1, మార్చి 2015, ఆదివారం

పద్యరచన - 835

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. మెట్టెలు తొడుగును తాళిని
  కట్టిన పురుషుండు సతికి కళ్యాణమునన్
  పెట్టుకొను పుణ్యస్త్రీలీ
  మెట్టెలు సౌభాగ్యమనుచు మిక్కిలి ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 2. కాలి మెట్టె చూచి  కల్యాణవతి వేళ్ళ 
  గౌర వించ వలయు ఊరు వాడ 
  సార మిదియె హిందుసంఘ సంస్కృతి జూడ 
  తెలియ  జేయ  మనము తేట పరచి

  రిప్లయితొలగించండి
 3. అతివల కైదవ తనమని
  పతియగు పురుషుండు కుదించు పరిణయ మందు
  న్నతి పవిత్రమైన మెట్టెలు
  యితిహాసము లందు దెలిపె నేడడు గులకున్

  రిప్లయితొలగించండి
 4. చిత్ర మందున జూడగ జిత్త మలరె
  తొడుగు చుండుట మెట్టెలు తోయలికట
  కాలి మెట్టెలు గలిగెడు కాంత లనిల
  మాతృ మూర్తిగ భావించి మసలు కొనుడు

  రిప్లయితొలగించండి
 5. చుట్టములందరి ముందున
  మెట్టిన యింటికి బిలుచుచు మెట్టెలనపుడున్
  పట్టిని ఈయంగను చే
  పట్టిన వాడే చరణము బట్టుచు బెట్టెన్

  రిప్లయితొలగించండి
 6. పతిపదములకు మ్రొక్కిన సతిని గాంచి
  మెట్టెలను తొడుగుటకుతా పట్టి పదము
  చరణుదాసిని స్వయముగా చరణు వేడె
  కరుణతోడ కుటుంబముఁ గాచు మనుచు
  సమతమమత నా దృశ్యము చాటి చెప్పు

  రిప్లయితొలగించండి
 7. నెచ్చెలి నీదు పాదములు నెమ్మిని విచ్చిన యెర్ర దామరల్
  పుచ్చుకొనంగ నా తనువు పుల్కలు దేరెను వెండి మెట్టెలన్
  ముచ్చట దీర నుంచెదను మోదముతో నడయాడ రావె యా
  చిచ్చరకంటి పత్ని వలె చేయ శుభమ్ముల మెట్టి నింటిలో.
  మెట్టెల దాల్చు పాదములు మెల్లగ పట్టపు రాణి చిన్నెలే
  యుట్టి పడంగ నిట్టటుల నుల్లము లూరగ చిట్టి మువ్వలం
  జుట్టిన యందెలన్ దవిలి శోభల నాడగ మెట్టినింట జే
  పట్టిన భర్త జీవితపు భాగ్యము బట్ట తరమ్మె యేరికిన్?

  రిప్లయితొలగించండి
 8. ఆయువు పట్టైన వేలికి యనువు గాను
  మట్టెలుందొడిగి యారోగ్య మందగాను
  పెద్దలేర్పాటు జేసిరి పేర్మి దోడ!
  అన్య దేశము లందున అనుసరించె!

  కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దాని నుంచి విద్యుత్తు ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని అంటారు. గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్ళకు సంబంధం ఉంటుంది. వేళ్ళకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెలవల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు.

  రిప్లయితొలగించండి
 9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘అతిపావనమగు మెట్టెలు’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  మొదటి పాదంలో గణదోషం. రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
  *****
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  వివరణతో కూడిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. పుట్టినిల్లవీడు|కట్టెడితాళిచే
  మెట్టెలుంచమగడు-కట్టుబాటు
  కన్య-శ్రీమతగును|కళ్యాణఘడియలో
  సప్తపదిపునాదిసాగుకొరకు
  కట్టెడితాళిచేతతనకాంతునిచెంతనచేరగానె?తా
  మెట్టెలుబెట్టివేళ్ళకునుమేటియునీవనిచాటునట్లుగా
  చట్టముగాక?సంస్కరణసంపదబంతురుపెళ్లిపందిటన్
  తట్టినయూహగాదుతమతాతలతండ్రులసాంప్రదాయమే|

  రిప్లయితొలగించండి
 11. ఒద్దికతో సతీమణికి నొప్పుగ మెట్టెల వెట్టుచో, నదో
  ముద్దుగ పాదమట్లొసగి ముచ్చటఁ జూచెడు పత్నిఁ గాంచుచో
  హద్దులు నేర్చునే కనుల కబ్బురమౌ గతి చూచుచున్న యా
  యిద్దరి కన్నవారి మది నిబ్బడి ముబ్బడి గా ప్రమోదముల్?

  రిప్లయితొలగించండి
 12. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మెట్టెలు బెట్టుచు వధువుకు
  బట్టును చరణమ్ము వరుడు పరిణయమందున్
  కట్టిన తాళిని వరముగ
  మెట్టింటికి పయనమగును మీనాక్షి రహిన్ !!!

  రిప్లయితొలగించండి
 14. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. చరణపు వ్రేలిన నుండెడు
  నరపుత్తేజము సమర్థ నాతిగ మార్చన్
  వరమై యింటిని దీర్చగఁ
  దరుణికి మెట్టల మగండు తనరఁగఁ దొడుగున్!

  రిప్లయితొలగించండి