14, మార్చి 2015, శనివారం

సమస్యా పూరణం - 1622 (రమ్ము జనులకు శరణమ్ము గాదె!)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రమ్ము జనులకు శరణమ్ము గాదె!
(గరికిపాటివారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

30 కామెంట్‌లు:

  1. నిన్నటి పద్యం:
    జెండాపై కపి రాజు పద్యము పాడుచును....

    ఇది తప్పేమో తెలీదు ? దయచేసి తెలుపగలరు
    గాడిన్, తల కడన్ --> రథము మొదట్లో అని

    వానర ముఖ్యుని జేర్చియు
    గానము సేయంగ నొప్పు, గాడిదల కడన్
    వెన్నుడు రథము నడుప యు
    ద్ధాన పరాజయము తప్పదనుచు బలుకుచున్

    రిప్లయితొలగించండి
  2. ఇమ్ముగ జలధితటి నిందుమౌళి నిలచి
    మమ్ము బ్రోవుననుచు నమ్మినాము
    కమ్మనైన గరళకంఠుసేవ శుభక
    రమ్ము జనులకు శరణమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  3. సాంద్ర తీర మందు రుద్రుడే దిగివచ్చె
    ప్రళయ మొచ్చె నేని భయము వలదు
    ప్రాణ రక్ష జేయ పరమేశు కాచువ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  4. అగ్ని సాక్షి జేసి యాలియై చెలిమితో
    కష్ట నష్ట మందు కలసి యుండి
    ప్రేమ సుధను పంచు పెండ్ల మన్న మమకా
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!!

    రిప్లయితొలగించండి
  5. దుష్ట నాయకు లొక్కటై దోచు కొనుచు
    ప్రజల ధన మాన రక్షణ వదలుచుండ్రి
    స్వార్థ రహితులు పాలన సలుప సత్వ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    రిప్లయితొలగించండి
  6. అమ్మల గనినట్టి యమ్మయే కనునను
    నమ్మకమ్ము నుంచి నెమ్మనమున
    నిమ్మహీతలమున నమ్మపూజ శుభక
    రమ్ము జనులకు శరణమ్ము గాదె.

    రిప్లయితొలగించండి
  7. మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారు ఆటవెలది సమస్యకు తేటగీతి పూరణ చేశారు(ప్రమాదవశాత్తు)అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  8. భ్రాతృప్రేమలోని పారమ్య తత్వంబు
    మిత్ర భావ మొసగు మేటి విలువ
    రామచరిత లోని రమణీయ కధల సా
    రమ్ము జనులకు శరణమ్ము కాదె!

    రిప్లయితొలగించండి
  9. ramakrishnamurthy renduchintala గారికి ధన్యవాదములు.
    దుష్ట నేత లెల్ల దోచుకొనుచు ప్రజ
    తాగితందనముల సాగుచుండ్రి
    నీతి గల్గి నట్టి నేతలున్నను సత్వ
    రమ్ము జనులకు శరణమ్ముగాదె

    రిప్లయితొలగించండి
  10. రమ్ము జనుల కుశ ర ణమ్ము గాదె యనుచు
    నిజము పలికి రార్య ! నీదు మాట
    యక్ష రాల నిజమ, యదియ లే నియె డల
    పనులు జరుగ విపుడు ప్రభుత యొద్ద

    రిప్లయితొలగించండి
  11. మాజేటి సుమలత గారూ,
    మీ నిన్నటి పూరణలో మూడవ పాదంలో ప్రాస తప్పింది. ఇక ‘గాడి’ అన్యదేశ్యం. పూరణ తృపికరంగా లేదనడానికి చింతిస్తున్నాను.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. రెండవ పాదంలో ‘ఒచ్చె’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘సాగరతటిలోన శర్వుడే వెలసెను| ప్రళయ మేగుదెంచు భయము వలదు’ అందాం.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. కాని సమస్య ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. నా సవరణతో మీ పద్యం....
    దుష్టనాయకు లదె దోచుకొనసాగిరి
    ప్రజల రక్షణమును వదలినారు
    స్వార్థరహితమైన పాలనమ్మే సత్వ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. అది చూడకముందే నా సవరణను సూచించాను.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. సకల జీవులకును శాంతిసౌఖ్యములిడి
    ముక్తినొసగు నట్టి భక్తి పధము
    సిరులకు నిలయమ్ము శ్రీనివాసుని పావ
    రమ్ము , జనులకు శరణమ్ముగాదె!!!

    రిప్లయితొలగించండి
  13. భక్తి శ్రధ్ధల బూజించ ప్రతిదినమ్ము
    విఘ్నములను తొలగజేసి విజయమొసగి
    వరములిడు కరివదనుని భవ్యమగు క
    రమ్ము,జనులకు శరణమ్ము గాదె నిలను!!!

    రిప్లయితొలగించండి
  14. మాట మూటలుంచిఓటుకునోటెంచి
    మంత్రిపదవిరాగ?మంత్రగాడు
    నుంచుతంత్రములు,మనోహరమ్ముజనుల
    కు|శరణమ్ముగాదె?కుచ్చితంబు|

    రిప్లయితొలగించండి
  15. రావణప్రముఖుల రాక్షస సంహార
    మును ఘటించి శాంతి పెనగఁజేసి
    పరిఢవిల్లునట్టి ప్రథిత రామకర శ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె.

    రిప్లయితొలగించండి
  16. భక్తి మార్గమందు ముక్తిని బొందుట
    భక్త జనులకున్న బాట యొకటె
    నిక్క మైన భక్తి నిరతమ్ము జేయ గౌ
    రమ్ము! జనులకు శరణమ్ము గాదె!

    రిప్లయితొలగించండి
  17. పట్టణమ్ములోన బనులను జేసేడు
    ప్రజలు బరుగులిడుట పాటియౌను
    మందగించి యున్న మనుగడుండదు, వేగి
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    రిప్లయితొలగించండి
  18. వెట్టిచాకిరేల?విద్యనేర్వుమిక-సా
    రమ్ముజనులకు,శరణమ్ముగాదె
    శ్రద్దగానునేర్వ?సంపదతోబాటు
    కీర్తిగలుగజేసి|కీడుమాన్పు

    రిప్లయితొలగించండి
  19. నీరులేక ప్రజలు నీరసించి నపుడు
    బీరుత్రాగినారు బారులందు
    బీరు తాటి కల్లు సారాయిలేనిచో
    రమ్ము జనులకు శరణమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  20. వోటు కొరకు రాక పోకలు సాగించు
    నేత.ఎన్నికవగ నియతి మరచు.
    రాజ్యమేలు తాను.రాజధానీ నగ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  21. నగజ తనయు డొప్పు నాయకుడాతడై
    గణము లన్నిటికిని ఘనపు మగడు
    యెలుక నెక్కితిరుగు నేనుగు ముఖమౌ శి
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    ఏడుకొండల పయి నింపుగా వెలసిన
    వేంకటేశుడతడు వేగ కలిని
    భక్తులెల్ల గాచు,వాని యభయమౌ,క
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    తారకమ్ము తోడ తన్మయుడౌచును
    భక్తి బలము తెలుపు భక్తుడతడు
    యెదను రామచంద్రు నింపుగానిడునా,యు
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    తనువు నందు సగము తానిచ్చి నగజకు
    శిరము నందు గంగ శివుడు దాల్చె
    యుబ్బులింగడతనికొప్పెడు నుదుటి,నే
    త్రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    విష్ణుపత్నియౌచు,విత్తమ్మె తానయై
    పద్మ మందు వెలయు భాగ్యలక్ష్మి
    జనులకెల్ల తాను జనని కబరీభ
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    రిప్లయితొలగించండి
  22. శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘పావరమ్ము...?’... ఇది ‘స్థావరమ్ము’కు టైపాటా? అంఘ్రి అనే అర్థంలో ‘పావర’ శబ్దం ఉంది కాని పావరము లేదు.
    రెండవపూరణలో ‘శరణము గాదె యిలను’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘గౌరమ్ము’ వర్ణవిశేషం కదా! మీరు ఏ అర్థంలో ప్రయోగించారు?
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారికి

    1.నేదునూరి రాజేశ్వరి గారి పూరణములో మొదటి పాదమును పరిశీలించండి.ప్రాస యతి కుదిరినట్టు లేదు.
    పైగా ప్రారంభంలో "సాంద్ర" అవసరంలేదు. సముద్రము అనే అర్ధంలో "సంద్ర"అన్నా ప్రాస యతి సరిపోదు.
    2.తిమ్మాజీరావు గారి మొదటి పూరణము లో "బీరు"-"సారా" ఈ రెంటికీ ప్రాస స్థానంలోని దీర్ఘ హ్రస్వ రకారాలకు ప్రాస యతి వేయవచ్చునా? తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  24. ధన్యవాదములు గురువు గారు. నాకు కూడ నచ్చలేదు, ఆలోచన వచ్చింది, అడిగి తెలుసుకొందామని పోస్ట్ చేసినాను.

    రిప్లయితొలగించండి
  25. తప్పు జరిగినది గురువుగారూ సవరణతో.....

    భక్తి మార్గమందు ముక్తిని బొందుట
    భక్తజనులకున్న బాటయొకటె
    నిక్కమైన భక్తి నిరతమ్ము జేయగా
    రమ్ము! జనులకు శరణమ్ము గాదె!

    రిప్లయితొలగించండి
  26. సోమనాథ శాస్త్రి గారూ,
    రాజేశ్వరి గారి పూరణలో దోషాన్ని గుర్తించి సవరణ కూడా సూచించాను. మీరు గమనించలేదు.
    కెంబాయి వారి పూరణలో ప్రాసయతిలో దోషం లేదు. ప్రాసపూర్వాక్షరం యొక్క గురులఘుసామ్యం పాటించాలి కాని, ప్రాసాక్షరానికి కాదు.
    ‘ఘోరా’టవులలోని ‘క్రూర’మృగమ్ములు... ఈ విధంగా...

    రిప్లయితొలగించండి
  27. ఆ.వె.అమ్ము విల్లు విడచె నయ్యోయిదేమంటు
    వెరచి యుద్దమందు వెన్ను నడుగ
    నిజము గాంచుమనియె నేచెప్పు గీతసా
    రమ్ము జనులకు శరణమ్ము గాదె.

    రిప్లయితొలగించండి
  28. పరమ శివుడు మెచ్చి పాశుపతమ్మిడ
    విజయ మంద లేదె విజయు డంత
    తపము నాచరించ దక్కు దైవసహకా
    రమ్ము జనులకు శరణమ్ము గాదె!

    రిప్లయితొలగించండి