5, మార్చి 2015, గురువారం

సమస్యా పూరణం - 1613 (గట్రాచూలికి తనయుఁడు కాముండు గదా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గట్రాచూలికి తనయుఁడు కాముండు గదా.

17 కామెంట్‌లు:

 1. వ ట్రు వ యు ద ర పు గణపతి
  గ ట్రా చూలికి తనయుడు, కాముండు గదా
  గ ట్రా చూలికి పతియగు
  ఖ ట్వాం గున దగ్ధ మైన ఖలుడగు నతడున్

  రిప్లయితొలగించండి
 2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 3. గట్రాజు నప్త గణపతి
  గట్రాచూలికి తనయుడు, కాముండు గదా
  గట్రాచూలికి పతియగు
  కాట్రేనికి కినుకదెచ్చి కాలెను త్రుటిలో !!!

  రిప్లయితొలగించండి
 4. గురువుగారికు నమస్కారములు.

  పరమేశ్వరుడు మన్మథుణ్ణి బ్రతికించెనుగదా, అపుడు ఈశ్వరుడు తండ్రితో సమానమైతే పార్వతీదేవి తల్లి తో సమానముకదా


  పట్రాని కోపవశమున
  పెట్రేగెను పరమశివుఁడు భీతిలె రతి, యౌ
  నట్రా యని బ్రతికించగ
  గట్రాచూలికి తనయుఁడు కాముండు గదా

  రిప్లయితొలగించండి
 5. కొట్రయగు వినాయకుడే
  గట్రా చూలికి తనయుఁడు, కాముండు గదా!
  నిట్రపు నామమ్ములుగల
  గట్రాచూలికి యనుజుడు కపిలుని సుతుడే
  కపిలుడు: విష్ణువు

  రిప్లయితొలగించండి
 6. పట్రారే యిటు గరికా
  గట్రా,యుండ్రాళ్లు దోర కాయలు ,దుంపా
  దుట్రా,మిఠాయి తినగన్
  గట్రాచూలికి తనయుఁ డు కాముండు గదా!

  (పార్వతి తనయుడు అవి అన్నియు తినాలనే కోరిక కలవాడనే భావంతో..)

  రిప్లయితొలగించండి
 7. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరిపాదంలో ‘ఖట్వాంగునిచేత తనువు కాలిన నతడున్’ అనండి.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘గట్రాజు నప్త..’ అర్థం కాలేదు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. శంకరయ్య గారు సుబ్బారావు గారి పద్యం లో ప్రాస నియమం తప్పలేదా . చివరి పాదం లో ట్ర కి బదులు ట్వా వచ్చింది .దయచేసి వివరించ గలరు.నాకు తెలిసి మొదటి పాదం లో ప్రాసాక్షరం ఏదైతే అన్నిటిలోనూ అదే వుండాలి కదా.?

  రిప్లయితొలగించండి
 10. గురువుగారు సంపత్ కుమార్ గారి పద్యంలో పట్రాని అని ప్రయోగం మరియు వెంకట సుబ్బసహదేవుడు గారి పట్రారే అన్న ప్రయోగం నాకు నిఘంటువు లో దొరకలేదు దయచేసి వివరించగలరు.

  రిప్లయితొలగించండి
 11. తొట్రెరుగని-గణపతియే
  గట్రాచూలికితనయుడు-"కాముండుగ|దా
  బట్రాజులుపొగడంగనె
  చట్రాయిగమారురాజుసహజంబదియే"
  --------
  కే*యస్గురుమూర్తిగారిపూరణం
  కొట్రయినతొండపుదొర
  గట్రాచూలికితనయుడు-కాముండుగదా
  కాట్రేనికంటిమంటల
  తొట్రుంబడిదగ్ధమయ్యె-దుర్గతుడగుచున్


  రిప్లయితొలగించండి
 12. పిరాట్ల ప్రసాద్ గారూ,
  పొరపాటును తెలియజేసినందుకు ధన్యవాదాలు. నేను గమనించలేదు.
  సుబ్బారావు గారి పద్యంలో ప్రాసదోషం ఉంది.
  ఇక ‘ట్ర’ ప్రాసాక్షరం కావడంతో తప్పనిసరిగా వ్యావహారిక పదాలైన ‘పట్రాని, పట్రారే’ మొదలైనవి ఉపేక్షించక తప్పదు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘తొట్రయిన తొండపుందొర’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 13. మష్టారూ! ఆగుస్టు 7 వతేదీన "ట్ర" ప్రాసతో సమస్య ఇచ్చారు
  "కాట్రేనికి గుహుడుమరియు గణపతి తమ్ముల్"
  కానీ ఆరోజే నేమానీ వారి నిధనము వలన మీరు పూరణలను సమీక్షించలేదు

  రిప్లయితొలగించండి
 14. ఇట్రారా ఓ శుంఠా
  గట్రాచూలికి తనయుడు కాముండుగదా
  యేట్రా నేనేర్పినది యి
  దట్రా నీవొట్టి పెద్ద దద్దమ్మవురా

  రిప్లయితొలగించండి
 15. చట్రాయట్టౌ శివునికి
  గట్రా చూలికి,-తనయుడు కాముండు గదా!
  వట్రంబుగ విష్ణుసుతుడు
  పేట్రేగి శరములనేసి పెండిలి చేసెన్

  గట్రాచూలియె విష్ణుడు,
  వట్రించు శివుడగు సిరియ,బాగుగనెంచన్
  వట్రంబుమారి వర్తిల
  గట్రాచూలికి తనయుడు కాముండు గదా!

  రిప్లయితొలగించండి
 16. ఏట్రో!చెప్పుము నల్లా
  గట్రా!చూలికి,తనయుడు కాముండు గదా!
  పట్రా!దీనికి సాక్ష్యము
  కుట్రే!యిదినమ్మలేని ఘోరము కాదా!

  రిప్లయితొలగించండి
 17. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  జ్ఞాపకం చేసినందుకు ధన్యవాదాలు. కాని నాకు మాత్రం ఏమాత్రం గుర్తు లేదు ఆ సమస్యను ఇచ్చినట్లు. మతిమరుపు ఎక్కువైపోతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి