అక్కయ్యా, పద్యం బాగుంది. అభినందనలు. భావమే కాస్త తికమక పెడుతున్నది. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘మనసు+ఉన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘మనసు గలుగ’ అనండి. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ కవిత బాగున్నది. అభినందనలు.
విద్యుత్తు సంబంధ వెతలు తీరును గాక ............విద్వేష భావముల్ వీడు గాక జలజగడము లెల్ల సద్దుమణుగును గాక ...........సౌహార్ద వాహిని సాగు గాక వెనుకబాటెంతయు వెనుకబడునుగాక ...........ప్రగతి వై పడుగులు పడును గాక ఆర్థిక వ్యథ లన్ని యంతరించును గాక ..........విశ్వాస యామిని విరియు గాక
క్రొత్త వత్సర మందున కోట్ల తెలుగు గుండె లైక్యతా రాగమ్ము గూడి పాడ క్రొత్త రాష్త్రాలు మెలగుత కూర్మి నెపుడు తెలుగు వెలుగులు దీపింప నిలను గరము.
నమస్కారములు ఈ కొత్త రాష్ట్రాలు రాజకీయాలు అదొక ముళ్ళకంప మనకెందుకు ? , మన్మధ నామ సంవత్సరంలొ మత్తెక్కించే కోయిలగానం వింటూ హాయిగా ఉండక ? అని నా ఉద్దేశ్యం . అదన్నమాట
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు. ***** అక్కయ్యా, మీ భావానికి నా పద్యరూపం....
రాజకీయాల యీ క్రొత్తరాష్ట్రము లను ముళ్ళకంపల జోలికి బోవుటేల? మత్తు గల్గించు కోయిల మధురమైన పాట విందుమా క్రొత్తసంవత్సరమున.
క్రొత్త రాష్ట్రము తెనిగించ యుక్త మనదు
రిప్లయితొలగించండిఅలవి కానిది మనకేల నిలను బ్రతుక
క్రొత్త వత్సర మందున కోయి లంట
మత్తు గలిగించు మన్మధ చిత్తు గాను
ఆ.వె. క్రొత్త రాష్ట మైన క్రొత్త గా నేమౌను ?
రిప్లయితొలగించండినేత మార లేదు నిజము జూడ
వత్స రమ్ము మార వైనమ్ము మారునా?
వల్ల నౌను మేలు మెల్ల గాను !
ఆ.వె. ఎగువ మురికి నీరు దిగువపారునెపుడు
నేత బుద్ధి మార నిగ్గు తోడ
సంఘ మందు వెతలు సమసి పోవు నిటులె
మార్గ ముండు నెపుడు మనసు యున్న !!
ఆ.వె. కులము మతము వీడి గుణము చూసి జనము
ఎన్ను కొనిన నాడు మిన్న నెంచి
చదువు సంధ్య లున్న సంస్కార వంతుని
మార్పు వచ్చి తీరు మనము జూడ !!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొత్త రాష్ట్ర మందు విత్తము కరువంచు
రిప్లయితొలగించండినుత్త చేయి జూపె పొత్తుగాను
చిత్త శుద్ధి తోడ కొత్త వత్సరమున
మంచి జేయవలె న మాత్యులంత!!!
క్రొత్త రాష్ట్రము వచ్చెను గ్రొత్త గాను ,
రిప్లయితొలగించండిమన్మధం బను బేరున మానితముగ
క్రొత్త వత్సర మునువచ్చె జిత్త మలర
భాగ్య మెటు లుండు నోజూ డ వలయు నార్య !
ఉభయ రాష్ట్రము లందున నభయమిచ్చి
రిప్లయితొలగించండిచూపుచుండిరి భవితను సుందరముగ
ద్రవ్యమును పొందు సరియైన దారిలేదు
వ్యర్థ వాగ్ధానములతోడ వరలుచుండ్రి
ప్రజల గోడును వినునట్టి వారులేరు
చెజ్జు లంచును పేదల సేద్య భూమి
కలుష మతులైన నేతల కాంక్షవలన
భూబకాసురుల కొరకై పొందుపఱచు
దుష్ట నేతల చేతికి దొరకకుండ
కాచు రైతులన్ మన్మథ కరుణతోడ
అక్కయ్యా,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. అభినందనలు.
భావమే కాస్త తికమక పెడుతున్నది.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘మనసు+ఉన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘మనసు గలుగ’ అనండి.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ కవిత బాగున్నది. అభినందనలు.
కూర్పులులేనిరాష్ట్రమునకోర్కెలుబెంచుట?చక్కదానికిన్
రిప్లయితొలగించండిమార్పులుజేయ?డబ్బులనుమాదిరిగున్నది.లేనివాడినో
దార్పులవోలెనున్న?సరదాలకువెళ్ళడు|నూరుకోడులే
తూర్పుకుదండమెట్టుటయె|తొందరకేపని కానిమోదమే|
వేరగరాష్ట్రమేర్పడిన?వేడుకలేవియుతగ్గలేదులే
నేరుగమండలాలుతమనేర్పునుజాటుకళాకృతుల్సదా
దారినుగాదిజూప?సరదాలకు,నేర్పుకు,కూర్పులాగ|సం
స్కారముసన్నగిల్లి,మమకారముతగ్గెనుమన్మదాదిలో|
విద్యుత్తు సంబంధ వెతలు తీరును గాక
రిప్లయితొలగించండి............విద్వేష భావముల్ వీడు గాక
జలజగడము లెల్ల సద్దుమణుగును గాక
...........సౌహార్ద వాహిని సాగు గాక
వెనుకబాటెంతయు వెనుకబడునుగాక
...........ప్రగతి వై పడుగులు పడును గాక
ఆర్థిక వ్యథ లన్ని యంతరించును గాక
..........విశ్వాస యామిని విరియు గాక
క్రొత్త వత్సర మందున కోట్ల తెలుగు
గుండె లైక్యతా రాగమ్ము గూడి పాడ
క్రొత్త రాష్త్రాలు మెలగుత కూర్మి నెపుడు
తెలుగు వెలుగులు దీపింప నిలను గరము.
నమస్కారములు
రిప్లయితొలగించండిఈ కొత్త రాష్ట్రాలు రాజకీయాలు అదొక ముళ్ళకంప మనకెందుకు ? , మన్మధ నామ సంవత్సరంలొ మత్తెక్కించే కోయిలగానం వింటూ హాయిగా ఉండక ? అని నా ఉద్దేశ్యం . అదన్నమాట
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
*****
అక్కయ్యా,
మీ భావానికి నా పద్యరూపం....
రాజకీయాల యీ క్రొత్తరాష్ట్రము లను
ముళ్ళకంపల జోలికి బోవుటేల?
మత్తు గల్గించు కోయిల మధురమైన
పాట విందుమా క్రొత్తసంవత్సరమున.
dhanya vaadamulu
రిప్లయితొలగించండిఅవశేషంబని చింతజేయకను నవ్యాంధ్రమ్ముగా దీర్చగన్
రిప్లయితొలగించండినవనీతంబగు మానసంబునను దానై మోది తోడ్పాటునన్
భువిపై స్వర్గము నిల్చెనా యనగ సంపూర్ణాభికాంక్షితమై
ధృవతారై వినువీధిలో వెలుగ సంధానించ నేకొరెదన్!