21, మార్చి 2015, శనివారం

కవిసమ్మేళనం చిత్రాలు...

హదరాబాద్, మియాపూర్‍లో 20-3-2015 నాడు జరిగిన 
కవిసమ్మేళనం చిత్రాలు...
సభకు నన్ను పరిచయం చేస్తున్న 
‘ఆంధ్రామృతం’ చింతా రామకృష్ణారావు గారు.

నాకు జరిగిన సన్మానం.

సభలో చింతా రామకృష్ణారావు గారు, చంద్రమౌళి సూర్యనారాయణ గారు, 
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ తదితర మిత్రులతో... 
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు.  ఫోటోలు తీసిందే వారు!)

6 కామెంట్‌లు:

 1. నమస్కారములు
  కవి సమ్మేళన చిత్రములను చూస్తుంటే , అక్కడ ఉండి పాల్గొన్నంత ఆనందంగాఉంది
  అందరికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 2. కవులను జూడగ గలిగెను
  నవిరళ మగు సంతసమ్ము నార్యా ! నాకు
  న్నవనత వదనంబున మఱి
  కవులకు నేనిడుదు నతులు గారవ మొప్పన్

  రిప్లయితొలగించండి
 3. ప్రణామములు గురువుగారు,..మీ సన్మాన ఫొటోలు , అందులో మన కవి మిత్రులు పాల్గొనడం చూసి చాలా సంతోషించాను ..అందరికీ అభినందన వందనములు...

  రిప్లయితొలగించండి
 4. సన్మాన మనిన గురునకు
  సన్మానము వాణి కెన్న సంతోష మయెన్
  మన్మధ యుగాది నిది, సా-
  మాన్యమె పలు వత్సరాలు మన బ్లాగ్ నడుపన్?


  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  శైలజ గారూ,
  మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. కవితల వ్రాసెడు కవులకు
  కవి " తలలో " శక్తి నింప ఘనమగు బ్లాగున్
  భువి " నెట్లో " నిలిపిన శ్రీ
  కవివర గురువర్యు ఘనత గౌరవమొప్పెన్.

  రిప్లయితొలగించండి