26, మార్చి 2015, గురువారం

పద్య రచన - 860

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. మెడలో ఎద్దుల గంటల
    సడితో పరిసరములందు శ్రావ్యంబవగా
    బడిపిల్లల నెక్కించుకు
    వడివడిగానూరు చేర పరుగెత్తించెన్

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. ఎడ్ల బండ్లులే గరువాయె దొడ్ల లోన
    వాటి స్థానము బూరించె బవలు రేయి
    నేక ధాటిగా దిరుగుచు నింజ నుగల
    బండ్లు ,మఱి గన్మ ఱ గు నయ్యె బండ్లు ధరను

    రిప్లయితొలగించండి
  4. ఎద్దులబండిఫై పయనమెంతటిహాయి,యనంగనుండులే
    సద్దియుమూటగట్టుకొని సంతసమందునపిల్లపాపలున్
    ముద్దుగ మాటలాడుచును,ముచ్చటలందుపొలాలకేగగా?
    దిద్దునుజీవితాశయపు-తీర్పుగ పంటలునింటజేర్చులే|

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. పల్లె టూరి రోడ్డు మీద బండి పోవు చుండగా
    పిల్ల లంత కలసి మెలసి ప్రీతి తోడ నెక్కగా
    ఘల్లు ఘల్లు మనుచు నెడ్ల గంటల సడి మ్రోగగా
    వెళ్ళుచుండె నూరి వైపు వేడ్క తోడ బండియే !!!

    రిప్లయితొలగించండి
  7. మెడలోగంటలు|పాటపాడగనె తామేనాట్యమాడేట్లుగా|
    నడకన్సాగుచు రెండుఎద్దులును నానందానబండిడ్చగా?
    బుడతల్ పెద్దలచెంత నూయలగ సంభోదనాలాలిత్యమున్
    గడుపన్జాలగ?సౌఖ్యమేగదర|సాంగత్యానబండెడ్లచే|


    రిప్లయితొలగించండి
  8. పల్లె టూర్లనెద్దులబండిపయనమునకు
    ముఖ్య సాధనముగ నుండె పూర్వమందు
    యత్రయుగమున సదరు బండ్లంతరించి
    క్రొత్త సాధనములు సమకూరె నిపుడు

    రిప్లయితొలగించండి
  9. పనుపగ నెద్దుల బండిని
    వినాయక శరజులు నాడు వెడలిరి బడికిన్!
    చినబోకుడు మీరెల్లరు
    నొనగూడును గొప్పకొలువు లోరిమి గలుగన్!
    (తండ్రి వాహనం ఎద్దు కాబట్టి వారి పిల్లలూ బడికి
    ఎద్దులబండిలోనె వెళ్లుంటారను భావనతో)

    రిప్లయితొలగించండి
  10. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘బండ్లులే’ అనడం దోషమే. ‘ఎడ్లబండ్లు లేవాయెను...’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    మీ రెండవ పద్యంలో భావం బాగుంది, కాని కొన్ని లోపాలు... ‘నాట్యమాడేట్లుగా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘రెండు+ఎద్దులు’ విసంధిగా వ్రాశారు. ‘బండీడ్వగా’ అంటే బాగుంటుంది. ‘సంబోధనాలాలిత్యమున్’ అన్నచోట గణదోషం.
    *****
    శైలజ గారూ,
    ఉత్సాహంగా బండిని పరుగెత్తించిన మీ పద్యం బాగుంది.అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి