11, జూన్ 2014, బుధవారం

సమస్యా పూరణం - 1441 (గానసుధారసము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
గానసుధారసముఁ గురిసె గాడిద లొకటై.

37 కామెంట్‌లు:

  1. పానము జేయగ తేనియ
    గాన సుధా రసము గురిసె , గాడిద లొకటై
    చేనుల జొరబడి కూయగ
    కానగ యజమాని వచ్చి ఘనముగ బాదెన్

    రిప్లయితొలగించండి
  2. అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    తేనెను త్రాగితే గానసుధారసం కురుస్తుందా? అక్కడ ‘పానము చేసితిఁ తేనియఁ/ గాన (కాన=కనుక) సుధారసము...’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  3. హీన పరస్పర దూష్యులు
    గానక్షేత్రాధివరులు కలహోపహతుల్
    మానవతవీడి వర్తిల
    గాన సుధారసము గురిసె గాడిద లొకటై

    రిప్లయితొలగించండి
  4. మేనులు పులకించు ననుచు
    గానము పానమ్ము జేయ గలరని బిలువన్
    వీనులు చిల్లులు పడునటు
    గానసుధారసముఁ గురిసె గాడిద లొకటై.

    రిప్లయితొలగించండి
  5. ఆవంద మొదవె ఖరముల
    గాన విభావరి విరియగ గార్ధభ పెళ్లిన్
    పానము జేయగ కూడగ
    గాన సుధారసముఁ గురిసె గాడిద లొకటై!

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    ‘గార్దభపెళ్ళి’ అని సమాసం చేయరాదు కదా... ‘గాడిద పెళ్ళిన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. గానపు పోటీ బెట్టగ
    కాననమునగల మృగముల కాంతల కెల్ల
    న్నానన మందున నగవున
    గాన సుధా రసము గురిసె గాడిద లొకటై

    రిప్లయితొలగించండి
  8. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    పూరణ1:కానలకొలువున కోకిల
    గానసుధారసము గురిసె, గాడిద లొకటై
    నేనుగు నేలిక వేడిరి
    గానము సేయగ తమ కవ కాశము నీయన్
    పూరణ2:ఈనాటి స్వర ఫణితుల
    నానాటి త్యాగరాజు నబ్బురపడుచున్
    మానుగ విని పులకించిరి
    గానసుధారసము గురిసె, గాడిద లొకటై

    రిప్లయితొలగించండి
  9. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. జానపద గేయములతో
    గానసుధారసము గురిచె, గాడిద లొకటై
    కాననమందున కూయగ
    వీనులు చిల్లులు పడియెను, విన్న జనులకున్

    రిప్లయితొలగించండి
  11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘నానాటికి’ అంటే సరిపోతుంది. టైపాటు కావచ్చు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నానా విధ సంగీతపు
    గాన సుధా రసము గురిసె, గాడిద లొకటై
    వీనులతో విని మొరిగెను
    గానములో మాకు సాటి కలరెవ్వారున్.

    రిప్లయితొలగించండి
  13. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరి రెండు పాదాలకు నా సవరణ....
    “వీనుల విని యోండ్రించెను
    గానములో మాకు సాటి కలరే యనుచున్”

    రిప్లయితొలగించండి
  14. మనమును పాడుద మా పిక-
    మేనా పాడంగ ననుచు హీన గళములన్
    కానలు ప్రతిధ్వనించగ
    గానసుధారసముఁ గురిసె గాడిద లొకటై!

    రిప్లయితొలగించండి
  15. చంద్రమౌళి గారి పూరణ చాలా బగుంది.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    మొదటి పాదములో ప్రాస కొంచెము తేడా కనుపించుచున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
    చక్కని సవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ,
    నేమాని వారు చెప్పేదాక నేను మీ పద్యంలోని ప్రాసదోషాన్ని గమనించలేదు.
    ‘మనమును’ అన్నదాన్ని ‘మానక’ అని సవరిస్తే?

    రిప్లయితొలగించండి
  20. నేమాని పండితులకు, గురువుగారికీ ధన్యవాదములు. పొరబాటుకు చింతిస్తూ సవరించిన పూరణ:

    మానక పాడుద మా పిక-
    మేనా పాడంగ ననుచు హీన గళములన్
    కానలు ప్రతిధ్వనించగ
    గానసుధారసముఁ గురిసె గాడిద లొకటై!

    రిప్లయితొలగించండి
  21. చంద్రమౌళి రామారావు గారి పూరణ :-
    వానర గార్దభ చయ స
    న్మాన సభఁ పరస్పరాభి నందనము లిటుల్
    "జ్ఞాన జ్యోతులిడె కపులు"
    "గానసుధారసముఁ గురిసె గాడిద లొకటై"

    రిప్లయితొలగించండి
  22. వీనుల విందుగ పాడగ
    గానసుధారసముఁ గురిసె, గాడిద లొకటై
    పూనిక గొని ఓండ్రించెను
    మానవులకు తాము సములమని చూపించన్.

    రిప్లయితొలగించండి
  23. కానల కోకిల కూయగ
    గానసుధారసముఁ గురిసె, గాడిద లొకటై,
    మౌనముగా, తమ కిడుమని
    వీనుల విందైన గొంతు వేడెను దేవున్

    రిప్లయితొలగించండి
  24. చంద్రమౌళి రామారావు గారూ,
    చక్కని ధారతో మీ పూరణ పద్యం పరుగులెత్తింది. చాలా బాగుంది. అభినందనలు.
    *
    ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారికీ ధన్యవాదములు. సవరించిన పూరణ:
    ఆవంద మొదవె ఖరముల
    గాన విభావరి విరియగ గాడిద పెళ్లిన్
    పానము జేయగ కూడగ
    గాన సుధారసముఁ గురిసె గాడిద లొకటై!

    రిప్లయితొలగించండి

  26. వీనులవిందగు కూతలు
    హీనముగాదచట వినగ నిచ్చతొ పాడన్
    జ్ఞానమునందొకటే గద
    గాన సుధారసముఁ గురిసె గాడిద లొకటై!

    రిప్లయితొలగించండి
  27. మల్లెల సోమనాధ శాస్త్ర్తి గారి పూరణలు

    ఫేనము పోంగెడి బీరును
    పానము చేయుచు పదుగురు పబ్బున పాటల్
    వీనులుచెడగను పాడిన
    గానసుధారసము గురిసె గాడిదలొకటై

    వనమున కోకిలలందము
    కనగను లొట్టియ నటనయు,గానముచేయన్
    వినదగు రవమై యరసిక
    గానసుధా రసముగురిసె గాడిదలొకటై

    రిప్లయితొలగించండి
  28. శ్రీ మల్లెల సోమనాథ శాస్త్రి గారు:
    మీ 2 పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
    2వ పద్యములో ప్రాస నియమము పాటింపబడలేదు.
    ప్రాస అక్షరము "న". దాని ముందున ఉన్న అక్షరము మొదటి పాదములో దీర్ఘాక్షరము కావున 4 పాదములలోను దీర్ఘాక్షరము ఉండవలెను. మరల ప్రయత్నించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. కానగ, భువిన్ రసజ్ఞత
    కానని ప్రేక్షకులతిశయ గౌరవమిడగా
    ఛానలునందు నిస్సార
    గానసుధారసముఁ గురిసె గాడిద లొకటై!

    రిప్లయితొలగించండి
  30. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఇచ్ఛతొ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ఇచ్ఛను అంటే సరి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో ప్రాసదోషానికి నా సవరణ....

    కానను కోకిల లందము
    కానగ లొట్టియ నటనయు, గానము చేయన్
    వీనులకు దోచె నరసిక
    గానసుధా రసముగురిసె గాడిదలొకటై
    *
    మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘ఛానలులో నిస్సారపు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  31. కానల నక్కలు కూసెను
    పూనుచు దుర్యోధనుండు పుట్టిన వేళన్
    మానుల గూబలు మొరలిడె
    గానసుధారసముఁ గురిసె గాడిద లొకటై

    రిప్లయితొలగించండి

  32. జిలేబీ వారి గానము ఎఫెక్ట్ :)

    వానయు వెలిసె, జిలేబీ
    గానసుధారసముఁ గురిసె, గాడిద లొకటై
    తానము లాడగ నోండ్రిం
    చేనయ వచ్చిన పదుగురు చెల్లచెదురవన్‌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. దానా దండిగ దొరకుచు
    పానీయపు కొరతలేక పాటవమెచ్చన్
    వానా కాలపు రాత్రుల
    గానసుధారసముఁ గురిసె గాడిద లొకటై...

    రిప్లయితొలగించండి


  34. మానస వీణను మీటగ
    గానసుధారసముఁ గురిసె, గాడిద లొకటై,
    తానాతందానాయనె
    కానక కన్నది జిలేబి కల హైలెస్సా!


    జిలేబి

    రిప్లయితొలగించండి