హరి గారూ, మంచి పద్యాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. కాని సమస్య ఇవ్వడంలో ఒక పొరపాటు జరిగింది. నేనిచ్చిన సమస్యలో యతిదోషం ఉంది. సాంబయ్య గారు పంపిన సమస్యను సరిగా గమనించకుండానే పోస్ట్ చేసాను. నన్ను క్షమించాలి. ఇప్పుడు దానిని సవరించాను. దీనికి తగిన పూరణను పంపించండి.
దొంగను ఏపీపీయస్
రిప్లయితొలగించురంగము పైనిలువ బెట్టి రక్షక భటుడై
చొంగను కార్చెను సర్కార్
దొంగను పోలీసు కలిసె పొలిమేర కడన్
హరి గారూ,
రిప్లయితొలగించుమంచి పద్యాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.
కాని సమస్య ఇవ్వడంలో ఒక పొరపాటు జరిగింది. నేనిచ్చిన సమస్యలో యతిదోషం ఉంది. సాంబయ్య గారు పంపిన సమస్యను సరిగా గమనించకుండానే పోస్ట్ చేసాను. నన్ను క్షమించాలి. ఇప్పుడు దానిని సవరించాను. దీనికి తగిన పూరణను పంపించండి.
కంది శంకరయ్య గారు,
రిప్లయితొలగించునేనూ చూడలేదండీ.
నా పద్యాన్ని ఇలా సవరిస్తున్నాను చూడండి.
దొంగను ఏపీపీయస్
రంగము పైనిలువ బెట్టి రక్షక భటుడై
చొంగను కార్చెను సర్కార్
దొంగను పోలీసు కలిసె దుష్కార్యమునన్
ఇక మీ సవరించిన సమస్యకు నా పూరణ.
చాలా నేర్పుగ మాయా
జాలపు మాటలను జెప్పు జగనూ, మొయిలీ;
ఆలోచింపగ దోచును
పోలీసును కలిసె దొంగ పొలిమేర కడన్.
యతి దోషం ఉన్నట్టా లేనట్టా అని సందేహించి, చివరికి వివరణ అడగబోయాను- అంతలో సవరణ చూశాను.
రిప్లయితొలగించునాపూరణ, ఇదిగో- అవధరించండి:
బంగరు దొంగిలి పోయెడి
దొంగను పోలీసు కలిసె- దుష్కార్యమునన్
చెంగట గల నగలను కం-
టంగనకనె మాటలాడి టంకముల గొనెన్.
తోలును దాల్చిన దొంగయె
రిప్లయితొలగించుపోలీసు! ఖలుని విడఁచి పుచ్చెను. అటపై
పాలును గొనుటకు వచ్చిన
పోలీసును కలిసె దొంగ పొలిమేర కడన్
మరొక పూరణ:
రిప్లయితొలగించుదొంగలు నాయకులై వీ-
రంగములు సలుపగ రంగ రంగా యనుచున్
అంగడులు మూసిరందరు
దొంగను పోలీసు కలిసె దుష్కార్యమునన్
హరి గారూ,
రిప్లయితొలగించునా సమస్యకు మీ సవరణ, నా సవరణకు మీ పూరణ రెండూ బాగున్నాయి. ధన్యవాదాలు.
రవి గారూ,
రిప్లయితొలగించుపూరణ చక్కగా ఉంది. అభినందనలు.
కాని రెండవ పాదంలో గణదోషం ఉంది. దానిని ఇలా సవరించాను.
"పోలీసట! ఖలుని విడచి పుచ్చెను, అటపై"
నారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
స్త్రీలవి గొలుసులు లాగుచు
రిప్లయితొలగించుమేలుగ మార్చుచు నగదుకు మిర్యల గూడన్
కేలున కమిషను నిడుటకు
పోలీసును కలిసె దొంగ పొలిమేర కడన్