28, మే 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1066 (కామితార్ధమ్ము లొసఁగదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కామితార్ధమ్ము లొసఁగదు కనకదుర్గ.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

14 కామెంట్‌లు:

  1. తేటగీతి గర్భిత మధ్యాక్కర:

    కామితార్థమ్ములొసగదు కనక దుర్గ సమాశ్రితులకు
    యేమి నా దోషమో యంచు నేగ నొకడు వగచుచును
    మోమునన్ తేజము లుడిగి పోవు నతని మహాభక్తు
    ప్రేమతో తల్లి దీవించి శ్రీనిధులిడె విశేషముగ

    రిప్లయితొలగించండి
  2. మహిష మర్దని స్తోత్రమ్ము మనసుదలచి
    పూజ జేయుచు పదముల పూలు వేసి
    నీవె దిక్కని వేడగా నెందు కామె
    కామితార్ధమ్ము లొసఁగదు ? కనకదుర్గ.

    రిప్లయితొలగించండి
  3. నిశ్చలమ్మైన మనముతో, నిర్మలమగు
    భక్తితోడుత వాంఛిత ఫలములడుగ,
    భక్తవరదాయి, యతిశీఘ్ర ఫలద, యేల
    కామితార్థమ్ము లొసఁగదు కనకదుర్గ?

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    సమస్యా పూరణంలో గర్భకవిత్వమా? మీ చిత్రకవిత్వ నైపుణ్యానికి నమోవాకాలు. ఇటువంటి ప్రయోగాలు ఔత్సాహికులకు స్ఫూర్తి దాయకాలు. ధన్యవాదాలు.
    రెండవ పాదం ప్రారంభంలో యడాగమం దోషమని గుండు మధుసూదన్ గారు ఫోన్ ద్వారా తెలిపారు. ‘సమాశ్రితులకు నేమి’ అని ఉండవలెను కదా!
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సమస్యను ప్రశ్నగా మార్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    సమస్యాపూరణల ‘టెక్నిక్కులలో’ ప్రశ్నార్థకంగా పూరించడం ఒకటి. దానిని సమర్థంగా వినియోగించుకొని ప్రశస్తమైన పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    శుభాశీస్సులు.
    నేను 2 పద్యములలో (1) తేటగీతి (2) మధ్యాక్కర పూరించుటలో సంధి దోషము చోటుచేసుకొన్నది. తేటగీతి పద్యముగా ఎట్టి దోషమునూ లేదు. మధ్యాక్కరగా చేసినపుడు ఆ దోషమును నేను గమనించ లేదు. అందుచేత విసంధిగా విడిచి పెట్టవచ్చును కదా. యడాగమమును రద్దు చేద్దాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. భక్తిభావంబుతోడ సత్ఫలము కొఱకు
    ధ్యాన జపముల చేత సంధానితమగు
    పూజలొనరించి వేడగా పుడమినేల
    కామితార్థమ్ము లొసఁగదు కనకదుర్గ?.

    రిప్లయితొలగించండి
  7. కామి తార్ధమ్ము లొసగదు కనక దుర్గ
    నిజము కాదది , యా తల్లి నిజము గాను
    ఎవరు కోరిన వారికి నిడును సుఖము
    ఎల్ల వేళల బూజించ నుల్ల మలర

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
    =========*==========
    భూమిపై రాక్షస గణము భూరి బలము జూపి దిరుగ
    కామితార్థమ్ము లొసగదు కనక దుర్గ ఖలుల కెపుడు,
    ప్రేమతో పూజలు జేయ బెరుగు సిరులు వారికెపుడు
    మోదమగు జనులకెపుడు, మోము గనిన వారి కెపుడు

    రిప్లయితొలగించండి
  9. కలి యుగమ్మున జను లుండ కాల నేమి
    కామి తార్ధమ్ము లొసఁ గదు కనక దుర్గ
    భక్తి మీరగ ధ్యానించ ముక్తి యనుచు
    కలికి మాలక్ష్మి ముంగిట కల్ప తరువు !

    రిప్లయితొలగించండి
  10. ఆత్మ శుద్ధితో భక్తితో డనుదినంబు
    నమ్మవారికి అర్చన లాచరించు
    శ్రద్ధ గలవారలకునేల సకల సుఖము
    కామి తార్థంబు లొసగదు? కనక దుర్గ

    రిప్లయితొలగించండి
  11. నేమాని గారు!
    "వాక్యావసానంబున సంధి లేమి దోషంబు గాదని యార్యులండ్రు" - చిన్నయ సూరి.
    ఉదాహరణలు :
    " ... సర్వ వేద
    సమధి గమము సత్యంబుతో సమము గావు
    ఎరుగు మెల్ల ... " - ఆంధ్ర భారతము
    "పడగనున్న హనుమ భయవిహ్వలుడు కాడు
    అరదమునకు ... " - ఆంధ్ర భారతము
    కాబట్టి మీ మధ్యాక్కరలో కూడ విసంధి దోషం కాదు.
    అయితే యడాగమం కూడదు.

    రిప్లయితొలగించండి
  12. నేమాని పండితార్యా! అద్భుతమైన పూరణ నిచ్చారు.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులారా! శుభాశీస్సులు.
    మీ పద్యములన్నియునూ అలరించుచు నున్నవి.
    శ్రీ వర ప్రసాద్ గారూ! మీ మధ్యాక్కర ప్రశంసనీయము.
    నా పద్యము గురించి మిత్రులు చేసిన మంచి సూచనలకు కృతజ్ఞతలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విసుగు మాటలతోటి మనసు నొచ్చిన పడతి -కంటినీరొలికిస్తు ఇంటనుండ
      ఎదురు చూపులతొటి నిను గన్న వారలు -కళ్ళుకాయలు కాచి చూచుచుండ
      బెదురు మాటలతోటి నువుకన్న వారల -ముదము మనసున లెక్కసేయకుండ ఎంతచేసిన నీపూజ యేమిఫలము ? కమితార్థములొసగదు కనకదుర్గ

      తొలగించండి