6, జూన్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1435 (మోసగించువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
మోసగించువాఁడె పుత్త్రుఁ డగును. 

21 కామెంట్‌లు:

  1. తల్లి దండ్రి మనసు తలక్రిందులు జేసి
    తనకు నచ్చి నటుల తనరు వాడు
    ఆస్తి పాస్తు లందు నాలికౌగిట నూగి
    మోస గించు వాడె పుత్రు డగును

    రిప్లయితొలగించండి
  2. ఇంటఁ బయట నచట నిచట దనకుగల
    కష్టములు దెలియగ కలత చెందె
    దరని, పై నగవులఁ దనతల్లిదండ్రుల
    మోసగించువాఁడె పుత్త్రుఁ డగును.

    రిప్లయితొలగించండి
  3. తండ్రి నేతయైన, తండ్రిని మించిన
    పగిది దోచుకొనుచు, ప్రజల నెల్ల
    మోసగించువాడె పుత్రు డగును భువి
    నతడె పిదప నేతయై చెలంగు

    రిప్లయితొలగించండి

  4. సర్వభూత ములలొ సాక్షితానేయనుచు
    దీనవృద్ధవరుల సేవజేసి
    తాను తనదియన్న తాత్పర్యదోషాల
    మోసగించువాఁడె పుత్త్రుఁ డగును.

    రిప్లయితొలగించండి


  5. మోసగించు వాడే పుత్తు డగున్ ఇలలో
    పుత్తు నించి విడిపించు వాడె పుత్రుడగున్
    నరుడా పుత్తుకున్ పుత్త్రుకున్ వ్యత్యాసము
    తెలిసి మాతా పితరులన్ సరిజూసుకొమ్ము !!


    ప్రేరణా తీర్థం!
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. చింత లెన్ని యున్న చిరునవ్వు చెదరక
    సంతసమ్ము గదుర సాగు చుండి
    తల్లి దండ్రి చెంత తన వేదనను దాచి
    మోసగించువాఁడె పుత్త్రుఁ డగును.

    రిప్లయితొలగించండి
  7. మోస పోవు నిజము ముదితలార !భువిని
    మోసగించు వాడె, పుత్రు డగును
    "పు " అను నరక బారి బ్రోచు వాడే మఱి
    పుత్రు డుం డ వలయు ముద్దు లీయ

    రిప్లయితొలగించండి

  8. భార్య కోరికలను భర్తగా తీర్చుచు
    తల్లి దండ్రుల యెడ దప్పు లేక
    నడుచుకొనుచు నెపుడు నగుబాటు గాకుండ
    మోసగించు వాడె పుత్రుడగును!

    తల్లిదండ్రి మాట తప్పక పాటించి
    కోరినట్టి భార్య కోర్కె దీర్చి
    ఒండొరులకు ప్రేమ నిండుగా నిడుటకై
    మోసగించువాడె పుత్రుడగును!

    రిప్లయితొలగించండి
  9. దుష్టు డగును పరుల దుర్మార్గ బుద్ధితో
    మోసగించువాడె, పుత్రుడగును
    ముసలి తల్లి దండ్రి పూజ్యనీయులనుచు
    సంతతమ్ము ప్రేమ సాకు వాడు


    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    సరదాగా నా పూరణ
    =============*=================
    కర్మ భూమి యందు ఖలుల బలిమి గల
    మోస గాళ్ళ నెల్ల మోసగించు
    వాడె పుత్రు డగును, వాద భేదమ్ములు
    వలదు వలదు నేడు బ్లాగు నందు !

    రిప్లయితొలగించండి
  11. Hello all,
    My friend Kandi Shankaraiah is busy with his grand daugher's marroage and anable to reach the blog. He is feeling sorry and asked me to pass the message. Thank you.
    Kasarla Madhusudan.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి పూరణలు అన్నియును బాగుగ నున్నవి. అందరికి అభినందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రి M.R.చంద్రమౌళి గారు!
    మీ పద్యములో కొన్ని మార్పులు --
    సర్వభూత తతుల సాక్షి తానే యని
    దీన వృద్ధ జనుల సేవజేసి ...
    ....
    ....

    శ్రీ సుబ్బా రావు గారు:
    పుత్ (పుత్తు) అను నరకము నుండి తప్పించువాడు పుత్రుడు. పు అను నరకము కాదు.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    పూజనీయులు లేక పూజ్యులు అనవచ్చును. పూజ్యనీయులు అనరాదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. దొంగతనము జేసి దోచుకొని జనుల
    బ్రతుకు వాని కొడుకు వార సత్వ
    మబ్బి యవనిలోన ననుదినము
    మోసగించు వాడె పుత్రు డగును

    రిప్లయితొలగించండి
  14. శ్రీ లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యౌ బాగుగ నున్నది. అభినందనలు.
    3వ పాదములో కొన్ని అక్షరములను టైపు చెయ్యలేదు. చూడండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. తమరి సవరణకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు
    మీ సూచనకు ధన్యవాదములు

    దొంగతనము జేసి దోచుకొని జనుల
    బ్రతుకు వాని కొడుకు వార సత్వ
    మబ్బి యవనిలోన ననుదినమ్మట్టులే
    మోసగించు వాడె పుత్రు డగును







    రిప్లయితొలగించండి
  17. తనయుడు పగతోడ, తండ్రిని మోసము
    చేసినట్టి వాని చేర దీసి,
    నమ్మకము నటించె,నటుపైన వానిని
    మోసగించువాఁడె పుత్త్రుఁ డగును

    రిప్లయితొలగించండి
  18. తల్లి దండ్రి మాట తరుణికి సవరించి
    తరుణి మాట యటులె తగవు లేక
    యింటి గుట్టు నిలుప నెదుటి వారి నెపుడు
    మోసగించు వాడె పుత్రుడగును!

    రిప్లయితొలగించండి
  19. తల్లి దండ్రి మాట తరుణికి సవరించి
    తరుణి మాట యటులె తగవు లేక
    యింటి గుట్టు నిలుప నెదుటి వారి నెపుడు
    మోసగించు వాడె పుత్రుడగును!

    రిప్లయితొలగించండి
  20. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    ముద్దుబిడ్డతాను మోహనాకారుడై
    ఆటపాటలందు నందముగను
    మట్టితినియు తాను గట్టిగా లేదంచు
    మోసగించువాడు పుత్త్రుడగును

    బిడ్దతోడ తానుపిన్నవారల యాట
    బూచిలాడుచుండ పొలుపుగాను
    దాగుకొనుచు తాను తలుపుల చాటున
    మోసగించు వాడు పుత్త్రుడగును

    చిన్నతనమునందు చిలిపిగా నాటల
    మోసగించువాడు పుత్త్రుడగును
    పెద్దయైనవేళ పెట్టకపితరుల
    మోసగించువాడు మోసగాడె

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు.
    మూడు రోజులుగా మా మనుమరాలి పెళ్ళి పనుల్లో వ్యస్తుణ్ణై బ్లాగుకు దూరమయ్యాను. మన్నించండి.
    చక్కని పూరణలను వ్రాసిన....
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారికి,
    పండిత నేమాని వారికి,
    యం. ఆర్. చంద్రమౌళి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    సుబ్బారావు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    కందుల వరప్రసాద్ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    సహదేవుడు గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి
    అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి