16, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1623 (తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్.
(అవధాని డా. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

25 కామెంట్‌లు:

 1. ఊగించుచు నీనడుమును
  మ్రోగించుచునందియలను మురియుచుతిరుగన్
  నాగుండె లోన నేదియొ
  తీగెలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  రిప్లయితొలగించండి

 2. భాగము మనసున ప్రేమకు
  రాగము వినినంత పొంగి రంజిలు ముదమున్
  యోగము తడబడి నంతనె
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  రిప్లయితొలగించండి
 3. మాగంటి వారి చిన్నది
  తేగా కొని ప్రియము తోడ, తెచ్చిన పిదపన్
  బాగుగ వాయించ, తెగిన
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్.

  రిప్లయితొలగించండి
 4. రాగుడు తూర్పున మెల్లన
  రాగిల శోభామయమున రమణీయమ్మున్
  సాగిలి రమించ ప్రకృతియు
  తీగెలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  రిప్లయితొలగించండి
 5. ఆగళమందున పలుకగ
  రాగము లద్భుతముగ సఖి రాగిణి దృతితో
  బాగుగ పాడగ, మనసను
  తీగలులేని వీణ తీయగ మ్రోగెన్

  రిప్లయితొలగించండి
 6. మ్రోగదు గదమఱి యార్యా !
  తీగలు లేనట్టి వీణ , తీయగ మ్రోగెన్
  రాగము యుతముగ జక్కగ
  తీగలు మఱి యుండు వీణ దీటుగ రవికిన్

  రిప్లయితొలగించండి
 7. యోగము కాదా !కృష్ణా!
  నీగానము వినిన చాలు నిశ్చల మతితో
  వేగెడు నామానసమున
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్!!!

  రిప్లయితొలగించండి
 8. రాగస్వరములు గళమున
  భాగముగా ఘంటసాల పాడుచు దివిలో
  సాగించె నాదయోగమె
  తీగెలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  రిప్లయితొలగించండి
 9. ఆగుమువీణానామది
  సాగెడిననురాగమందుసంగీతంబై
  దాగినకోర్కెలుమీటగ?
  తీగలులేనట్టివీణతియ్యగ-మ్రోగెన్
  త్రాగినమైకంబందనె
  తీగలులేనట్టివీణతియ్యగమ్రోగెన్|
  ఆగనిమమకారంబున
  దాగినవాత్చల్యతున్న?తప్పకవినులే|

  రిప్లయితొలగించండి
 10. శ్రీగురుభ్యోనమ:

  సాగగ కవితా గానము
  రాగము దీయుచును పద్యరాసుల జెప్పన్
  మ్రోగిన సత్కవి గళమే
  తీగెలు లేనట్టి వీణ, తీయగ మ్రోగెన్.

  తెలుగు సాహిత్య రంగమునకు, అవధాన విద్యకు విసేష సేవలనందించిన శ్రీమాన్ రాళ్ళబండి కవితాప్రసద్ గారి నిధనము ఒక తీరని లోటు.
  ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలుగవలెనని ప్రార్థిస్తున్నాను.

  గతుకు బాటన నడిపించె కైత బండి
  రాటు దేలిన సత్కవి రాళ్ళబండి
  యమరుడై నిల్చె నవధాన యబ్రమందు
  సమిద తానౌచు సాహితీ జన్నమందు

  తీరని లోటు(బాధ) నిల్పి యిల, దేవునిసన్నిధి జేరిపోతివా
  మీరిక మాకు లేరనిన మిక్కీలి దు:ఖము కల్గె సత్కవీ
  ధారణ విద్య యైన యవధానపు వెల్గులు చిన్నబోయెనే
  తారగ నిల్చినావు కవితా గగనంబున భారతీ కృపన్.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునితో యుద్ధ రంగమున:

  సాగిల పడనేల విజయ!
  సాగుము నా గీత తెలుపు సత్యము తోదన్
  ఆగదు జయమన, రాగము,
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్!

  (తీగలు = బంధములు)

  రిప్లయితొలగించండి
 12. రాగాలాపన జేయుచు
  సాగగ సరిగమల పాట స్వరమందించన్
  మ్రోగించగ నపుడు వదలు
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్!

  రిప్లయితొలగించండి
 13. వాగీశ్వరి కృపతోడను
  రాగమ్ముల ననుకరించి రంజిలజేయన్
  మ్రోగించగ కంఠముతో
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్!

  రిప్లయితొలగించండి
 14. రాళ్లబండికవితాప్రసాద్గారిమరణమువిచారించదగినది
  -----------------------
  రాళ్లబండి-రానిరాజ్యానికెళ్ళినా
  కవి-ప్రసాదములనుగాంచగలము|
  అలుపుసలుపులేని-ఆంద్రరత్నమతడు
  పద్యవిద్యయందు-ప్రతిభహితుడు|
  పాతికవేలకుఫైగా
  జాతికిపద్యాలుబంచి-జనజాగృతిగా
  నేతగమనకందించగ?
  ఏతరమునుమర్వబోరు-నెప్పటికైనన్

  రిప్లయితొలగించండి
 15. మూగదియౌనొక భార్యయు
  రాగము తోడను పెనిమిటి,రంజిలు సుతులన్
  వేగమనందిడ ప్రేమను,
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  మూగుచు మావిని పికములు
  రాగపు కూతల మనసును రంజిల జేయన్,
  వేగమ వసంత మందున
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  సాగెను పోతన కైతయె
  వేగమ భాగవత మందు విరియుచు శబ్దాల్
  తా,గమకాలటు పలుకన్,
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  మూగగ వసంత మదియును,
  తా,గమనించియు,మదనుడు,ధైర్యము శివుపై
  వేగమ శరములు గురియగ
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  రాగపు పలుకుల యతియై
  వేగమ చేకొని సుభద్ర విజయుడు మించన్
  తా గమనించదె పార్ధుగ
  తీగలు లేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులకు నమస్కృతులు.
  అసలే అనారోగ్యం. ఆపై తప్పని ప్రయాణాలు. ఇంతకుముందే ఇల్లు చేరాను. పూరణలను పరిశీలిద్దామని కూర్చోగానే విపరీతంగా వాంతులు. ఇక ఏమాత్రం ఓపిక లేదు. పూరణలు పంపిన మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అతికష్టంమీద రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను. పద్యరచన శీర్షికకోసం చిత్రాన్ని వెదికే ఓపిక లేదు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 17. మాస్టరుగారూ ! మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను..తగిన విశ్రాంతి తీసుకోండి.....

  రిప్లయితొలగించండి
 18. విశ్రాంతి తీసుకొని, త్వరగా స్వస్థత చేకూరాలని ప్రార్థిస్తూ...

  రిప్లయితొలగించండి
 19. శ్రీ కవితా ప్రసాద్ గారి మరణం సాహితీ లోకానికి తీరని లోటు...వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 20. గురువు గారు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ అశీర్వదించి అక్క

  రిప్లయితొలగించండి
 21. నా గదిని దొంగ దూరగ
  దాగుచు మంచము వెనుకగ దగ్గర రాగా
  లాగించి గుండు గొట్టగ
  తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  రిప్లయితొలగించండి


 22. పాగల్ఖానాన జిలే
  బీ,గట్టిగ లాగగాను బిగువును వీడెన్
  బేగడ రాగము తోడన్
  తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్:)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. వేగమె గానము నేర్చుచు
  సాగగ దీయుచును గొంతు జంబము మీరన్
  వాగగ శ్రీమతి విరిగెడు
  తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్

  రిప్లయితొలగించండి