25, మార్చి 2015, బుధవారం

పద్య రచన - 859

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. చలనచిత్రమైన శంకరాభరణమ్ము
    శివుని యాభరణము శేషనాగు
    శంకరయ్యగారి చక్కని యీ బ్లాగు
    మూడిటికిని బాపు బొమ్మ యొప్పు

    రిప్లయితొలగించండి
  2. కంది వారి తోట కవనంపు విరులంట
    పద్య విద్య యందు ప్రాజ్ఞు లంత
    శంక రాభ రణము సాటివే రేదని
    వేలు పనుచు గురువు వేడె భక్తి

    రిప్లయితొలగించండి
  3. విశ్వనాథుని శంకరాభరణం
    సంగీత శోభాయమకుటం
    కందివారి శంకరాభరణం
    బ్లాగు పద్యరచనాయమకుటం !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    శివుని ఆభరణం వాసుకి...శేషుడు కాదు.
    *****
    అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    మంచి భావాన్ని అందించారు. మిత్రులెవరైనా దీనికి పద్యరూపాన్ని ఇస్తారేమో చూద్దాం...

    రిప్లయితొలగించండి
  5. శం కరమే ఈ బ్లాగు వ
    శంకరమే పద్య కవుల శాస్త్రుల కెల్లన్
    శంకలనే బాపును గద
    శంకర " నగ " వోలె బాపు చక్కగ దీర్చెన్.
    ( శంకర " నెక్లేసు " బాపు చక్కగ దీర్చెన్ .)

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘శంకరు నగ’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. విశ్వ నాధునింటి విరితోట బూసిన
    శంకర గళ సంప్రసాధనమిది
    కంది శంకరార్య కలవాణి నలరించు
    పద్య సూనములిడు సేద్య మిదియె!!!


    సంప్రసాధనము = ఆభరణము

    రిప్లయితొలగించండి
  8. సవరించిన పద్యము
    చలనచిత్రమైన శంకరాభరణమ్ము
    భవుని యాభరణము వాసుకికిని
    శంకరయ్యగారి చక్కని బ్లాగుకు
    మూడిటికిని బాపు బొమ్మ యొప్పు

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ సవరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శంకరాభరణం-సమస్యల శంకమాన్పుచునిల్వగా?
    టంకముండని శాస్త్రబద్దత టక్కరేమియులేకనే
    బింకమందున విద్యభూషణ పెంచునాభరణమ్ముగా|
    లంకెబిందెలుచిక్కినట్లగు|లాభమందరె సత్కవుల్

    రిప్లయితొలగించండి
  11. శంకరాభరణ బ్లాగు వంక జూచు
    వారు నిరతిశ యానంద భరితు లగుట
    నిజము ,కారణం బేమన నీతి నియమ
    లుగల వారలు మాత్రమే సుగమ రీతి
    రచన గావింత్రు మఱి యందు రమ్య ముగను

    రిప్లయితొలగించండి
  12. పద్య విద్యనేర్పి పది కాలములపాటు
    తెలుగు భాష నిల్పి వెలుగు నీయ
    'శంకరాభరణము' సర్వోన్నతంబైన
    వాణి కంఠ మందు బ్లాగు నగయె!

    రిప్లయితొలగించండి
  13. చలన చిత్ర మైన శంకరాభరణమ్ము
    మేటి సినిమాల దాటి యాడె
    శంకరార్య నడుపు శంకరాభరణమ్ము
    కవన విద్య నేర్పు కచ్చితముగ

    రిప్లయితొలగించండి
  14. లోకుల కం దించంగా
    సాకెడి ది నచర్యగాగ సాహిత్యంబే
    మూకగ శం కించకనే
    ప్రాకుడు క నుపించు-బ్లాగు-పద్యముజదువన్
    మానరు రచయుతు లంతట
    ఈనాట య్య లకుమంచినిష్టతనింపే
    జ్ఞానము గా గనుపించును
    పూనగ రి క్తంబిదియనిపులకింతునుగా
    పూరణ శంకనుమాన్పగ
    కారణ కల్పనలమధ్య కనకాభరణా
    ప్రేరణ రా గా?శంకర
    ధారణ భ వితవ్యమందు-దర్పణమగులే
    కోరగ ర సమయవేదిక
    దారి|క్ష ణకాలమైనతలచగమదిలో
    వారది ము నుముందుమనకు
    చేరగ న వ్యాతిరీతిసేవలుబంచున్

    రిప్లయితొలగించండి
  15. శ్రీకందిశంకరయ్యగురువుగారికివందనాలతోనేనుపంపిన
    కందాలలో"కందిశంకరయ్యగారి-శంకరాభరణమున"అనుఅక్ష
    రములుపాదమునాల్గవఅక్షములుగాగుర్చినాను,దయతోగమనించగలరు.

    రిప్లయితొలగించండి
  16. కవనవైభవ మన్న కమనీయ హారాన
    ........తాపిన మణులు పద్యము లనంగ
    సరసచమత్కృతుల్ సందడి జేసెడు
    ........పూరణ రత్నాలు పొదిగి రనగ
    ధగధగ మెరయుచు తాకుచు హృదయాల
    ........దత్తపదీ వజ్ర తతులు నిగుడ
    పద్యరచనములన్ ప్రభల నుద్దీపించు
    ........పచ్చలు భాసింప ముచ్చటగను

    తనరు మహనీయ విష్ణునందనుల వంటి
    కవికులాన్వయ చంద్రుల కైత లనెడు
    పగడముల నుంచి శంకర భవ్య శిల్పి
    చేసె శంకరాభరణమ్ము భాసురముగ.

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ మత్తకోకిల బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘శంకరాభరణము బ్లాగు...’ అంటే సరి! ‘నియమములు’ అనవలసిన చోట ‘నియమలు’ అన్నారు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    నామగోపనం అనే చిత్రకవితా రీతిలో వ్రాసిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీకు రెండుచేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

    రిప్లయితొలగించండి
  18. సరిగమ పదనిస సంపూ
    ర్ణ రాగమగు గాదె శంకరాభరణమనన్
    అరయగ కవి మితృలు శం
    కరాభరణమయ్యెనింక కవితలు రాయెన్

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారు మన బ్లాగ్ గురించి బ్రహ్మాండంగా చెప్పారు ...అదుర్స్

    రిప్లయితొలగించండి
  20. మాస్టరు గారూ ! ధన్యవాదములు.


    శం కరమే ఈ బ్లాగు వ
    శంకరమే పద్య కవుల శాస్త్రుల కెల్లన్
    శంకలనే బాపును గద
    శంకరు " నగ " వోలె బాపు చక్కగ దీర్చెన్.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ మీరంత పెద్దమాటలన కూడదు.

    రిప్లయితొలగించండి
  22. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శంకరాభరణపు కంది శంకరయ్య
    ప్రతిదినమొక సమస్యను వరుసగాను
    పోస్టు చేసి యతడు పద్యపూరణములను
    జేయు కవులఁ శ్లాఘించు నమేయముగను!

    రిప్లయితొలగించండి
  24. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి