23, మార్చి 2015, సోమవారం

పద్య రచన - 857 (మేధావు లనఁగా నెవరు?)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“మేధావు లనఁగా నెవరు?”

14 కామెంట్‌లు:

 1. ఆలోచించగ శక్తిగల్గి తనకేస్వార్థంబు లేకుండగా
  మేలున్ జేయు తలంపుతోడ సతతమ్మీలోకమందెవ్వడీ
  కాలాతీతపు వర్తనంబును సుసంస్కారంబులన్ గల్గి యీ
  నేలన్ దీనులకండయైనిలచు వానిన్ బిల్తు మేధావిగన్

  రిప్లయితొలగించండి
 2. సాధించగ పనుల లెన్నియొ
  మేధస్సుకు పదును బెట్టు మేధావు లనన్
  సోధించి జగతి మెచ్చగ
  మాధవ సేవే యటంచు మన్నన లందన్

  రిప్లయితొలగించండి
 3. కం. రసములు విరసము లైనా
  కసుబుసు లిటువెల్లువగును ఖండించుమదే
  రుసరుస లాపిటుయింపుగ
  మెసలెడు భాషణ నుసలుప మేధావియగున్

  రిప్లయితొలగించండి
 4. కం. తిరిగెడి కాలములయునికి
  యరుణుడు గాంచని కధలవి యన్నియు విధిగా
  చిరుకల ముతొచిలు కుఘనులు
  మెరిసెటి విజ్ఞాన గనులు మేధావులగున్

  రిప్లయితొలగించండి
 5. స్వార్ధ మనునది లేకుండ సర్వు లకును
  చేత నైనంత యుపకృతి జేయు నతడు
  తనదు ధీశక్తి వలనన దనరు నట్లు
  దేశ మభివృధ్ధి దిశగా ను దెచ్చు నతడు
  పిలువ దగునుమే ధావిగ నిలను సుమ్ము

  రిప్లయితొలగించండి
 6. మెదడు గొన్న యంత మేధావి కాలేడు
  అదను యందు తగిన అనువు లేక
  సగటు మనిషి బోలె బెంగపడుట మాని
  వెతలు మాపు తీరు వెతకు నతడు

  రిప్లయితొలగించండి
 7. పొరుగు దేశమ్మునకు నేగి పొట్టకొరకు
  మంచి పేరును పొందియు నంచితముగ
  సొంత దేశమ్మునకు తాను సుంతయైన
  సేవ చేయును మేధావి యావ తోడ

  రిప్లయితొలగించండి
 8. నిండుగ కళలను జూపుచు
  నొండొరులకు హితమొనర్ప నుత్తముడంచున్
  పండితు డనబడు నిలలో
  మెండగు విజ్ఞాన ఖనియె మేధావి గదా!!!

  రిప్లయితొలగించండి
 9. నిన్నటి పద్య రచన:
  అవశేషంబని చింతజేయకను నవ్యాంధ్రమ్ముగా దీర్చగన్
  నవనీతంబగు మానసంబునను దానై మోది తోడ్పాటునన్
  భువిపై స్వర్గము నిల్చెనా యనగ సంపూర్ణాభికాంక్షితమై
  ధృవతారై వినువీధిలో వెలుగ సంధానించ నేకొరెదన్!

  నేటి పద్య రచన:

  క్లిష్టంబగు వరమధమున
  కష్టంబుల పాలు జేయ ఘాతక ఘనులన్
  ద్రష్టై రయమున శిక్షించెడు
  నిష్టున్ మేధావి యనంగ నీశుడు హరియే !
  (విష్ణు సహస్రనామాల్లో ' మేధావి ' ఒక నామం)

  రిప్లయితొలగించండి
 10. మేధావిననగనెవ్వరు?
  సాదారణజీవితాలు సంస్కరణలచే
  వేదాలుగమార్చగలిగి
  బాధలనేబాపువారె పరిశీలించన్|

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మత్తగజగమనాన్ని తలపించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *****
  అక్కయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘శోధించు’ టైపాటు వల్ల ‘సోధించు’ అయింది.
  *****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘ఆపి+ఇటు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
  ‘తొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘చిరుకలమున’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ****
  పి.యస్.ఆర్. మూర్తి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘వెదుకు నతడు’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి (నిన్నటి) పద్యంలో మూడవ పాదంలో చివర గణదోషం.‘సంపూర్ణాభికాంక్షాళితో’ అందామా?
  రెండవ పద్యంలో మూడు, నాలుగు పాదాల్లో గణదోషం. ‘ద్రష్ట+ఐ’ అన్నప్పుడు సంధి లేదు. నా సవరణ... ‘ద్రష్ట యగుచు శిక్షించెడు| నిష్టున్ మేధావి యనఁగ ....’.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘మేధావి యనగ...’ అనండి.

  రిప్లయితొలగించండి