9, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1617 (అమవసనాఁడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమవసనాఁడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్.
ఈ సమస్యను పంపిన పిరాట్ల శివరామకృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. చం.డమడమలాడెపృధ్వికనుడందరుదిక్కులుపిక్కటిల్లగన్
    దిమిది మినాట్యమాడె పలుతీరులనీప్రజసంతసమ్మునన్
    తమగృహదీపముల్మెరిసెతామునుచంద్రసమానకాంతులన్
    అమవసనాఁడెపున్నమియటంచునుబల్కిరిశాస్త్రకోవిదుల్.

    రిప్లయితొలగించండి
  2. తమియను గోపకాంతయ టతారలకాంతుల జిల్గువెల్గులన్
    విమల మయూఖరేఖలు విభీతినిబొందుచు నాట్యమాడగన్
    నెమలియె సంతసంబున నునెమ్మిని కోరగ మేఘనాధునిన్
    అమవస నాఁడెపున్నమి యటంచునుబల్కిరి శాస్తకోవిదుల్

    రిప్లయితొలగించండి
  3. క్షమించాలి
    ఈ పద్యం ఎలాగో బోలెడు తప్పులుండ వచ్చును ఐనా చివరి పాదం చివరి టైపాటు
    " శాస్త్ర కోవిదుల్ " అని ఉండాలి

    రిప్లయితొలగించండి
  4. పిరాట్ల శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు భయపడినట్లుగా పద్యంలో దోషాలేం లేవు.

    రిప్లయితొలగించండి
  5. ధరణిని సూర్యగ్రహణ
    మ్మెరుగమవసనాఁడె - పున్నమి యటంచును బ
    ల్కిరి శాస్త్రకోవిదుల్ హిమ
    కరునకు నేదినమునందు గ్రహణంబగునో

    రిప్లయితొలగించండి
  6. క్రమముగ శాస్త్ర శోధనల గౌరవమెక్కుడు నాఁడు పొందగా
    శ్రమమని చూడబోక తమ సాధనలందునుపగ్రహమ్మనం
    తములనుఁ జేరు నాడొక సదాశయమట్లు ఫలింప గాంచుచున్
    అమవసనాఁడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్.

    రిప్లయితొలగించండి
  7. కృత్రిమ చంద్రుని వియత్నాంలో నిల్పి వాళ్ళకు చీకటిలేకుండా చేయాలని అమెరికా యుద్ధసమయంలో తలంచింది. ఆవార్తపై నా పద్యం.
    తిమిరము చీల్చగల్గుట యతీంద్రియమేమియుకాదు విద్యతో
    సమయము వచ్చె నేడిలను సంభవమయ్యెను వింతలెన్నియో
    కుముదపుబంధుడౌ శశిని కల్పన జేసి వియత్తు నుంచగా
    నమవసనాడె పున్నమియటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్

    రిప్లయితొలగించండి
  8. సమసెను ధైర్య వీర పటుసాహసముల్ రణరంగమందు న
    స్తమయమునొందె నా నరకదైత్యుఁడు సత్యయు కృష్ణచే పరా
    క్రమమున, శాంతి సౌఖ్యములు రంజిలె గాన ధరాతలంబుపై
    నమవశి నాఁడు, పౌర్ణమి యటంచునుఁ బల్కిరి శాస్త్రకోవిదుల్.

    రిప్లయితొలగించండి
  9. సమరము నందునన్ నరకుఁ జంపగ సత్య సమేత కృష్ణుడున్
    తిమిరము వీడి నల్దిశల తేజము నిండగ దీపకాంతులన్
    తమతమ గేములందు శుభ దాయక పర్వమె! సంబరంబునన్
    అమవస నాఁడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్!

    రిప్లయితొలగించండి
  10. మము, పసివారి కైతలను, మాల్మిని నెంచక కందిశంకరా!
    తమరిటువంటి క్లిష్టమును తర్కము కైనను లొంగ బోనివౌ
    శ్రమ గలిగించు పూరణల సల్పు డటంచిడ నోపజాల మే
    యమవసనాఁడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్?

    రిప్లయితొలగించండి
  11. కొడుకులునెందరున్న?తమకోర్కెలుదీర్చనితల్లిదండ్రికిన్
    అమవసినాడి|పున్నమియటంచునుబల్కిరిశాస్త్రకోవిదుల్
    శ్రమలకునోర్చికూతురటసాకెడిసంతసమందుజూడగా
    అమరినపండువెన్నెలగునాదరణమ్మునునమ్మనాన్నకున్

    రిప్లయితొలగించండి
  12. కె*యస్*గురుమూర్తిగారిపూరణం
    ----------
    తిమిరమనఃప్రవ్రుత్తిగలదుక్పదమేల?గతించిపోయెగా
    అమవసినాడి|పున్నమియటంచునుబల్కిరిశాస్ర్తకోవిదుల్
    క్రమము-గణించినేడిక-పురమ్ముననాలయవిగ్రహప్రతి
    ష్టముద-మెలర్పజేయశుభసౌఖ్యదమౌననితెల్పిరిమ్మునన్

    రిప్లయితొలగించండి
  13. కె*యస్*గురుమూర్తిగారిపూరణం
    ----------
    తిమిరమనఃప్రవ్రుత్తిగలదుక్పదమేల?గతించిపోయెగా
    అమవసినాడి|పున్నమియటంచునుబల్కిరిశాస్ర్తకోవిదుల్
    క్రమము-గణించినేడిక-పురమ్ముననాలయవిగ్రహప్రతి
    ష్టముద-మెలర్పజేయశుభసౌఖ్యదమౌననితెల్పిరిమ్మునన్

    రిప్లయితొలగించండి
  14. విమలపు కాంతితో మెరయు పెద్దగు విద్యుతు దీపకాంతులన్
    తము చెలరేగి యాక్రికెటు ధాటిగనాడ"వరల్డు కప్పు"కై
    ప్రముఖుల యాట గాంచుచును బాగుగ కేరెడి వారి జూచియు
    న్నమవసనాడె పున్నమియటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్

    తములపు చిల్కలందిడుచు,తన్వియె నాయకు జేరియుండగా
    నమలిన కాంతి చిందుచును,నానన శోభలు నందగించగా
    తమకము తోడ వెల్గుసతి తల్తురు,కైతల వర్ణనంబున
    న్నమవసనాడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్

    విమలపు రీతి భారతము వెల్గగ,స్వచ్ఛత"మోడి"తెల్పెగా
    భ్రమలను వీడియిండ్లనటు,బైటను శుభ్రము గాగ నుంచగా,
    నమలిన రీతి-"రోగములు నామడ దూరము నేగు,నప్పుడౌ
    నమవసనాడె పున్నమ యటం"చును బల్కిరి శాస్త్రకోవిదుల్

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ముందుగా చంపకమాల పాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నాను. పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    ప్ర్తత్యేక ప్రాశంసార్హమైన పూరణ చెప్పారు. మీ రూటే సపరేటు! అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కొడుకులు’ అన్నప్పుడు ప్రాస తప్పింది. అక్కడ ‘కొమరులు’ అంటే సరి!
    అన్నట్టు... ఈమద్య కెంబాయి తిమ్మాజీ రావు గారి దర్శనం లేదు. నామీద అలిగారా ఏమిటి?
    *****
    కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రమలకునోర్చి వీరులిటు చాలగ తీరుల పోరినంత తత్
    సమరపు ధాటి నిల్వకను జారెను కష్టము,తీరిపోయెగా
    నమవస,నాడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్
    యమరెను రాజ్యసిద్ధి మన యందరి మోముల కాచె వెన్నెలల్

    రిప్లయితొలగించండి
  17. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కోవిదుల్+అమరెను’ అన్నప్పుడు యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘సమకొనె రాజ్యసిద్ధి ఘనచంద్రికలే మన మోములందునన్’ అందామా?

    రిప్లయితొలగించండి
  18. సమరమునందు గెల్వగను సత్యయు చక్రియు సాలుసాలునన్
    తిమిరము ద్రోలి నాకమున దివ్వెల కాంతియె క్రమ్ముచుండగా
    కొమరుడు కోడలున్ కలిసి గూటికి రాగను ధూముధాముగా
    నమవసనాఁడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్

    రిప్లయితొలగించండి