ్ము వారి జంపె
గట్టిగ లౌక్యము దెలిసిన
చెట్టెక్కిన వాడు దిగెను చింతించి యనెన్
కొట్టుక జెప్పితి తలపై
నిట్టుల పెడ చెవిని బెట్ట నీరీతాయెన్.
గురుదేవులకు వందనములు.మొదటి పాదము సవరణతో:
రిప్లయితొలగించండినేర్చిన విద్యను బ్రతుకున్
దీర్చెడు రీతిగ గ్రహించ దేశము మెచ్చున్
కూర్చగ తననే తను పరి
మార్చెడు విధముగ, జనాన మతిమాలుటెగా!
జెండాపై కపిరాజు మున్నగు జనాదరణ పొందిన పద్యములను వ్రాసిన తిరుపతి వేంకట కవుల గురించి అక్కయ్యగారి వ్యాసము.
రిప్లయితొలగించండిhttp://pustakam.net/?p=10481
చదువులసారమంతయునుఁ జక్కగ నేర్చినఁ జాలదోయి! యా
పదలను సైచు జాణతయు, బాయక తోడఁ జరించువారలన్
ముదమునఁ గాచు బుద్ధిబలముం, భయహీనతలుండినన్ గదా,
తుదకు జయమ్మటంచు కథఁ దోపగఁ జేయక యుండునే యిటన్.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
కథ జోలికి వెళ్ళకుండా నీతిబోధకమై మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
పుస్తకం.నెట్ లో అక్కయ్య గారి వ్యాసం చూశాను. ధన్యవాదాలు.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
అన్నివిద్యలు నేర్చిన యగ్ని ముఖులు
రిప్లయితొలగించండిపోవుచుండగ నల్గురు పోడులొన
కానవచ్చెను మృగరాజు కాయమొకటి
మృగము బ్రతికించ నెంచగ ముగురు ద్విజులు
వలదు వలదంచు నొకడెక్కె పాదపమును
ప్రాణమునుపోయ వారాలు బ్రతికి మృగము
చంపివేసెను పాఱుల సత్వరముగ
తెలివిలేని విద్య వలయు ఫలము నిడదు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ తేటగీతిక బాగుంది. అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిపుస్తకం నెట్ లో నావ్యాసం చిదివినందులకు సోదరి లక్ష్మి దేవి గారికి,గురువులు శ్రీ శంకరయ్య గారికీ ధన్య వాదములు