6, మే 2013, సోమవారం

పద్య రచన - 333 (సంగీత సాహిత్యములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“సంగీత సాహిత్యములు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. నాదమే తొలి కారణమ్ము సర్గమున కా
    ....నాదమే యెదకు వినోదమొసగు
    శాస్త్రీయ సంగీత సత్కళా రూపమై
    ....సరిగమపదని సుస్వరయుతమయి
    ఆపాత మధురమై యలరుచు నెల్లరి
    ....మానసమ్ముల జిల్కు తేనెజల్లు
    సాహిత్య మమిత విజ్ఞాన ప్రదాత్రియై
    ....యంతరంగములలో కాంతి నింపు
    అలరు సంగీత సాహిత్యములను కళలు
    శారదా మాతృమూర్తికి స్తనయుగమయి
    యామె వాత్సల్య సారమ్మునందు వారు
    ధాత్రి నలరారు చుందురు ధన్యులగుచు

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    సంగీత సాహిత్యాల సమగ్ర స్వరూప ప్రయోజనాలను వివరిస్తూ ఉత్తమమైన పద్యాన్ని చెప్పారు. ఇంత వేగంగా స్పందించారంటే కలం, కాగితం లేకుండా నేరుగా టైపు చేసారని భావిస్తున్నాను. ఇది మీ ఆశుకవితా ప్రావీణ్యానికి నిదర్శనం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  3. 'some' గీతసా 'హిత్యముల్' నేర్చి
    సంగీత సాహిత్యముల్ నేర్వంగ 'whole
    some' అగునే చదువు సాహిత్యము
    విశ్వదాభి వేణీ కనుమ జిలేబీ నీ వాణీ

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. సంగీత సాహిత్య సమలంకృతే
    స్వర రాగ పదయోగ సమభూషితే|
    హే భారతి మనసాస్మరామి
    శ్రీ భారతి శిరసానమామి||

    రిప్లయితొలగించండి
  5. సరిగ పదము వ్రాయ సాహిత్యమే యౌను
    ' సరిగపదని ' బాడ సరసమైన
    శ్రావ్య మైన శుద్ధ సంగీతమే యౌను
    పదము ' పదని ' గలుప పాట యగును .

    రిప్లయితొలగించండి
  6. సరిగ పదము వ్రాయ సాహిత్యమే యౌను
    ' సరిగమ పదని ' యన సరసమైన
    శ్రావ్య మైన శుద్ధ సంగీతమే యౌను
    పదము ' సరిగ ' గలుప పాట యగును .

    రిప్లయితొలగించండి
  7. శ్రీనివాసుని కీర్తించు శీకరములు
    భక్త జనకోటి హృదయాల భాసురములు
    మేటి సంగీత సాహిత్య మేళనములు
    అన్నమాచార్య కీర్తన లద్భుతములు.

    రిప్లయితొలగించండి
  8. సాహిత్యాభిమాని గారూ,
    ‘స్వాతికిరణం’ ప్రసరింపజేసారు. ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యంలోని పద చమత్కారం అలరిస్తున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    సంగీత సాహిత్యాల సమ్మేళనమైన అన్నమయ్యను ప్రస్తావించి చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మీ శబ్దచమత్కార వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు కృతజ్ఞుడను.

    కలమున్ బూనుచు వ్రాయగ
    గలగలమని పారు నేరు కరణిన్ సాగెన్
    సలలితముగ నా పద్యం
    బలరె కదా యాశుకవిత యనునట్లు సుధీ!

    రిప్లయితొలగించండి
  10. అన్నయ్య గారి సీసము సంగీత సాహిత్య సౌరభాలను వెదజల్లు తున్నది. వారికి ప్రణతులు.

    రిప్లయితొలగించండి
  11. సాహిత్యమ్మది గూర్చు నెల్ల హితముల్, సంగీతమాహ్లాదమౌ
    సాహిత్యమ్ము నిరాదరింప బడినన్ సౌభాగ్యమే జాతికిన్?
    సాహిత్యమ్మువిశేషమౌ; మనము చేజార్చంగదే? పాడి యౌ
    నే? హీనమ్మగు; సంపదెంత నిడినన్ నిర్భాగ్యమా జాతిదౌ.

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చాలా మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘సంపద + ఎంత + ఇడినన్ = సంపద యెంత యిడినన్’ అవుతుంది. అక్కడ ‘సంపదల్ గలిగినన్’ అందామా?

    రిప్లయితొలగించండి
  13. సంగీ త ము సాహిత్యము
    లంగములే భాష కవియ యాలోచించన్
    గంగా తరగల బోలుచు
    అంగము బులకిం ప జేయు నహర హం బున్ .

    రిప్లయితొలగించండి
  14. గురువు గారు,
    చక్కటి సవరణకు ధన్యవాదములు.

    సాహిత్యమ్మది గూర్చు నెల్ల హితముల్, సంగీతమాహ్లాదమౌ
    సాహిత్యమ్ము నిరాదరింప బడినన్ సౌభాగ్యమే జాతికిన్?
    సాహిత్యమ్మువిశేషమౌ; మనము చేజార్చంగదే? పాడి యౌ
    నే? హీనమ్మగు; సంపదల్ గలిగినన్ నిర్భాగ్యమా జాతిదౌ.

    రిప్లయితొలగించండి
  15. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో గణదోషం. 'అహరహము భునిన్' అందాం.

    రిప్లయితొలగించండి
  16. తమ్ముడు డా. చి. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
    బాగుగనున్నది నీ ప్రశంస. సంతోషము.

    రిప్లయితొలగించండి
  17. అవును. నేమాని పండితార్యులు అలవోకగా సంగీతసాహిత్యాల ప్రశస్తిని అద్భుతంగా పద్యంలో ఇమిడ్చారు.

    రిప్లయితొలగించండి
  18. త్యాగరాజవినుత తారకరాముని
    కరిగించి రసనపై కట్టి నిలుప
    అన్నమయ్య గొలుచు అలమేలు పతిదెచ్చి
    ఊపిరి ఊయల నూప దలుప
    ఘన పురందరదాసు గాన మాధుర్యపు
    విరుల ఝరుల దెచ్చి విఠలు గొలువ
    నాయనారుల భక్తి నాదముల్ నటరాజ
    భావమై అవనిపై భవుని నిలుప
    తెరువు సంగీత సాహిత్య దీప్తి యనగ
    నతిశయంబించుక నరయ నసలు గలదె
    గానమే హర ప్రవర ఓంకార శుద్ధ
    నాదమే యమ్మ లలితా ప్రసాదమిచట

    రిప్లయితొలగించండి
  19. శారదామాతృ సత్కృపాధార లలర
    జేయు నా యాశుధారల శ్రీకరముగ
    మేలు మేలు మిస్సన కవీ! స్మితముఖాబ్జ!
    భద్రమస్తు శ్రీరస్తు సౌభాగ్యమస్తు

    రిప్లయితొలగించండి
  20. శ్రీ కళ్యాణ్ గారికి శుభాశీస్సులు.
    చక్కని సీసపద్యముతో అందరినీ అలరింప జేసేరు.
    స్వస్తి

    రిప్లయితొలగించండి



  21. సరస సంగీత సాహిత్య సమ్మిళితము
    భక్తిరసలోల గానసంభావితమ్ము
    తేట తెనుగు పల్కుల తేనె తియ్యదనము
    అన్నమాచార్య కృతుల మహత్త్వ మెన్న.

    సంగీతసాహిత్యదేవిని ప్రస్తుతించుట కింతకన్న మంచి సందర్భమేమున్నది?

    లోకమాతాత్రయీ ప్రాకట మహిమాప్ర
    భావ,సన్మంగళ భవ్యమూర్తి,
    శీతాంశు చంద్రికా సితవర్ణ తనుశోభ
    సుకుమారసౌందర్య సుభగగాత్రి
    చతురాననప్రియ ,సామగాన శ్రవ్య
    సుఖ సంభృతానంద సురుచిరాంగి
    మంజులభాషిణి,మంత్రస్వరూపిణి
    నిత్యసంతోషిణి,నీరజాక్షి,

    సర్వశాస్త్రీయ విజ్ఞతా స్థావరమ్ము
    సత్కళాశిల్ప విన్యాస జనన భూమి,
    అన్ని విద్యల కాధార మంబ ,నీదు
    పలుకె,నీ చూపె,అగునిన్ను ప్రస్తుతింతు.

    రిప్లయితొలగించండి
  22. గంధర్వ గానమన గను
    విందొన రించును తివిరి విను వీధులలో
    సుందర సాహిత్య మనగ
    పొందును మది పవశించి పోకడ తెలుపన్ !

    పోకడ = నీతి , గమనము , ప్రవర్తన
    !

    రిప్లయితొలగించండి
  23. కళ్యాణ్ గారూ,
    వాగ్గేయకారులను ప్రశంసాపూర్వకమైన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    కమనీయ కవితా మరంద మాధురీ ఝరిలో ఓలలాడించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ కందపద్యం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం.
    ‘విందై యలరించు తివిరి వినువీధులలో’ అందాం.

    రిప్లయితొలగించండి
  25. కమనీయం గారూ యెంత కమనీయంగా చెప్పారండీ!

    రిప్లయితొలగించండి



  26. శ్రీ శంకరార్యులకు, శ్రీ మిస్సన్న గారికి నా ధన్యవాదాలు.అలాగే ఈసారి మంచి సీసపద్యాలని రచించిన శ్రీ పండిత నేమాని గారికి,శ్రీ కళ్యాణ్ గారికి నా అభినందనలు.

    రిప్లయితొలగించండి


  27. ఈ rectangles ఎలా వస్తున్నాయో తెలీదు.వాటితో చదవడం కొంచెం యిబ్బందిగా ఉంది. వాటిని వదిలించుకోడం ఎలా?

    రిప్లయితొలగించండి