9, జూన్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1439 (పడుచు కోరికల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.

26 కామెంట్‌లు:

  1. తనివి తీరని యవ్వన దశను తలచి
    పెరిగి పోయిన వయసుకు తరిగె సొగసు
    రెప్ప పాటున కాలము తప్పు కొనెను
    పడుచు కోరికల్ సెలరేగు వార్ధక మున

    రిప్లయితొలగించండి
  2. అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘యవ్వనదశ’ను ‘యౌవనదశ’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. కట్టు వీడిన గుఱ్ఱము గంతు లిడుచు
    పరుగిడుట సాజమటులనే వయసు లోన
    పడుచు కోరికల్ సెలరేగు;వార్ధకమున
    కోరి పరమాత్మ సన్నిధి చేరదగును

    రిప్లయితొలగించండి

  4. పడుచు కోరికల్,సెలరేగు వార్ధకమున
    వాటి తీయటి తలపుల బాధల్ , నాటి
    వయసున కవి కన్న మధుర కలల్
    విశ్రామ కాలమున వాటి మెరుపుల్ !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. paDucu praayamunaMduna paDitivenno
    kashTa nashTaalu kaalammu gaDacipOye
    maadhavuni golvumanucunu manasu veMTa
    baDucu kOrikal selarEgu vaardhakamuna.

    రిప్లయితొలగించండి
  6. రాజ భవనాన సాగించి రాస క్రీడ
    కామ కేళీ విలాసాల కేమరాకు
    పట్టుబడినాడు రాష్ట గవర్నరొకడు
    పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున

    రిప్లయితొలగించండి
  7. పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
    నవును వార్ధక్య మనునది యసలు లేదు
    కోరి కలకున వియెపుడు గోరు చుండు
    బడుచు దనమును నిజమిది బాల !వినుము

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ....

    పడుచు ప్రాయమునందున పడితివెన్నొ
    కష్ట నష్టాలు కాలమ్ము గడచిపోయె
    మాధవుని గొల్వుమనుచును మనసు వెంట
    బడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున.

    రిప్లయితొలగించండి
  9. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం....

    పడుచు కోరికల్,సెలరేగు వార్ధకమున
    వాటి తీయటి తలపుల బాధ, నాటి
    వయసులో కవి కన్న స్వప్నములు నేటి
    విశ్రమించెడి కాలాన వెలుగులీను.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వెంటబడుచున్న కోరికలతో మీ పూరణ వైవిధ్యంగా, మనోరంజకంగా ఉంది. అభినందనలు
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. షష్టి పూర్తి రోజున జంట చక్కనైన
    క్రొత్త దుస్తులు ధరియించి, క్రొత్త లోక
    మందు విహరించ, మానస మందు మెదలి
    పడుచు కొరికల్ సెలరేగు వార్థకమున

    రిప్లయితొలగించండి
  11. గురువులకు ప్రయాగ శ్రీరామచంద్రమూర్తి నమస్కారములు.

    పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
    పొసగు జవము మనసు పొందు నొంద
    తారతమ్యమెరిగి జూడ తాతకైన
    ధర్మకామము యుక్తమే ధరణి లోన

    రిప్లయితొలగించండి
  12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం.

    రిప్లయితొలగించండి
  13. సహజముగ యుక్త ప్రాయపు జంటలకును
    పడుచు కోరికల్ సెలరేగు, వార్థకమున
    తలపునకువచ్చు,సంసార తవిష మీద
    నెంత దుర్భర కార్యమో యెరుక పడును

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గణదోషము సూచించినందుకు ధన్యవాదములు.
    సవరణ:-

    పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున
    పొసగు జవము మనసు వాంఛ పొందు నొంద
    తారతమ్యమెరిగి జూడ తాతకైన
    ధర్మకామము యుక్తమే ధరణి లోన

    రిప్లయితొలగించండి
  16. బాల్య మందుక్రీడలయందు పరమ ప్రీతి
    జవ్వనమునందు సహజము జనుల లోన
    పడుచు కోరికల్ సెలరేగు;వార్ధకమున
    పారమార్థిక చింతన పరిఢ విల్లు!!!

    రిప్లయితొలగించండి
  17. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మల్లెల సోమనాధశాస్త్రి గారి పూరణలు

    పడుచు కవులకు కంటెను,వారియనుభ
    వముల శృంగార రసయుత భావములను
    చాలబాగుగ వర్ణింప శక్తులగుట
    పడుచుకోరికల్ సెలరేగు వార్ధకమున

    ఆమ నందున మల్లెలు నాది వలన
    బాగ చెలరేగు శృంగార భావములవి.
    ముదిమి వారల మదిమెల్గ,మునుపు గుర్తు
    పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున

    రిప్లయితొలగించండి
  19. పౌత్ర దౌహిత్రుల వివాహ వయసునందు
    పెండ్లి వేడుకఁ జూచిన వృద్ధులకును
    షష్టి పూర్తి జరుపుకున్న జంటలకును
    పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున

    రిప్లయితొలగించండి
  20. పడుచుతనములోన చిలిపి పనులు జేసి
    వయసుమళ్ళిన ముదుసలి వయసులోన
    గతపు చేష్టలు సతతము మతికి రాగ
    పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున!

    రిప్లయితొలగించండి
  21. యౌవనము నందు వాసంత భావనలకు
    కమ్మనైనట్టి తావుల గాలికెగసి
    పడుచు కోరికల్ సెలరేగు; వార్ధకమున
    మోక్షమార్గంపు గంగలో మునక మేలు

    రిప్లయితొలగించండి


  22. ఆశ శర్మిష్ఠపై దేవయాని యున్న
    శాప మొందినన్ వృద్దుడై శమముగాక
    యౌవనార్థియై సుతుని యయాతి యడుగ
    పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున

    రిప్లయితొలగించండి
  23. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. మనసు నూయల నూపుచు తనువు మరచు
    యుగళ గీతాల వినుచుండి మిగుల మురిసి
    కనులు మూయుచు కలలోన తనరు వేళ
    పడచు కోరికల్ సెలరేగు వార్ధకమున!

    రిప్లయితొలగించండి
  25. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి