చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
సగము క్రాపుదువ్వి సగము జడను వేసి
రిప్లయితొలగించండిసగము చీర, ఫ్యాంటు సగము తొడిగి
యాధునికయుగమున యర్ధనారీశ్వరు
డిలను వెలసె బాపు వలన గాదె
వినుడు కైలాస ముననున్న వేల్పు దల్చ
రిప్లయితొలగించండిఅర్థ నారీశ్వరుండిక నార్తి బాపు
కనుడిటవిలాసముగ గీసె ఘనపు గీత
అర్థ నరనారి చిత్రమ్ము నదివొ బాపు.
అర్ధ నారీశ్వరుండయ్యె యతివ-మగడు
రిప్లయితొలగించండిసంపద వాహన సామాగ్రి సగము సగము
పెరుగు ఖర్చుల ధాటికి బేల పడక
సమము సమమని బల్కుటె సవ్య మయ్య!
ఇంటిలోని పనుల నింపుగా చేయును
రిప్లయితొలగించండికొలువు లందు గూడ వెలుగు సతము
చీరకట్టు లోన శృంగార మొలికించు
ఖాకి డ్రస్సు లోన కరుకు చూపు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బాపుబొమ్మగబుట్టినపడతిగాన
రిప్లయితొలగించండినాటి,నేటినిసమకూర్చిచాటినట్లు
తెలుగుభాషకు నాంగ్లమ్ముగలసినట్లు
సుందరమ్మగుపడతినిచూపుటాయె|
సగము భాగము పురుషుడు సగము వనిత
రిప్లయితొలగించండిగాను రూపుది ద్దబడెను గనుము బాల !
అర్ధ భాగము పార్వతి యర్ధము మృ డు
నివలె చిత్రము గలదట నిజము గాను
నిన్నటి పద్య రచన :
రిప్లయితొలగించండిచరణపు టంగులి కుండెడు
నరపుత్తేజము సమర్థ నాతిగ మార్చన్
వరమై యింటిని దీర్చగఁ
దరుణికి మెట్టల మగండు తనరఁగఁ దొడుగున్!
నేటి పద్యరచన :
ఇంట వంట వార్చ నింతులుండగ నాడు
బయటి పనులఁ జూడ పతియె నుండె
నింట బయట తానె యినుమడించగ నేడు
పురుషుడర్ధ మాయె పుణ్య స్త్రీకి!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
బారుగ కేశపు సౌరును
రిప్లయితొలగించండిజోరుగ మగవాని లాగు సోకును జేయ
న్నేరీతి చూదమన్నను
నారీనరులిటు కలసిన నవ్యపు తీరౌ!
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.