చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, సమస్య తేటగీతి పాదం అయితే మీరు కందపద్యాలు వ్రాశారు. మీకోసం ఆ సమస్యను ఇలా మారుస్తున్నాను. ‘హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్’. ఇప్పుడు మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
దేవుడే లేడనుచును వాదించువారు
రిప్లయితొలగించుకడకొక దినమునందున కళ్ళుతెరచు
చాటు హరికిలేరెవ్వరు సాటియనుచు
హరిని పూజింత్రు నాస్తికులనవరతము
గొప్ప కొఱకని కొందరు కోరి కోరి
రిప్లయితొలగించుహరిని పూజింత్రు , నాస్తికు లనవరతము
దైవ మన్నది ఛాందస భావ మనుచు
యెదను భీతిగ పలుకును మోద మలర
హరి యెటులుండును చూడగ
రిప్లయితొలగించుహరి హరియన పాపమంత హరియించున, నా
హరి గిరి లేనే లేడని
హరిని " పూజింత్రు " నాస్తికు లనవరతము.
హరి యెక్కడ లేడందురు
హరి శూన్యము, పుట్టలేదు హరి యెచ్చటనున్
హరి యన దొంగే యనుచును
హరిని " పూజింత్రు " నాస్తికు లనవరతము.
( తమకు తెయకుండానే నిందాస్తుతి తో పూజిస్తారని నా భావన )
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సమస్య తేటగీతి పాదం అయితే మీరు కందపద్యాలు వ్రాశారు. మీకోసం ఆ సమస్యను ఇలా మారుస్తున్నాను. ‘హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్’.
ఇప్పుడు మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భక్తి యుతముగ నిరతము భక్తు లవని
రిప్లయితొలగించుహరిని పూ జింత్రు , నాస్తికు లనవరతము
దైవ దూషణ గావింత్రు దయ్య మనుచు
వారి సంస్కార మదియౌను వారి జాక్షి !
మదిన దేవుని నమ్మెడు మనుజులంత
రిప్లయితొలగించుహరిని పూజింత్రు, నాస్తికులనవరతము
బ్రహ్మమన్నది లేదన్న భావనమున
వాస్తవమ్మున జీవింత్రు వసుధలోన !!!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆస్తికులనుదినంబున నాదరమున
రిప్లయితొలగించుహరిని పూజింత్రు, నాస్తికు లనవరతము
వారితోడ విబేధించి వాదములను
చేసెద రజుడు లేడని చెప్పుచుండ్రు.
వైష్ణవులు సదా కరమగు భక్తితోడ
రిప్లయితొలగించుహరిని పూజింత్రు, నాస్తికు లనవరతము
హరిని తలతురు తెగడుచు స్థిరముగాను
హరితలంపులిచ్చును మోక్ష మందరికిని
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్ది సత్యనారాయణ రెడ్ది గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏడి? దేవుడు యనుచును ఎక్కి మదము
రిప్లయితొలగించుఎల్ల వేళల దిట్టుచు ఎగిరి పడుచు
నిముష నిముషము మనమున నిల్పు కొనుచు
హరిని పూజింత్రు నాస్తికులనవరతము
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దేవుడు + అనుచును + ఎక్కి’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘ఏడి దేవుఁ డటంచుఁ దా మెక్కి మదము’ అనండి.
వైష్ణవాదులు-భక్తిగపరవశాన
రిప్లయితొలగించుహరినిపూజింత్రు|"నాస్తికులనవరతము
శాస్రసమ్మతినేనమ్మిసాగి,పరుల
మేలొసగెడివారలొకటే?మేటియనిరి.
నమ్మ?మతపుహితముదైవసమ్మతమ్ము
అన్నఆస్తికులనుమాట-విన్నవారు
హరినిపుజింత్రు|నాస్తికులనవరతము
దైవమేలేడనెడివారె-తరచుగాను|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించుమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
కందుల వరప్రసాద్ గారి పూరణ.....
రిప్లయితొలగించునరులు వానరులై నేడు నాట్యమాడ
సిరులు జేరె వారింటను గిరులవలెను
మరులు గొనిన మనుజు లెల్ల మానసమున
హరిని పూజింత్రు నాస్తికు లనవరతము.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అయ్యా మీరు ఇచ్చిన "హరిణి పూజింత్రు నాస్తికులనవరతము " అన్న దానిలో "హ" కి "ల" యతి ఎలా కుదురుతుంది. దయచేసి వివరించగలరు.
రిప్లయితొలగించుపిరాట్ల ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించు‘హరిని పూజింత్రు నాస్తికులు + అనవరతము’.. ఇక్కడ హ-అ లకు యతిమైత్రి ఉంది. (అ-ఆ-ఐ-ఔ-య-హ లకు యతి చెల్లుతుంది)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు
రిప్లయితొలగించుఎమిటోనండీ...పద్యం అనగానే డెందమున ముందు కందమే తయారౌతుంది...తొందరపాటుకు క్షమిమంచండి...నాకందములను మార్చే పనిలేకుండా కంద పాదమును నాకందించిన కందివరాన్వయులకు నా నమస్సులు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు.. మీరు మార్చి ఇచ్చిన సవరణ తో..
రిప్లయితొలగించుహరి యెటులుండును చూడగ
హరి హరియన పాపమంత హరియించున, నా
హరి గిరి లేనే లేడని
హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్
హరి యెక్కడ లేడందురు
హరి శూన్యము, పుట్టలేదు హరి యెచ్చటనున్
హరి యన దొంగే యనుచును
హరినే నాస్తికులు కొలుతు రనవరతంబున్
( తమకు తెయకుండానే నిందాస్తుతి తో పూజిస్తారని నా భావన )
చేత బూడిద రాల్చెడు భూత గాళ్ల
రిప్లయితొలగించునోట లింగము దీసెడు కేటు గాళ్ల
బూట కమ్ముల పాడుచు పోరగ 'మల
హరి'ని పూజింత్రు నాస్తికు లనవరతము!
(వారి గురించి పాడటానికి మలహరి రాగాన్ని పూజిస్తారనే భావంతో)
దాస్యభావము, స్మరణము తలపులందు
రిప్లయితొలగించునర్చనము, మరి యాత్మసమర్పణమ్ము
పలు విధములుండు భక్తిని; వైరభక్తి
హరిని పూజింత్రు నాస్తికు లనవరతము
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.