27, జూన్ 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 12

రామాయణము-
చ.      జగతివిభుండు సద్(హసనసంయుతుఁడై ధృతి నంత మాద్రి)నె
ప్డు గనఁగ లేదనెన్; (మమతఁ బొందె, మహీసురు మాట నాఱె) నా
వగ యనె భూపుఁడున్ (ధవుఁడు బాండుసమాఖ్యుఁడు; తత్సుకీర్తి)తో
నగరియు వెల్గె, రే(యతివ నాధుని రాజును హాళిఁ గూడె)నాన్. (౨౭)

భారతము-
తే.      హననసంయుతుఁడై ధృతి నంత మాద్రి
మమతఁ బొందె, మహీసురు మాట నాఱె
ధవుఁడు బాండుసమాఖ్యుఁడు; తత్సుకీర్తి
యతివ నాథుని రాజును హాళిఁ గూడె. (౨౭)


టీక- ధృతినంతమాద్రి = (రా) అంతకు సామ్యమగు సంతసమును; ఆఱె = చనిపోయెను; పాండుసమాఖ్యుఁడు = (రా) తెల్లని కీర్తి గలవాఁడు; రాజును = (రా) చంద్రుని, (భా) పాండురాజును; మాట = (రా) దీవన, (భా) శాపము; హసన = నవ్వు (సంతోషము చేత).

రావిపాటి లక్ష్మీనారాయణ

2 కామెంట్‌లు:

  1. పద్య మంతయు గాకుండ మధ్య లోన
    విడిగ నున్నట్టి పద్యము వెలికి తీసి
    మనకు జూపిన ధీశాలి మనగు రువులె
    వంద నంబులు వారికి వంద లాది

    రిప్లయితొలగించండి