15, మార్చి 2015, ఆదివారం

దత్తపది - 70 (కాకి-జాజి-పాపి-వావి)

కవిమిత్రులారా!
కాకి - జాజి - పాపి - వావి.
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. వావి వరుసలు లేకను పాపి వలెను
    ఆశ్ర మంబున నిలువగ యాజ్ఞ సేని
    జాజి సుమమను బ్రమలోన మోజు బడగ
    సమసి కూలెను కాకిలా సైంధ వుండు

    రిప్లయితొలగించండి
  2. వావి వరసలు చూడని పాపి యయిన
    భగిని పతియై జయద్రత బతికి పోయె
    గీక తలజుట్టు భీముడా కాకి కపుడు
    జాజి రాటకు పూనిరి జనము జూచి

    (జాజిరాట : తెలంగాణ పదకోశం
    కాముని పున్నమి సందర్భంలో ఆడే ఆట)

    రిప్లయితొలగించండి
  3. వస్త్రాప హరణ ఘట్టం లో ద్రౌపది ప్రార్థన.

    పాపి చీరెలు లాగుచు పైకి వచ్చె
    నగుచు, సభలోన నేకాకి నగుచు నుంటి
    వచ్చి కాపాడవా విష్ణు ! పరమ పురుష !
    జాజి వలె నేను నలుగుదు జాగు సేయ.

    రిప్లయితొలగించండి
  4. జాజి పూవంటి పూబోడి సత్యనుగని
    వావి వరసల నెంచక పఱిగొనంగ
    పాపి యౌసైంధవునిబట్టి పరిభవించి
    కత్తిరించెను భీముడా కాకి జుట్టు!!!

    రిప్లయితొలగించండి
  5. శైలజ గారూ ! బాగుంది...
    చిన్న సవరణ....చేయండి

    జాజి పూవంటి ద్రౌపదీ సతిని గనుచు

    రిప్లయితొలగించండి
  6. వావి వరుసలు జూడక పాపి యైన
    సైంధవుడు కామ ముగలిగి సాధ్వియుమఱి
    జాజి పుష్పము బోలగ మోజు గలిగి
    కాకి రూపు డా సైంధవ ఖలుడు వలచి
    ద్రౌపదిని మఱి చెందెను దుర్గతి నిల

    రిప్లయితొలగించండి
  7. ఆ.వె. పాపి చింత తోడ ద్రౌపది హింసించె
    జాజి నెపము చేత శాప మొందె
    యింత కష్ట మోర్చి యేకాకి నయ్యెరా
    వావి వరుస లేని వారి జేరి
    (కర్ణుని అవస్త గురించి ఇక్కడ "జాజి " అనే పదం "జాతి" అనే అర్ధం లో వ్రాయబడినది గమనించగలరు)

    రిప్లయితొలగించండి
  8. కృష్ణుఁడు ధర్మరాజుతో......

    పాండవతిలకా! కితవము వలన నిడుము
    లనుభవించితిరి; కురురా జాజిఁ జచ్చు;
    నీదు గెలు పా పినాకియె నిశ్చయించెఁ;
    దలఁపవా విబుధవరుల పలుకు లిపుడు.

    రిప్లయితొలగించండి
  9. మాష్టారు దత్తపదాలను ప్రశస్త్యంగా వాడినారు...రాత్రంతా అలా వ్రాద్దామని విఫలయత్నం చేశాను...కృతకత్యుడినవలేదు

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జయద్రత(థ)’ అని విభక్తి ప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘భగిని పతి జయద్రథుఁడు తా బ్రతికిపోయె’ అందామా?
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    గోలి వారి సవరణ స్వాగతించదగినది.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదాన్ని ‘జాజిపూ వంటి సతిపైన మోజు గలిగి’ అనండి.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ధన్యవాదాలు.
    ప్రయత్నించండి. సఫలత తప్పక పొందుతారు.

    రిప్లయితొలగించండి
  11. పాండవ సతి కురులు బట్టి వావివరుస
    మరచి పాపి దుశ్శాసను డరచుకుంటు
    కాకివలె, ద్రౌపది కట్టిన కోకలాగ
    సన్నజాజి వంటి సతిని సభకు నీడ్చె!

    రిప్లయితొలగించండి
  12. వాయు పుత్రకా కినుకను వదలు మయ్య
    కౌరవుల జాజి నాశమౌ కచ్చితముగ
    బాధలను పాపి విజయము వచ్చు వరకు
    వావిరిన్ సహాయముఁ జేసి ప్రబలు డగుదు

    రిప్లయితొలగించండి
  13. కృష్ణుణ్ణి అర్జునుడు కోరకొనుట జూచి దుర్యోధనుని స్వగతం:-
    తుద"కా కి"రీటి కోరెను
    గద రారా"జా జి"నునిక కయ్యములో లే
    దెదురిక కా"వా వి"జయుడ
    వు దునుము "పాపి"ష్ఠి పాండవులనందరినిన్

    రిప్లయితొలగించండి
  14. శ్రీ హనుమచ్ఛాస్త్రి గారికి ...ధన్యవాదములు..మీ సవరణ బాగుంది..
    జాజి పూవంటి ద్రౌపదీ సతిని గనుచు
    వావి వరసల నెంచక పఱిగొనంగ
    పాపి యౌసైంధవునిబట్టి పరిభవించి
    కత్తిరించెను భీముడా కాకి జుట్టు!!!

    రిప్లయితొలగించండి
  15. ఎందుకాకినుకవహింతువే?సుభద్ర
    జడన-సన్నజాజికినీవిచారమేల?
    అర్జునుండు|యేపాపికొండందులేడు
    వావివరుసగనిన్నంటు-తావివోలె
    ఏకాకిజేసికృష్ణ్డుని
    మూకగకౌరవులుబట్టముట్టుటకౌనా?
    తాకగజాజియ?పాపియ?
    లోకాలేవావివరుస-లుబ్దులకౌనా?


    రిప్లయితొలగించండి
  16. "విరజాజి బోలు సిరివా?
    విరి బోణీ! ఎవతె వీవు?వెరపా?పిలువన్,
    సరసకు జేరవు, యలుకా?
    కిరీటధారిణిని జేతు",కీచకు డనియెన్

    రిప్లయితొలగించండి
  17. కె.యెస్.గురుమూర్తిఆచారి గారి పూరణ
    సరసిజవ్యూహరచనలో జాజి యైన
    పట్టి నభిమన్యు నేకాకి పట్టి జంపి
    నట్టి-పాపిని వధియింతు నని కిరీటి
    వావిరి యగు బీరమున శపథము జేసె

    రిప్లయితొలగించండి
  18. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అరచుకుంటు’ అన్నదానిని ‘అరచుకొనుచు’ అనండి.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. కష్టం అంటూనే కందంలో దత్తపదిని సమర్థంగా పూరించారు. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. రాయబారి కృష్ణయ్య తో రారాజు:

    పాపి ననుచు మమ్ము చూపించ నెంతువే?
    కాకి గోల నాపు గగన శ్యామ!
    జాజి ముడవ లేదు యాజికే సిద్ధమ్ము!
    మాధవా! విసుర్లు మాన వయ్య!

    రిప్లయితొలగించండి
  20. వావి లేకొక భార్యతో వరలు వారు
    పాపి జన్మంబు వారలు పాండు సుతులు
    జాజి పూలంచు పొగడెదు చాలు కృష్ణ!
    కాకి వర్తన వారనె కౌరవుండు!

    కాకి వోలెను రారాజ!కదలకుండ
    నీట నుంటివి పాపివై నేమ ముడిగి
    వావి విడచియు ద్రోవది వలువ లూడ్చి
    జాజి వంటిదౌ కులకీర్తి జార విడవె?

    కాకి వోలెను కూసెడు కర్ణ!చేత
    పాపి వైతివి యభిమన్యు పద్మమందు
    చంపి,జాజి పూయశము సకలము విడి
    వావి తలపక సభలోన వదరినావు

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు నమస్సులు, సవరణకు ధన్యవాదములు, సవరణతో.....

    పాండవ సతి కురులు బట్టి వావివరుస
    మరచి పాపి దుశ్శాసను డరచుకొనుచు
    కాకివలె, ద్రౌపది కట్టిన కోకలాగ
    సన్నజాజి వంటి సతిని సభకు నీడ్చె!

    రిప్లయితొలగించండి
  22. మాస్టరు గారూ !ధన్యవాదములు..
    మీ దత్తపది విరుపులు మెరుపులే.....

    రిప్లయితొలగించండి
  23. అర్జునుని స్వగతం

    యుద్ధమందున నేకాకి యోద్ధ నేను
    ధర్మరాజాజిని నిలచి కర్మి యౌనొ?
    కాడొ?భీతిని యెదబాపి కావు మయ్య,
    కృష్ణ!బావా!వినతిచేతు, కీర్తి నిల్పు!

    రిప్లయితొలగించండి
  24. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గగనశ్యామ’ అన్నప్పుడు ‘న’ గురువై గణదోషం. ‘కాకిగోల నాపు కంసవైరి’ అనండి.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. పుత్రకా! కిరీటియె వధువును గెలిచిన
    గాని వేదిజా జితియును గాదె మిమ్ముఁ
    బొంద! ద్రుపద నృపా! పిల్చి ముదముతోడ
    కన్నె నొసగుము. వావిరి కనుము నిజము.

    కుంతి సందేహనివృత్తి చేస్తూ పలికిన మాటలు...

    బిడ్డా! కిరీటి వధువును గెలుచుకున్నా కూడా మిమ్ముల్నందర్నీ పొందగలగడం ఆమెకు గెలుపే కదా!
    ద్రుపదరాజా!ఐదుగుర్నీ పిలిచి పిల్లనీయవయ్యా! క్రమంగా నిజము తెలుసుకోగలవు.
    జితి= గెలుపు వావిరి= క్రమము

    రిప్లయితొలగించండి
  26. లక్ష్మీదేవి గారూ,
    అద్భుతమైన పూరణ చేశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    రాయబారి కృష్ణయ్య తో రారాజు:

    పాపి ననుచు మమ్ము చూపించ నెంతువే?
    కాకి గోల నాపు కంస వైరి!
    జాజి ముడవ లేదు యాజికే సిద్ధమ్ము!
    మాధవా! విసుర్లు మాన వయ్య!

    రిప్లయితొలగించండి