జిలేబీ గారూ, నిజమే!.. మన బ్లాగులు వీధియరుగుల వంటివే... * వీధి యరుగు గురించి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సుబ్బారావు గారికి, లక్ష్మీదేవి గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, సహదేవుడు గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * జిగురు సత్యనారాయణ గారూ, మీ పద్యం ప్రత్యేక ప్రశంసకు అర్హమైనది. అభినందనలు, ధన్యవాదాలు.
రాటపాటల పిల్ల లలరించుచుండంగ తల్లిదండ్రులు వినోదమ్ము నొంద , దేశవిదేశ సంస్థితి వేడి చర్చించు పనిలేనీ 'మేధావి ' వర్గములును
వీథి యరుగన నొక సంస్థ విధిని పూర్వ కాలమందున నెన్నియో కార్యములకు నిలయమై యలరారె నేడు దాని జాడయే కనరాదు జనులు ' వేస్టండ్రు 'దాని. పట్టణాల్లో పరిస్థితిని వివరించాను.పల్లెటూళ్ళలో ఇంకా అవి ఉండవచ్చును. కాని,కొన్నాళ్ళలో అక్కడ కూడా అవి మాయమౌతాయనుకొంటాను.
దారిలోనబోవు ఏ మహానుబావునకు ఆసనమైనదో నా వీధిఅరుగు ఊరిలోనకు వచ్చు ఏ అతిధి అలుపునకు సేదతీర్చేనో నా వీధిఅరుగు ఊరెరిగింపుల ఉత్సవమూర్తులకు పాదములుకదిగె నా వీధిఅరుగు హరిదాసు పాటలను గంగిరేద్దుల ఆటలేన్ని చుసెనో నా వీధిఅరుగు
అక్కచెల్లెళ్ళ చెతుల్ల గాజుల్ల గలగలతో కళ్ళాపి చల్లించుకున్నదోయి ఇంటి ఇల్లలిదొసిళ్ళ గొబ్బెమ్మ కూర్చంగ ఉల్లాసమున ఉప్పొంగేనోయి తల్లిపెట్టిన పెద్ద చుక్కాల ముగ్గుతో ముస్తాబు చెయించుకున్నదోయి తొల్లి మా పెద్దాళ్ళు కట్టిన వీధిఅరుగు నాపుణ్యాలపంటమా వీధిఅరుగు
కమనీయం గారూ, వీధి అరుగు గురించి చాలా మంచి పద్యాలను వ్రాసారు. అభినందనలు. ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి. సీస పద్యాన్ని మూడు ముక్కలు చేయడంతో నేను కొంత అయోమయంలో పడ్డాను. ఎత్తుగీతిలో మూడవ పాదంలో ‘అలరారె’ అన్నచోట గణదోషం.. ‘అలరారెను’ అంటే సరి! * శర్మ గారూ, ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీలో చక్కని భావశబలత ఉన్నది. దానిని ఛందోబద్ధంగా వ్రాయడానికి ప్రయత్నించండి.
కాలక్షేపం కబుర్లు జిలేబీ అమ్మకాలు
పద్య రచనలు సమస్యా పూరణలు
వంటకాల తయారీ దేశ రాజకీయం
కాదేదీ బ్లాగ్ వీధి యరుగుకు అనర్హం !
జిలేబి
అరుగును నేనే వీధిని
రిప్లయితొలగించండియరిగెడు ఓ బాట సారి యలసితి వేమో
అరిగిన యరుగక యున్నను
తిరుగక నూ సేద తీర తీరే మారున్.
వీధి యరుగున గూర్చుండి వివరముగను
రిప్లయితొలగించండితీర్పు లిత్తురు పెద్దలు తీర్పు లెన్నొ
కొన్ని తీర్పులు మంచిగ కొన్ని వెగటు
కలిగి యుండును నేరపు సరళి బట్టి
అరుగుపై తాత ప్రతిరోజు నధ్యయనము
రిప్లయితొలగించండిచేయుచుండిరి శ్రద్ధగా శ్రీకరమగు
గీత లో శ్లోకములనెల్ల , గీత పావ
నమ్ము నిత్యము పఠియింప నయమటంచు.
శాస్త్ర పురాణాల చర్చ వీథియరుగు
రిప్లయితొలగించండి******పిచ్చిపాటి కబుర్లు వీథియరుగు
బాటసారులకును పడక వీథియరుగు
******పేకాట పేచీకి వీథియరుగు
పట్టు చీరల ప్రాభవంబు వీథియరుగు
******చేడియ చాడీల వేడి యరుగు
పిల్లలాటలకును విడిది వీథియరుగు
******వెలుగు చుట్టలకును వీథియరుగు
అరుగు కాలములు తరిగి జరిగి పోయె
నరులు మఱిచిరి తమ తాత తరము ఘనత
వరము కాదె మనకునొక యరుగు కలుగ
స్థిరము లేని జన్మంబుకు చివరి మజిలి!!
వేదిక యగునట నరుగే
రిప్లయితొలగించండివీధి బడుల కైన పఠించు వేదము లైనన్
సేదను దీర్చును పాంధుల
సాదరముగ స్వాగ తించు సాంగత్యము నన్ !
-------------------------------------------
తిన్నెలు పూర్వము ముంగిట
వన్నెలు గురి పించి జనుల వైభో గములన్ !
నెన్నగ తగవులు తీర్పుల
నెన్నెన్నో రాజ్యాంగ విధుల నేరుపు సరణిన్ !
వార్త వ్యాపించు నూరంత వన్నెమారి
రిప్లయితొలగించండిగొప్ప కోతల రాయుల్లు కొలువు దీర
సత్య మన్నది దెలియును నిత్య మచట
దూర దర్శను భాగ్యాన తొలగ ప్రభలు
దూర మాయె వీథియరుగు చేర జనులు!
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండినిజమే!.. మన బ్లాగులు వీధియరుగుల వంటివే...
*
వీధి యరుగు గురించి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు...
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
సహదేవుడు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పద్యం ప్రత్యేక ప్రశంసకు అర్హమైనది. అభినందనలు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివీథి యరుగులొకప్పు డవెచ్చటిపుడు?
బహువిధమ్ముల నుపయోగ పడెడునవ్వి.
అకట,నేటి ఫ్లాటులలోన నసలు పొరుగు
వారి దర్శనమ్మే కరువాయె నేడు.
దారిబోయెడివారి దగ్గరకుంబిల్చి
కుశలమ్మునడిగెడి కొందరుండ,
చీట్లపేకల యాట చీకటిపడుదాక
కాలమ్ము మరచెడి ఘనులుకొంద
రాటపాటల పిల్ల లలరించుచుండంగ
తల్లిదండ్రులు వినోదమ్ము నొంద ,
దేశవిదేశ సంస్థితి వేడి చర్చించు
పనిలేనీ 'మేధావి ' వర్గములును
వీథి యరుగన నొక సంస్థ విధిని పూర్వ
కాలమందున నెన్నియో కార్యములకు
నిలయమై యలరారె నేడు దాని
జాడయే కనరాదు జనులు ' వేస్టండ్రు 'దాని.
పట్టణాల్లో పరిస్థితిని వివరించాను.పల్లెటూళ్ళలో ఇంకా అవి ఉండవచ్చును.
కాని,కొన్నాళ్ళలో అక్కడ కూడా అవి మాయమౌతాయనుకొంటాను.
దారిలోనబోవు ఏ మహానుబావునకు ఆసనమైనదో నా వీధిఅరుగు
రిప్లయితొలగించండిఊరిలోనకు వచ్చు ఏ అతిధి అలుపునకు సేదతీర్చేనో నా వీధిఅరుగు
ఊరెరిగింపుల ఉత్సవమూర్తులకు పాదములుకదిగె నా వీధిఅరుగు
హరిదాసు పాటలను గంగిరేద్దుల ఆటలేన్ని చుసెనో నా వీధిఅరుగు
అక్కచెల్లెళ్ళ చెతుల్ల గాజుల్ల గలగలతో కళ్ళాపి చల్లించుకున్నదోయి
ఇంటి ఇల్లలిదొసిళ్ళ గొబ్బెమ్మ కూర్చంగ ఉల్లాసమున ఉప్పొంగేనోయి
తల్లిపెట్టిన పెద్ద చుక్కాల ముగ్గుతో ముస్తాబు చెయించుకున్నదోయి
తొల్లి మా పెద్దాళ్ళు కట్టిన వీధిఅరుగు నాపుణ్యాలపంటమా వీధిఅరుగు
కమనీయం గారూ,
రిప్లయితొలగించండివీధి అరుగు గురించి చాలా మంచి పద్యాలను వ్రాసారు. అభినందనలు.
ఆలస్యంగా స్పందించినందుకు మన్నించండి.
సీస పద్యాన్ని మూడు ముక్కలు చేయడంతో నేను కొంత అయోమయంలో పడ్డాను.
ఎత్తుగీతిలో మూడవ పాదంలో ‘అలరారె’ అన్నచోట గణదోషం.. ‘అలరారెను’ అంటే సరి!
*
శర్మ గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీలో చక్కని భావశబలత ఉన్నది. దానిని ఛందోబద్ధంగా వ్రాయడానికి ప్రయత్నించండి.