14, జూన్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1444 (నారినిఁ బెండ్లాడువాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.
(ఒకానొక అవధానంలో విన్న సమస్య)

41 కామెంట్‌లు:

  1. కోరుచు సల్లక్షణయగు
    నారిని బెండ్లాడ గను ననంత సుఖమ్ముల్
    పేరాసతో విరసయగు
    నారిని బెండ్లాడువాడు నవ్వులపాలౌ

    రిప్లయితొలగించండి
  2. .ఓరిమి లేకను మెలగుచు
    కోరికలకు మితము లేక కోపము మెండౌ
    సారము తోడిదె బ్రతుకను
    నారిని బెండ్లాడు వాడు నవ్వుల పాలౌ

    సారము = ధనము

    రిప్లయితొలగించండి
  3. సారము దానముసేయ ను
    దారతచాలునె యపేక్ష దారకులేకన్
    కోరికచెల్లునె? గని పిస
    నారిని బెండ్లాడువాడు నవ్వులపాలౌ

    రిప్లయితొలగించండి
  4. ఆరుపదులు దాటిన వయ
    సారాటము తగ్గని ముదుసలియై తమితో
    నారని ముకుపచ్చల చి
    న్నారిని పెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పేరంటంబుల జూచిన
    చీరల నగలను కొనమని చిందులు వేసే
    పేరాశల కలలుగనే
    నారినిఁ బెండ్లాడు వాడు నవ్వుల పాలౌ!

    రిప్లయితొలగించండి
  7. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వేసే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  8. దూరాలోచన లేక దు
    బారా ఖర్చులను జేసి ప్రస్తుత కోర్కెల్
    తీరుచుకొను గడు దుర్గుణ
    నారిని బెండ్లాడు వాడు నవ్వుల పాలౌ

    రిప్లయితొలగించండి
  9. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. వీరా !యేమని యంటివి ?
    నారిని బెండ్లాడు వాడు నవ్వుల పాలౌ
    నారిని బెండ్లాడక మఱి
    జారిణి బెండ్లాడ దలతొ యిప్పుడు చెపుమా !

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మరి జారిణి కూడా నారియే కదా!

    రిప్లయితొలగించండి
  12. చీరను గట్టుట తెలియదు
    చారైనను చేయరాదు చాటింగ్ తెలియున్
    యేరా యని మగని పిలుచు
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ

    రిప్లయితొలగించండి
  13. పారుచు నటునిటు సతతము
    దూరుచు పొరుగింట , వారిఁ దూరుచు మగనిన్
    మీఱుచు జగడము లాడెడి
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ

    రిప్లయితొలగించండి
  14. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నవి. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ లక్ష్మీనరాయణ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    "ప్రస్తుత కోర్కెల్" అనే సమాసము సాధువు కాదు.
    ప్రస్తుత వాంఛల్ అని మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవిపండితమిత్రులందఱికిని హృదయపూర్వక నమస్కారములు.

    తోరమ్ముగ దానములను
    గోరిన రీతిగ నిడి, వెసఁ గూరిమిఁ బంచన్
    గోరెడి గుణియై, యొక పిసి
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ!

    రిప్లయితొలగించండి
  17. మిత్రులు శంకరయ్యగారూ,

    ఆఱుపదులు దాటిన ముదుసలి...ముకుఁబచ్చలారని పసిబాలికను బెండ్లాడినచో...నవ్వులపాలగునని చక్కఁగా పూరించినారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు M.R.CHANDRAMOWLY గారూ, మీ పూరణము బాగున్నది. కాని, ద్వితీయ పాదాంతాన "లేకన్" ద్రుతాంతముకాదు. సవరింపఁ గలరు. అన్యథా భావింపవలదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్ గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం!
    మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
    నా పూరణ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
    ఆఱుపదులు, ముకుఁబచ్చలు... అంటూ నా దోషాలను పరోక్షంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. కోరిన మగువను పొందుట
    పేరిమి యగునా? కుటుంబ పెద్దలు యున్నన్
    భారము ఖర్చుయనెడి పిసి
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.

    రిప్లయితొలగించండి
  21. మీరిన వయసున తీరని
    కోరికలే రేగెనంచు కోమలి కొరకై
    చేరుచు వెదకుచు నొక చి
    న్నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ.

    రిప్లయితొలగించండి
  22. Sri P.S.R.Moorti Garu: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    కొన్ని సూచనలు:
    కుటుంబ పెద్దలు అనుట సాధువు కాదు. సమాసములో తొలి పదము (కుటుంబ) సంస్కృతము అయినప్పుడు 2వ పదము (పెద్దలు) తెలుగు పదము కారాదు.
    పెద్దలు + ఉన్నన్ = అనుచోట యడాగమము రాదు.
    ఖర్చు + యనెడు = అనుచోట యడాగమము రాదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు
    మీ అమూల్య సూచనకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  24. శ్రీరాముని పేరెరుగని
    భారత దేశముననున్న భాషల పలుక
    న్నేరని పశ్చిమ దేశపు
    నారిని బెండ్లాడువాడు నవ్వులపాలౌ!!!

    రిప్లయితొలగించండి
  25. ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    పిసినారిని పెండ్లాడే విషయంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నేమాని వారి సూచనలను గమనించారా?
    ‘హితులును పెద్దలు గలుగన్’ అనీ, ‘ఖర్చు లనెడి’ అని నా సవరణలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. కారులలో దిరుగాడుచు
    భారీ జీవితము గడప వలెనని కోరే
    మీరిన ఆశలు గలిగిన
    నారిని బెండ్లాడు వాడు నవ్వుల పాలౌ!

    రిప్లయితొలగించండి
  28. గురువరులకు నమస్కారములు
    మీ అమూల్య సూచనకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  29. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    భీరువు నగుచును,పనులను
    భారముచేయగ ననుచును,పదుగుర తోడన్
    దూరముగా మెలగెడి యా
    నారిని పెండ్లాడువాడు నవ్వుల పాలౌ

    చేరినడిమి వయసునకును
    కోరియుపిన్నగ వయసగు కోమలి నొకతెన్
    పూరితి నోలిని నిడియును
    నాలిని పెండ్లాడువాడు నవ్వులపాలౌ

    రిప్లయితొలగించండి
  30. ఆరయ పెండ్లికి వయసిటు
    మీరగ కుదరంగ జనని మిడిమేలముతో
    ఆరేడు వయసుల పసిచి
    న్నారిని పెండ్లాడువాడు నవ్వులపాలౌ

    రిప్లయితొలగించండి
  31. శ్రీ మల్లెల సోమనాథ శాస్త్రి గారు:
    మీ పద్యంలు బాగుగ నున్నవి. అభినందనలు.
    2వ పద్యము 4వ పాదములో ప్రాసను "ల" అనుట టైపు పొరపాటా?
    స్వస్తి.

    శ్రీ రామకృష్ణ మూర్తి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    3వ పాదములో 1 లఘువు ఎక్కువగా నున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  32. లేకన్ పదప్రయోగం సరికాదని తెలియజేసిన గుండు మధుసూదన్ గారికి కృతజ్ఞతలు."దారతచాలునె యపేక్ష దారకులోటై" అందాము. నమస్కృతులు

    రిప్లయితొలగించండి
  33. మూడవ పాదంలోని అధిక లఘువు కు సవరణ.
    "ఆరేడు వయసుల"కుబదులుగా" ఆరేళ్ళదైన " అని సవరిస్తున్నాను.దోషం సూచించిన పండిత నేమాని వారికి కృతజ్జతలు.

    రిప్లయితొలగించండి
  34. 'మల్లెల' వారి రెండవ పద్యంలో టైపాటు వల్లే 'రి'కి బదులుగా 'లి'పడింది.పొరపాటుకు క్షమించాలి.

    రిప్లయితొలగించండి
  35. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...

    తీరగు రూపము గని యది
    జారిణి యని తెలియ కతడు జామిగ దల్చ
    న్నా రమణుని సఖుఁ డనె నా
    నారిని బెండ్లాడువాడు నవ్వుల పాలౌ.

    రిప్లయితొలగించండి
  37. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. కారులు మేడలు బంగరు
    ధారలు షేరులు ధనమ్ము ధాన్యము కొఱకై
    కోరిక మీరగ ముదుసలి
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ

    రిప్లయితొలగించండి


  39. ఆస్ట్రేలియా వారు "ఏకలింగ పెళ్ళి" కి లా ఇవ్వాళే పాస్ చేసేరట :)

    పోరడ! పో! పో పోవే
    నారీ! యాస్ట్రేలియాన ననబోడుల్ నాం
    చారుల, పోరులు పోరల !
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. కలియుగ భారతము:

    వీరుడు తమ్ముడు చేపను
    కోరుచు కొట్టుచును గెల్చుకొని పెండ్లాడన్
    చేరుచు ప్రక్కన నాతని
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ

    రిప్లయితొలగించండి


  41. పోరలు మిత్రులు రాన్ తా
    తీరగ దాహమ్ము సుంత తీర్థంబైనన్
    సారించని పొలతిని పిసి
    నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ


    జిలేబి

    రిప్లయితొలగించండి