17, మే 2013, శుక్రవారం

పద్య రచన - 344 (వరవిక్రయము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“వరవిక్రయము”

15 కామెంట్‌లు:


  1. బ్లాగ్ వర! కవి వర ! కంది వర !
    e-బ్లాగ్ కవితల్ పద్యముల్ చమత్కారముల్
    విపణి వీధిన కాణీ కి వేలకి వచ్చునా ?
    కవివర విక్రయంబు అనంత కోటి గాదె ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబీ గారూ,
    ధన్యవాదాలు.
    ఇదేదో పద్యరచన శీర్షికకు వ్రాసిన పద్యంలా కాక సమస్యాపూరణం చేసినట్లుంది. చూద్దాం... కవిమిత్రులెవరైనా ఈ భావానికి పద్యరూపం ఇస్తారేమో?!

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గురువు గారికి నమస్సులు.
    చాలా రోజుల తరువాత నా ఈ ప్రయత్నం - జిలేబీ గారి భావానికి -
    ఉత్సాహ - కంది వారి బ్లాగునందు కవితలున్ చమక్కులున్
    విందు గాను యందు, వాని విలువ గట్టలేముగా !
    ఎందరెందరో మహానుభావులిచట చేయు రచనలున్
    అందనంత విలువ గల్గి అమరమాయె ధరణిపై !

    రిప్లయితొలగించండి
  4. జిలేబీ గారి భావానికి పద్యరూపం...........

    వివిధ కవిమిత్ర కవితలఁ
    సవరణ సూచించునట్టి సరసోక్తుడు, భా
    రవి గురు శంకర విద్వ
    త్కవి వర విక్రయముఁ జేయ కాసులు గలవే.

    భారవి = సూర్యతేజస్సమానులు

    రిప్లయితొలగించండి
  5. పూ ర్వ కాలంబు నందున పురుషు లరయ
    కొలది మందిగ నుండుట కువల యమున
    ఆడ పిల్లకు కట్నము నంద జేయ
    నండ్రు వరవిక్ర యంబని నార్యు ల య్య !

    రిప్లయితొలగించండి
  6. మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    జిలేబీ గారి భావాన్ని ‘ఉత్సాహం’గా పద్యం వ్రాసినందుకు అభినందనలు. ధన్యవాదాలు.
    రెండవ పాదంలో ‘విందుగాను యందు’ అన్నచోట యడాగమం రాదు. ‘విందుగాను నుండు’ అనండి.
    మూడవ పాదంలో గణదోషం. ‘ఎందరో మహానుభావు లిచట చేయు రచనలున్’ అంటే సరి.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    జిలేబీ గారి భావానికి మీరిచ్చిన కందపద్య రూపం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘ఆడపిల్లకు కట్నము’ అన్నారు. అది కన్యాశుల్కం అవుతుంది కదా! అక్కడ ‘ఆడపిల్లలు కట్నము’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. హరినొసగ నారదునకున్
    తరుణీమణి సత్యభామ తగ నా ముని శ్రీ
    వర విక్రయమ్మొనర్చిన
    చరితము విందౌను గాదె సరసజ్ఞులకున్

    రిప్లయితొలగించండి
  8. పూ ర్వ కాలంబు నందున పురుషు లరయ
    కొలది మందిగ నుండుట కువల యమున
    ఆడ పిల్లలు కట్నము నంద జేయ
    నండ్రు వరవిక్ర యంబని నార్యు ల య్య !

    రిప్లయితొలగించండి
  9. ఒరులెయ్యది యొనరించిన
    వర విక్రయమనుచు తాను వాగెనొ దానిన్
    గురువర! తన కొమరున కది
    జరిపించిన వాని చేష్ట చౌర్యము కాదే?

    రిప్లయితొలగించండి
  10. సతిని విక్రయించె సత్యము నిత్య మంచు
    పతిని విక్రయించె నహమున పడతి సత్య
    తొల్లి విక్రయింత్రు తనయ నల్లుని కట
    వరుల విక్రయ మనిన వెఱగు గాదె ?

    రిప్లయితొలగించండి




  11. ఈ నవీనకాలమ్మున గాన,తగిన
    వధువు దొరకుటే కడు దుర్లభమ్ము కాగ
    కొమ్మలే యువకుల నెన్నుకొనుచు నుండ,
    నింక 'వరవిక్రయమ్మంచు 'నెచట గలదు ?

    రిప్లయితొలగించండి






  12. నా పద్యం మొదటి పాదాన్ని యీ విధంగా సవరిస్తున్నాను.

    ' ఈ నవీన కాలమ్మున నెన్నదగిన '

    రిప్లయితొలగించండి
  13. పైకముఁ జెల్లించి కొనగ
    లేకుండునె సర్వహక్కు లెవ్వరి కైనన్
    గాకుండగ నిద్ధరణిన్
    దా కొన్నవరుడె వధువును తగలన్ బెట్టున్!
    (కొందరి విషయంలోనే నని భావించ మనవి)

    రిప్లయితొలగించండి

  14. కాళ్ళ కూరి వారు నేళ్ళ క్రిందట వ్రాసె
    కన్య నిచ్చి వరుని కాసు కొఱకు
    నేటి వరులు కాంత సాటి కాదని యెంచి
    కనక మేను విక్రయ మునకు సాటి

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    కృష్ణ తులాభారం నేపథ్యంగల మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    వ్యంగ్యాత్మకమైన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    1వ, 3వ పాదాల్లో గణదోషం. నా సవరణ.....
    సతిని విక్రయించె నొకండు సత్య వ్రతుడు
    పతిని విక్రయించె నహమున పడతి సత్య
    తొల్లి విక్రయింత్రు తనయ నల్లుని కట
    వరుల విక్రయ మనినను వెఱగు గాదె ?
    మీ రెండవ పద్యం చివరి పాదంలో గణదోషం.. ‘కనకమే మేలు వికయమునకు సాటి’ అందామా?
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి