23, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 104

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
హనుమంతుని పెండ్లి కెన్ని యాటంకములో?

7 కామెంట్‌లు:

  1. నమస్కారమండీ, నా పూరణ:

    వనచరముల వధువొక్కటి
    ఘనతరమే, కాంచి పిదపఁ గంతుఁడు వేయన్
    తన శరములఁ గపి చిక్కడె
    హనుమంతుని పెండ్లి కెన్ని యాటంకములో

    వనచరములు = కోతులు : కంతుఁడు = మన్మధుడు

    రిప్లయితొలగించండి
  2. హనుమంతరావు పెళ్ళి గోల:
    పనులన్నియు కుంటువడెను
    అనుకున్నవి జరుగలేదు అత్తయు నొచ్చెన్
    ఘనముగ కురిసెను వానలు
    హనుమంతుని పెండ్లికెన్ని ఆటంకములో!

    రిప్లయితొలగించండి
  3. ఘనుడా మనుజుడు నుతించు
    హనుమంతుని; పెండ్లి కెన్ని యాటంకములో
    కనుకను పాపము! రోజుల
    గనుడీ! పురుషులకు పెళ్ళి కష్టంబాయెన్.

    రిప్లయితొలగించండి
  4. వానర యోధుని మదిలో
    మన్మధ భావన కలగని కా రణమే రా
    వనుడో రాముడొ వాలియో
    హనుమంతుని పెళ్లి కెన్ని యాటంకములో

    రిప్లయితొలగించండి
  5. గన్నవరపు వారూ,
    మీ పూరణ చక్కగా, నిర్దోషంగా ఉంది. అభినందనలు.

    నారాయణ గారూ,
    మీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు.

    రవి గారూ,
    మంచి భావంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాకుంటే మొదటి పాదంలో మూడవ గణం జగణం బేసి గణ మయింది. "నుతించు" ను "నుతులిడు" అంటే ఓకే.

    పీతాంబర్ గారూ,
    మంచి బావంతో పూరించారు. అభినందనలు.
    కాని రెండవ పాదంలో ప్రాస, యతి రెండు తప్పాయి. మొదటి పాదంలో మొదటి గణం కూడా. కందంలో మొదటి పాదాన్ని లఘువు, గురువులలో దేనితో ప్రారంభిస్తే మిగిలిన పాదాలనూ దానితోనే ప్రారంభించాలని నియమం కదా.
    మి పద్యాన్ని ఇలా సవరించాను.

    వనచర యోధుని మదిని మ
    దన భావన కలుగ లేదు; దాని కతము రా
    వణుఁడో, రాముఁడొ, వాలియొ
    హనుమంతుని పెండ్లి కెన్ని యాటంకములో.

    రిప్లయితొలగించండి
  6. ఇనసూన సువర్చలగని
    మనువాడగ పిల్లనిచ్చు మామ మరీచిన్
    వనదము లడ్డెన్నకటా
    హనుమంతుని పెండ్లి కెన్ని యాటంకములో?
    సూచన: వనదములు=మేఘములు; ఇనసూన=సూర్యపుత్రిక

    రిప్లయితొలగించండి
  7. కనబడక కాంగ్రెసందున
    ధనమును యౌవనము రూపు ధాటిగ పలుకుల్
    వినయము కలిగిన వధువుల్
    హనుమంతుని పెండ్లి కెన్ని యాటంకములో?

    రిప్లయితొలగించండి