17, మార్చి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1624 (ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్.

25 కామెంట్‌లు:

 1. నోరూరించు పదార్ధము
  లే రహదారిదరినైన నెగబడి తినుచున్
  తీరెను కోరిక యనుచున
  నారోగ్యమె భాగ్యమనెదరజ్ఞుల్ మూర్ఖుల్

  రిప్లయితొలగించండి
 2. ఏరోగము లేకుండిన
  యారోగ్యమె భాగ్యమనెద రజ్ఞుల్ , మూర్ఖుల్
  కోరెద రటసిరి సంపద
  నేరీతిగ దొరికి నంత నియమము లేకన్

  రిప్లయితొలగించండి
 3. ఆరోగ్యముగ ఉండిన సమస్యా పూరణల్,
  పద్య రచనల్ పోష్టు చేయవలె!
  నేటి అనారోగ్యము మహా భాగ్యము నాకు !
  ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్ !!


  छुट्टी జిలేబి !

  రిప్లయితొలగించండి

 4. కంది వారు,

  నెమ్మదించి విశ్రాంతి తీసుకొని ఆరోగ్యాన్ని గమనించు కోవలె. టేక్ కేర్ .

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. గురువుగారు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను.

  రిప్లయితొలగించండి
 6. సారపు ఖాదము లిచ్చెడి
  ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ , మూర్ఖుల్
  భారీ కాయము దెచ్చు వి
  కారపు తిళ్ళు కతుకుదురు ఖాయము గాదే!!

  రిప్లయితొలగించండి


 7. మాస్టరుగారూ ! మీరు త్వరగా కోలుకోవాలని కోరుకొనుచున్నాను..తగిన విశ్రాంతి తీసుకోండి....

  రిప్లయితొలగించండి
 8. భారం బవ్వక నుండెడు
  నారోగ్యమె భాగ్యమనెద రజ్ఞుల్, మూర్ఖుల్
  భూరిగ ధనమున్న నదియె
  యారోగ్యం బిచ్చు నందు రవివేకముతో!!!

  రిప్లయితొలగించండి
 9. ప్రణామములు గురువుగారు...మీరు తగిన విశ్రాంతి తీసుకుని,త్వరగా కోలుకోవాలని ప్రార్ధన...

  రిప్లయితొలగించండి
 10. ఆరయ నిజమిది యార్యా !
  యా రోగ్య మె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్
  వారెవరైనను సరియే
  వేరుగ మఱి మాటలాడు విధములు గలవే ?

  రిప్లయితొలగించండి
 11. మాష్టారూ! త్వరగా కోలుకోవటానికి తగినంత విశ్రాంతి తీసుకోండి

  రిప్లయితొలగించండి
 12. ఏరోగము దరిచేరని
  యారోగ్యమె భాగ్యమనెదర జ్ఞుల్ మూర్ఖుల్
  నోరాడించుచు ననిశము
  నారోగ్యముచెఱపుకుంద్రు యవివేకముతో

  రిప్లయితొలగించండి
 13. గురువు గారి ఆరోగ్య త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 14. ఏ రోగము లేనప్పుడు
  భారీగా మాంస మద్య భక్షణచేయ
  న్నారోగ్యముచెడగానే
  ఆరోగ్యమె భాగ్యమనెద రజ్ఞులు మూర్ఖుల్!

  రిప్లయితొలగించండి
 15. శారీరకమానసికత
  కారోగ్యమెభాగ్యమనెద|రజ్ఞుల్,మూర్ఖుల్
  కోరిక?సప్తవ్యసనపు
  బారినబడినాశమైన?బ్రతికియుఫలమా.
  కోరిననాయువుబొందగ
  ఆరోగ్యమెభాగ్యమనెద-రజ్ఞుల్,మూర్ఖుల్
  సారంబొదగనితిండే
  ప్రారబ్ధంబనుచుతినగ?ఫలితముగలదా?

  రిప్లయితొలగించండి
 16. ఆరోగ్యమె-ఆనందము
  ఆరోగ్యమెభాగ్యమనెద.రజ్ఞులు,మూర్ఖుల్
  సారామత్తునబలికిరి
  సారామనవిందుపొందుసర్వంబిదియే.

  రిప్లయితొలగించండి
 17. ఆరోగ్య సూత్రముల్ విడి
  కోరిన తిండిని వివక్ష గుర్తెరుగకనే
  కూరిమి తోడ భుజించుచు
  నారోగ్యమె భాగ్యమనెద రజ్ఞుల్ మూర్ఖుల్!

  రిప్లయితొలగించండి
 18. సారంబౌ జన్మమునను
  నారోగ్యమె భాగ్యమనరె ప్రాజ్ఞుల్ విజ్ఞుల్
  కోరుచు సారా,దాననె
  యారోగ్యమె భాగ్యమనెదరజ్ఞుల్ మూర్ఖుల్

  సారా యొక్కటె నొప్పుల
  పారంద్రోలెడు ననుచును పలుకుచు దానిన్
  మేరయె లేకయె గొనుచు
  న్నారోగ్యమె భాగ్యమనెదరజ్ఞుల్ మూర్ఖుల్

  రిప్లయితొలగించండి
 19. సారెకు సూక్తుల బల్కుచు
  నారోగ్యమె భాగ్యమనెద-రజ్ఞుల్ మూర్ఖుల్
  తారది పట్టించుకొనక
  కోరిన రీతిగ తిరుగుచు కుందెద రిలలో

  ఆరోగ్యము దైవికమౌ
  నారోగ్యమె భాగ్యమనెద-రజ్ఞుల్,మూర్ఖుల్
  చేరుదు రాపదగోరుచు
  నూరక వైద్యముల గొనుచు నుందురు మహిలో!

  గురువు గారికి శీఘ్రారోగ్యాకాంక్షలతో!

  రిప్లయితొలగించండి
 20. కవిమిత్రులకు నమస్కృతులు.
  నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. క్రొత్తగా జ్వరం, గొంతునొప్పి మొదలయ్యాయి. మందులు వాడుతున్నాను. నా ఆరోగ్యం గురించి పరామర్శ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కామా పెట్టడంలో చిన్న పొరపాటు చేశారు. ‘భాగ్య మనెద, రజ్ఞుల్ మూర్ఖుల్’ అంటే అన్వయం కుదురుతుంది.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు
  *****
  జిలేబీ గారూ,
  _/\_ नमस्कार !
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కష్టేఫలి శర్మ గారూ,
  ధన్యవాదాలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ మూడు పూరణ బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. రారా క్లబ్బుకి పోదాం
  లేరా ఒక పెగ్గు పట్టు లీలగ తీరే
  మారును నిజ మిది యిక నీ
  ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్.

  రిప్లయితొలగించండి
 22. తీరుగ వేచిన కూరలు
  పూరీ బిరియాని దోసె మురుకులు చుండల్
  గారెలు బూరెల నొల్లక
  నారోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్

  రిప్లయితొలగించండి


 23. హోరాహోరిగ పోరితి
  పోరా నే రానుపనికి పోరుల సేయన్
  జోరు ముసుగెట్టి తొంగుత
  నారోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్!

  జిలేబి

  రిప్లయితొలగించండి