28, ఏప్రిల్ 2015, మంగళవారం

పద్య రచన - 893

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. పిండిని చేయగ వనితలు
    దండిగ శ్రమకోర్చి తొల్లి తాపము నొందన్
    కండలు కరగక నిప్పుడు
    మెండగు యంత్రములు వచ్చె మేలగు సతికిన్

    రిప్లయితొలగించండి
  2. విసరమ్మ విసరవే వెయ్యేళ్ళు నీకు
    విసరమ్మ విసరవే వేవిళ్ళు నాకు
    బతకవే నీయిల్లు బంగార మవగ
    బాలింత నైనేను పాపణ్ణి కనగ

    నీయింటి దేవుడూ నిటలాక్షు దలచి
    నాయింటి దేవుడూ నరసింహు గొలిచి
    మాయింట బూసినా మరుమల్లె ముడిచి
    మీయింట గాసినా మేలుపూఁ దురిమి
    విసరమ్మ....
    మాయింట బుట్టేను మహరాజు యొకడు
    మీయింట గలిగేను మీనాక్షి యొకతె
    మనజన్మ ధన్యమై మనువాడి వారు
    మనయిండ్ల తిరగాలి బంగారు తేరు
    విసరమ్మ.......

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    ఈ తిరగలి పాట చాలా బాగున్నది. ఇది మీ స్వరచనయా? లేక సేకరించినదా?

    రిప్లయితొలగించండి
  4. ఇది పూర్తి గా నా స్వంతరచన
    Y stands for Yanamandra and S for my fathers's name Singappa
    మీ మెప్పుదలకు నా సనమస్కార కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గారూ
    ద్విపద మంజరి ప్రయత్నం చేశాను
    కృత కృత్యుణ్ణి ఐతే సంతోషం

    రిప్లయితొలగించండి
  6. వనితలిరువు రచట వాసిగ మినుములు
    విసురు చుండ క్రింద పిండి పడగ
    నెత్తి పంచదార నెక్కువ నెయి వోసి
    కలిపి కట్జ లడ్డు కమ్మ గుండె/కమ్మనుండె

    రిప్లయితొలగించండి
  7. వనితలిరువు రచట వాసిగ మినుములు
    విసురు చుండ క్రింద పిండి పడగ
    నెత్తి పంచదార నెక్కువ నెయి వోసి
    కలిపి కట్జ లడ్డు కమ్మ గుండె/కమ్మనుండె

    రిప్లయితొలగించండి
  8. తిరగలి త్రిప్పుచు రయమున
    స్థిరమగు చిత్తమ్ముతోడ చేయుచు నుఱుమున్
    నిరతము నాడుచు పాడుచు
    సరదాగా పనులఁజేయు సకియలఁగనుడీ!

    రిప్లయితొలగించండి
  9. చిత్ర మందున భామలు చిత్త మలర
    త్రిప్పు చుండిరి పిండికై తిరుగ లియట
    యెంత మెత్తగా వచ్చునో నంత బాగు
    చేయ వచ్చును దానితో జేత నైన
    పిండి వంటలు రామయ్య !ప్రియము గలుగ

    రిప్లయితొలగించండి
  10. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మనోహరభావయుక్తమైన ఈ ద్విపద (మకుటం చూసి గేయమనుకున్నాను) అద్భుతంగా ఉంది. కాని ప్రాసనియమాన్ని పాటించారు కనుక ఇది ద్విపదయే. మంజరీ ద్విపద కాదు. మీకు నా ప్రత్యేకాభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. తిరుగలి తిరుగంగ?తీరికచే యత్త
    ------------పెత్తనాలు సలిపి పేరుబొందె|
    పక్కింటివదినలు మక్కువ మాటలు
    ------------చెవులలో వేయంగ?చేరి పిదప
    నోటవెలువడు వినూత్నరీతిగ|పిండి
    -----------వచ్చు నట్లుగ మాట లొచ్చుగాదె|
    సంసారబంధమ్ము సాగెడిపద్దతి
    -----------గుండ్రమే ననిదెల్పు గెట్టుగాను|
    అట్టి తిరుగలి నింటింటపట్టుదలను
    ఐకమత్యముజేకూర్చి సాకు నట్లు
    నాటి సంస్కృతి నెల కొల్ప?నేటి బ్రతుకు
    కలసి మెలసియునున్నచో?కలత లాయె|

    రిప్లయితొలగించండి
  12. కె. ఈశ్వరప్ప గారూ,
    చక్కని భావంతో పద్యాన్ని అందించారు. అభినందనలు.
    ‘తీరికచే నత్త’ అనండి. ‘గెట్టుగాను’ అన్నది ‘గుట్టుగాను’ అన్నదానికి టైపాటు కావచ్చు. లేకుంటే యతిదోషం.

    రిప్లయితొలగించండి
  13. నిన్నటి పద్య రచన :
    నీరము నభిషేకించియు
    మారేడులనిడఁగ హస్తి మాత్సర్యమునన్
    దూరగ శ్రీ కాళమ్ములు
    జౌరగ కుంభముఁ, ద్రయమ్ము శంకరుజేరెన్!

    నేటి పద్యరచన :
    తిరుగని రాయియె 'కర్మము'
    తిరుగే రాయన్న'భక్తి' తిప్పెడు పిడియే
    యెరిగిన'జ్ఞానము' , కర్మను
    ధరపై ధ్వంసమ్ము జేయఁ దనరును పరమే!

    రిప్లయితొలగించండి
  14. మరలుండెడి కాలమ్మున
    తిరుగలితో విసురుటేల తీయుము మిక్సీ!
    బరువును తగ్గించు కొనగ
    సరియగు వ్యాయామమిదియె సఖియా గనుమా!!!


    మరచిరి ఘరట్టములిలన్
    మరలందున మరలవోలె మసలుచు మనుజుల్
    తిరుగలితో పిండి విసరి
    మురియుచు మురుకులను జేయు ముదితలు గలరే!!!

    రిప్లయితొలగించండి
  15. గంగ-గౌరి వాదు కనులకుగట్టంగ
    పాటబాడుపనులుపరవశాన
    కష్ట నష్ట మేది గనుపించ నంతగా
    తిరుగలి వలె బ్రతుకు తిరుగు చుండు

    రిప్లయితొలగించండి
  16. గిరగిర లలనా మణులే
    తిరుగలి లోధాన్యముంచి త్రిప్పుచు పిడితో
    కరముల సత్తువ తోడ వి
    సరుచుండిరి పిండి చాకచక్యము తోడన్

    రిప్లయితొలగించండి
  17. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యంలో వెలిబుచ్చిన ఆధ్యాత్మక బావాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి