16, మే 2013, గురువారం

సమస్యాపూరణం – 1054 (వక్త్రంబుల్ పది గలిగిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే!

16 కామెంట్‌లు:

  1. వక్త్రంబొక్కటి చాలనె
    వక్త్రంబున ధర్మ బుద్ధి వదలకు మనియెన్
    వక్త్రంబు గూలుతు ననె దుర్
    వక్త్రంబుల్ పది గలిగిన, వానికి జేజే!

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో...

    వక్త్రంబొక్కటి చాలనె
    వక్త్రంబున ధర్మ బుద్ధి వదలక యున్నన్
    వక్త్రముల గూల్చె గద దుర్
    వక్త్రంబుల్ పది గలిగిన, వానికి జేజే!

    రిప్లయితొలగించండి
  3. దృక్త్రాయమాణమగు భువిఁ
    నక్త్రంబొనరించి, మీద హరణమొనర్చే
    స్రక్త్రైగుణ్య నిధి, దిశా
    వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే.

    అక్త్రము = కాపాడు, ఉద్ధరించు,
    దిశావక్త్రంబుల్ పది = దశదిశలనెడు ముఖములు ( ఈశ్వరుడు అనే భావనతో )

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.

    మా కొలది జానపదులకు
    మీ కవితా ఠీవి యబ్బునే కూపనటత్
    భేకములకు నాకధునీ
    శీకరముల చెమ్మ కంది శ్రీ కుల సోమా!

    రిప్లయితొలగించండి
  5. వక్త్రము నొకటియ వానికి
    వక్త్రము మఱి మూడు గలుగు వానికి మఱియున్
    వక్త్రము నాలుగు వానికి
    వక్త్రంబుల్ బది గలిగిన వానికి జేజే .

    రిప్లయితొలగించండి
  6. వక్త్రంబుల వేయి నొకపరి
    నక్త్రం బుతొ పతంజలి నేర్పు వ్యాకరణ మ్మే !
    వక్త్రంబే మోద మలరగ
    వక్త్రంబుల్ పది గలిగిన వానికి జే జే !

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులకు నమస్కృతులు.
    దుష్కరప్రాసతో కూడిన ఈనాటి సమస్యకు అతి తక్కువ పూరణలు వచ్చాయి.
    *
    ఇంతకంటే కఠినమైన సమస్యలను సమర్థతతో పూరించే ఏల్చూరి వారు ఈనాడు ఆ పనికి పూనుకొనలేదు.. ఎందుకో..
    *
    నేనేదో చాపల్యంతో ఒక పూరణ చేసాను. కాని ఆ తరువాత పరిశీలించుకుంటే అందలి దోషాలు తెలిసాయి. వెంటనే తొలగించాను.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ ఆన్నిటికన్నా ఉత్తమంగా ఉందని భావిస్తున్నాను. వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. వక్రంబు లెన్ని యున్నను స
    ద్వక్త్రము గానియెడల దానవు లనగన్
    వక్త్రంబు సొగసు లలరెడి
    వక్త్రంబుల్ పది గలిగిన వానికి జే జే !

    రిప్లయితొలగించండి
  9. అక్త్రము రాక్షస రూపము;
    వక్త్రజుడే చూడ లోన! వల్లించు సదా
    వక్త్రమునన్ శివ నామము!
    వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే!

    రిప్లయితొలగించండి
  10. ఆర్యా ! ధన్యవాదములు.
    మరొక ప్రయత్నము.
    రావణునికి జయము పలుకుతూ నరుడా ' నీ తలకాయ్ ' ఏంచేస్తావ్ ? అని రాక్షసులు పలుకుట...

    వక్త్రములు నాల్గు వాడును
    వక్త్రంబులు నైదు వాడు వరమిడె నరనీ
    వక్త్రంబదేమి చేతువు
    వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే!

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం... ‘వక్త్రము లెన్నైనను స...’ అంటే సరి..
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ రెండవ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  12. కం//
    భక్తులను కాయువానికి,
    భుక్తిని యొసగుచు జనులను బ్రోచెడు హరికిన్,
    రక్తిగ అవతారంబుల
    వక్త్రంబుల్ పది గలిగిన వానికి జేజే

    హల్లుకు రేఫయుత హల్లుకు ప్రాస కుదురుతుందని చదివిన గుర్తు. ఈ దుష్కరప్రాసకు ఈ సులభమార్గము తక్క ఇంకొక దారి కనపడలేదు. తప్పైన సవరించగలరు.

    రిప్లయితొలగించండి
  13. వక్త్రము లేడు కొడుకులకు
    వక్త్రమ్ములు రెండు తనకు పార్వతి తోడన్
    వక్త్రమ్ము నంది కొక్కటి
    వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      చివరికి శివుణ్ణి పది తలలవాణ్ణి చేశారు. అద్భుతమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి


  14. అక్త్రము తొడుగవలదు ! యను
    వక్త్రముల కిది సమయంబు వనితా రావే!
    పక్త్రిమ భంగిమలమరగ
    వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే :)

    జిలేబి

    రిప్లయితొలగించండి