3, ఏప్రిల్ 2015, శుక్రవారం

పద్య రచన - 868 (పెండ్లిచూపులు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
"పెండ్లిచూపులు" 

15 కామెంట్‌లు:

  1. జీవితమంతయున్ కలసి చేయును కాపురమే నెలంతతో
    నావనితాలలామముఁ తనంతటతానుగ జూచియెంచగా
    భావిని యందచందములు భాషణ భూషణ వేషధారణల్
    సేవలనన్ని బాగ పరిశీలన చేయుట పెండ్లి చూపులౌ
    (నాది లౌ మ్యారేజ్.. సినిమాలలో తప్ప పెండ్లి చూపులు చూడలేదు)

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పెండ్లి చూపులు :
    (వధువింటి దగ్గర వరుడు చూస్తే - పెదరాయుడు సినిమాలోలా )

    01)
    ______________________________

    వధువు రూప, గుణంబులు - వయసు, హొయలు
    వధువు మాటలు, పాటలు - వంపు, సొంపు
    పేదరాలైన; నచ్చినన్ - ప్రేమ గలిగి
    పెండ్లిచూపుల తదుపరి - పెండ్లమగును
    జీవమౌగాదె మిగిలిన - జీవితమున !
    ______________________________

    రిప్లయితొలగించండి
  3. పెళ్లి చూపుల రోజున ప్రీతి తోడ
    చిరు వెరపునోర గంటన చెలియ చూపు
    మూగ బాసతో మనసున ముద్ర వేయు
    ఏడు జన్మల బంధమ్ము జోడు జేయు

    రిప్లయితొలగించండి
  4. రండి బావ గారు రంజిల్లె మా మది
    మీదు రాక నేడు మేలు మాకు
    మేము కన్న బిడ్డ మీ యింట కాలూన
    ధన్య మౌను బ్రతుకు దాని కింక.

    చదువు లోన నెపుడు మొదటనే యున్నది
    గుణ గణమ్ము లెన్న మణియె బిడ్డ
    అంద చంద ములను నామె యెట్లున్నదో
    మెచ్చుకొన గలారు మీరె చూచి.

    తల్లి పెంపకాన తనరెను యొద్దిక
    నిల్లు చక్క దిద్దు నేర్పు గలదు
    పెద్ద వార లన్న వినయము ప్రకటించు
    ప్రేమ తోడ జూచు పిన్న వారి.

    మాయింటి యాడు బిడ్డకు
    మీ యింటను చోటునిండు మేలగు మీకున్
    హాయిగ మాకును పెండ్లిని
    చేయ గలము వైభవముగ చెప్పిన చొప్పున్.

    *******

    వేడ్క బావగారు! వియ్యము మీతోడ
    మాకు కుదిరెనేని, మా తనయుడు
    చదువులందు మిన్న మొదటినుండియు కూడ
    చక్కనైన కొల్వు సద్గుణములు.

    అంద చందములకు నంత మేమున్నది
    గుణగణముల ముందు కొద్ది గావె
    మంచి వంశ మంచు మాకెరుకాయెను
    పిల్ల తీరు జూడ నుల్ల మలరె.

    లక్ష్మి వంటి మంచి లక్షణముల యీమె
    మెట్టి నంత మాకు మేలు కలుగు
    మాకు నచ్చె నామె మంచి ముహూర్తాన
    తమ్ములమ్ము లీయ తనర గలము.

    ******

    ఎంత మంచిమాట నింపుగా నని నారు
    ధన్యమైతి మయ్య తమరి దయను
    మాదు పెద్ద వారి మాల్మిని మీదు సం-
    బంధ మొనరె మాకు భాగ్య మిద్ది.

    రిప్లయితొలగించండి
  5. పెండ్లి జూపుల బే రన బెండ్లి వారు
    వత్తు రమ్మాయి గుణ గణా లత్తరి మఱి
    తెలిసి కొనుటకు మఱియును దెలివి తేట
    లు నడ వడి యంద ము పలుకు లుపలి కించి
    యిష్ట మగునె డ సంబంధ మిష్ట మండ్రు

    రిప్లయితొలగించండి
  6. అంగడి బొమ్మగ తలచుచు
    నంగాంగ పరీక్షకొరకు నారాటపడన్
    భంగిమను చూప వరునకు
    సింగారించిన చెలువపు చేడియఁ గనుడీ!

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    పెళ్ళిచూపుల అనుభవం లేకున్నా చాలా బాగా వ్రాశారు. మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    భళ్లముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    స్వభావోక్తులతో చక్కని ఖండిక నందించారు. చాలా బాగుంది. అభినందనలు.
    ‘తనరెను+ఒద్దిక’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తనరెఁ దా నొద్దిక’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది.అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. వచ్చినవాడి చూపుగన?భాగ్యపుభావనచూసివెళ్లి|మీ
    రిచ్చెడికట్న,కానుకలరీతినిజెప్పిన?పెళ్లికూతురే
    మెచ్చకయున్న నేవిడక-మిక్కిలిప్రేమగ పెళ్లియాడెదన్
    సచ్చరితుండనేను|మనసన్నదినున్నదటంచు-దేల్చగా|
    కట్న,కానుకజూసిన కళ్ళకెపుడు
    కన్యకనికరమన్నదికానరాదు|
    "రాదిక-నిలయంబుగని|పరాకునందు
    నిశ్చయించ?రా,దిక"నిలయమనుచు
    రా,కడకామానుంచగ?
    పోకడలేమారిపోయె|పురుషోత్తముడే
    సాకులుజెప్పుటమొదలిడ|
    లోకములోపెళ్లిచూపు ?లోభత్వముకే|

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ నేను చేసిన తప్పుకు సిగ్గుగా ఉంది. మీ సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘మనసన్నది యున్నదటంచు...’ అనండి.
    "రాదిక-నిలయంబుగని|పరాకునందు| నిశ్చయించ?రా,దిక"నిలయమనుచు’..., కందపద్యంలో మొదటి పాదం దురవగాహంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  11. అటుయేడు తరములు నిటుయేడు తరములు
    పరికించ మేలన పట్టి చూడ:
    పెళ్లి ఖాయమ్మైన, ప్రేమికుడే నచ్చ
    రోదనలమిగిల్చె రుక్మిణొకరు!
    జూదమే మోదమై జోరు జోరుననాడి
    ధనముఁ బోగెట్టెనో ధర్మజుండు!
    వెలయాల్ల పాలౌచు వేదింపులన్ ముంచి
    పుండరీకుని బోలె పోరడొకరు!

    దిక్కుఁ దోచకుండ తిక్కరేగుటె తప్ప
    పెళ్లి జేయ గల్గు విధము నాస్తి!
    పిల్ల గుణగణముల పిల్లాడి బాగునూ
    పెళ్లి చూపు లందు పేర్చ మేలు!

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి