11, సెప్టెంబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 92

కవి మిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .......
గణపతిని వరించె కలువ భామ.

6 కామెంట్‌లు:

  1. సా విరహే గారూ,
    ధన్యవాదాలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. సవతులున్ననేమి చల్లని రారాజు
    సోముడే పతియనుచు నిగిడి నిల-
    చి నిడిగి బిలచి కడు చెల్మిని నక్షత్ర-
    గణ-పతిని వరించె కలువ భామ.

    రిప్లయితొలగించండి
  3. సాహితీ మిత్రులు కంది శంకరయ్య గారు !
    మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైన " వినాయక చతుర్థి " శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి మీ సమస్యకు నా పూరణ :

    నీటిలోన నిలిచి, నీలాల నింగిలో
    పున్నమి నిశయందు వెన్నెలలను
    విరిసి చల్లదనము కురిసెడి నక్షత్ర
    గణ పతిని వరించె - కలువ భామ !

    రిప్లయితొలగించండి
  4. జి.యు.శర్మ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
    మీ పూరణ సలక్షణంగా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    ముందుగా మీకూ వినాయక చవితి శుభాకాంక్షలు.
    పండు వెన్నెలలో నౌకా విహారం చేసిన అనుభూతిని కలిగించారు మీ పూరణతో. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి