2, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1610 (అక్కఱకు రావు నీతివాక్యములు మనకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అక్కఱకు రావు నీతివాక్యములు మనకు.

21 కామెంట్‌లు:

  1. "రావు" తనయింటి పేరుగ రకరకముల
    పాత్రలందలరించి గోపాలరావు
    చిత్రములనెన్ని నీతులు చెప్పె - వచ్చు
    నక్కఱకు "రావు" నీతి వాక్యములు మనకు
    (రావుగోపాలరావు ప్రతినాయకపాత్రలు వేసినా చాలా నీతులను సామెతల ద్వారా చెప్పాడు)

    రిప్లయితొలగించండి
  2. నడి సముద్రమందు తుఫాను నావ ముంచ 
    అక్కఱకు రావు నీతివాక్యములు మనకు.
    ఆపదలయందుపాయమే అడ్డు నిన్ను
    నీతి వాక్యములు పలుకు నిజము లివియె 


    రిప్లయితొలగించండి
  3. మంద బుద్ధిని గల్గిన మంద ముందు
    చెవుల పిల్లిగ సద్బోధ చేటు దెచ్చు
    చెవిటి వానిని మించిన చెనటి మార్చ
    నక్కఱకు రావు నీతివాక్యములు మనకు.

    రిప్లయితొలగించండి
  4. పండితుండుగ వెలిగెను పట్న మందు
    మాన మనిజెప్పె ఉల్లిని మాంస మనియె;
    భార్య ఉల్లిని మరువగ బాధ పడెను,
    అక్కఱకు రావు నీతివాక్యములు మనకు.

    రిప్లయితొలగించండి
  5. అక్కరకురావు నీతి వాక్యములుమనకు
    నాచరింపక నిచ్చతో ననవరతము
    నీతికి నిలబడిన కడు ఖ్యాతి గలుగు
    తెలుసుకొని మనుడిలలోన తీరుగాను

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
    ===============*=================
    నేల విడచి సామును జేయు నేత లుండ,
    వావి వరుసలు దెలియని పందు లుండ,
    రాతి,నాతి యొక్కటి యను రాక్షసులకు!
    అక్కఱకు రావు నీతివాక్యములు!మనకు,

    రిప్లయితొలగించండి
  8. వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మఱ్ఱివిత్తను-నవినీతిమానుగాగ|
    నీతిమొక్కలునీడలోనిలిచిమొలువ?
    పేరుగబోనట్టిరీతిగా?వెతలనడుమ
    అక్కఱకురావునీతివాక్యములుమనకు
    ---------
    నీతినవినీతిగామార్చ?నేటియుగము
    జాతిసంస్కృతిమలినమైపాతబడగ|
    రోతకల్తీలవలెపూతనేతయుగముఅక్కఱకురావునీతి
    వాక్యములుమనకు

    రిప్లయితొలగించండి
  10. సకల సౌకర్యయుక్తమై సాగునపుడు
    తమ విరోధులఁ గూల్చెడు తరుణమందు
    నరయ సంపదలభివృద్ధి బఱచునపుడు
    నక్కఱకు రావు నీతివాక్యములు మనకు.

    రిప్లయితొలగించండి
  11. చెడ్డ కాలము దాపురిం చెడు స మయము
    వచ్చు నెడలను ,నెవ్వరు బాగు కొఱకు
    నెంత చెప్పిన మనకవి యింత గూడ
    అక్కఱకు రావు నీతి వాక్యములు మనకు

    రిప్లయితొలగించండి
  12. నేత లెపుడైన నీతితో నెగడ గలరె !
    దాసులము కదా డబ్బుకు ధరణిలోన
    కలసి వచ్చెను పదవులు కాసులేరు
    అక్కఱకు రావు నీతివాక్యములు మనకు

    రిప్లయితొలగించండి
  13. కె. ఈశ్వరప్ప గారూ,
    రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. నిన్నటి దత్తపది :

    తాపసి వేషము నందున దానవుండు,
    కైకసి సుతుండు సీతను ఖైదు జేయ
    నరసి మారుతి తోడనా యఖిల విభుడు
    కసిమసిన్ బాపఁ దరుణికిఁ గదలె ప్రభువు.

    నేటి సమస్యా పూరణం:

    రాష్ట్ర ప్రత్యేక హోదాయె లక్ష్యమనగ
    పోలవర సాధనమ్మది పూనికనగ
    నక్కఱకు రావు నీతివాక్యములు మనకు
    చేసి చూపిన మ్రొక్కమె చేతు లెత్తి!


    రిప్లయితొలగించండి
  15. పలుకు చుండియు నీతిని వాక్కులందు
    చేతలందున దుర్నీతి చెలగువారె
    ఘనులు నౌచును చెలగెడి కారణమున
    నక్కరకు రావు నీతివాక్యములు మనకు

    సూటిగానుండి నీతిని సొంపు పలుక
    నదియె కలిలోన శోభగాదరయగాను
    జగతి లౌక్యంబె ముఖ్యమౌ సౌరునంద
    నక్కరకురావు నీతివాక్యములు మనకు

    ఈ కలిని నీతియవసరం బెంతొ విడిచి
    పలుక,జనులవినీతుగా వాని జూతు
    రిలను,పలుకక పాటింప నింపు మాట
    లక్కరకురావు నీతివాఅక్యములు మనకు

    రిప్లయితొలగించండి
  16. లెక్కలేనన్ని పరుషముల్ మిక్కిలిగను
    యెక్కడైనను వాడుదురెల్లజనులు
    చల్లబరచుచు మనసును శాంతి పరుప
    నక్కఱకురావు నీతివాక్యములు మనకు

    రిప్లయితొలగించండి
  17. మంచి కాలము నావంటి మంచివాడు
    కాన రాడు కొంచెము కష్ట కాలమందు
    మంచు కరగురీతి వదలె మంచితనము
    అక్కఱకు రావు నీతివాక్యములు మనకు

    రిప్లయితొలగించండి
  18. "రావు" దెలిపిన సాహిత్య రసపు నీతి
    మనసు మళ్ళించు వాక్యాల మంచి దనము
    నరుని చింతలు చల్లార్చు నపుడు ,వచ్చు
    నక్కరకు "రావు " నీతి వాక్యములు మనకు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  19. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వ.రా.స. గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. పెద్దవారలు హితమునుఁ బ్రేమతోడఁ
    గూరిచి పలుకులందున నేరుపు గని
    పింప నొసగిరి. హతవిధీ! పేర్మి యొకటె
    యక్కఱకు రావు నీతివాక్యములు మనకు.

    పేర్మి= ముచ్చట, మురిపెము

    రిప్లయితొలగించండి
  21. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి