22, జూన్ 2014, ఆదివారం

సమస్యా పూరణం - 1452 (మారణహోమమ్ము కూర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. కారణము లేకనే యిట
    దారుణ జీహాదు పేర దాడులు జరిపెన్
    కారుణ్య రహిత, మెటులీ
    మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్?

    రిప్లయితొలగించండి
  2. ఆరని రావణ కాష్టము
    మారణ హోమమ్ము కూర్చు , మహిలో శాంతిన్
    కోరిన గాంధీ మతమును
    కారణ మేదైన గాని కలుగును శుభముల్

    రిప్లయితొలగించండి

  3. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    పూరణ :కారణ కారణుడౌ హరి
    వారువమును యెక్కి కత్తి వాదర కెరగా
    తీరుగ జేయగ దుర్మద
    మారణ హోమమ్ము. గూర్చు మహిలో శాంతిన్

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వారువమును + ఎక్కి’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘వారువమే యెక్కి...’ అందాం.

    రిప్లయితొలగించండి
  5. కారణ జన్ముడు వలదనె
    మారణహోమమ్ము;కూర్చు మహిలో శాంతిన్
    పోరు డహింసనె యనగా
    వీరులు సాధించిరపుడు విశ్వ ఖ్యాతిన్

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులు పండిత నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్కారములు.

    దారుణ పరరాజ్యార్జక
    మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!
    గోరి కళింగుల భువికై
    పోరి, యశోకుండు శాంతిఁ బొందెఁ గదయ్యా!

    రిప్లయితొలగించండి

  7. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మీసూచనకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  8. తీరగు ధర్మము నెరుగుచు
    మారినచో తీవ్రవాద మంతమ్మగుచో
    నోరామా !జరుగదెపుడు
    మారణహోమమ్ము, కూర్చు మహిలో శాంతిన్

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణలు...
    ​౧)
    ధారుణి​ పాపము పెరిగిన
    ​​మారణహోమమ్ము​ కూర్చు మహిలో శాంతిన్
    ​​శౌరి​ జనియించు భూమిని
    పేరుకు పోయిన పతితుల పే రడగించన్.
    ౨)
    ఏ రణ మందైన జరుగు
    ​మారణహోమమ్ము​ కూర్చు మహిలో శాంతిన్
    కారణములేని కలహము
    వారణ చేసెడు సమర్థపాలకు లున్నన్.

    రిప్లయితొలగించండి
  10. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    అశోకుని మార్చిన మారణహోమం ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పేరాశ యదియ జగతిని
    మారణ హోమమ్ము గూర్చు, మహిలో శాంతి
    న్నారాముని సే వనములు
    వీరా !చేయంగ గలుగు వినుమీ నిజమున్

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కూరుచు నశాంతి ద్వేషము
    మారణహోమమ్ము; కూర్చు మహిలో శాంతిన్
    కారుణ్య మహింస యొకట
    వేరే మార్గమ్ము లేదు విశ్వములొనన్

    రిప్లయితొలగించండి
  14. ప్రేరణ నాదే పార్థా!
    కారణమును నీవు కాదు కర్తవు కాదే
    వారణమునకు వెదుకకు సు-
    మా! రణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్

    రిప్లయితొలగించండి
  15. దారుణ మారణ కాండకు
    కారణ మరిషట్కములగు , గావున శూరుల్
    ధీరులు చేసెడి షడ్రిపు
    మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్

    రిప్లయితొలగించండి
  16. కారణము లేక మనుజుల
    ధారుణముగజంపునట్టి దనుజాధములన్
    క్రూరమ్ముగనణచ నిలుచు
    మారణ హోమమ్ము; గూర్చు మహిలో శాంతిన్!!!

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మారణ హోమమ్ము. గూర్చు మహిలో శాంతిన్
    వైరము ద్వేషము కసియును
    మారణ హోమమ్ము గూర్చు. మహిలో శాంతిన్
    గోరిన వారల కోరిమి
    కారుణ్యము భూతదయయు కలుగగ వలయున్

    రిప్లయితొలగించండి
  18. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మ .సో .శాస్త్రి గారి పూరణలు
    ఆరయ నశోక మౌర్యుడు
    మారణ హోమమ్ముసలిపె మారెను నాపై
    దోరపు శాంతికి దూతగ
    మారణ హోమమ్ము గూర్చు. మహిలో శాంతిన్
    భోరున నర్జును దేడ్చెను
    మారణ హోమమ్ముసలుప మాధవుడనియెన్
    తేరుప భూభారమ్మును
    మారణ హోమమ్ము గూర్చు. మహిలో శాంతిన్

    రిప్లయితొలగించండి
  19. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    గోలి వారు పేర్కొన్నట్టు మీ రూటే సపరేటు! వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. చేరునె సుఖ శాంతి ముదము
    మారణహోమమ్ము తోడ మహిలో మనకున్?
    కూరిమి తోడ తెలియుము కు
    మార! "ణ" హోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!!


    ణ = జ్ఞానము
    "ణ" హోమమ్ము = జ్ఞాన యజ్ఞము

    రిప్లయితొలగించండి
  21. తీరని వేదన గూర్చును
    మారణ హోమమ్ము, కూర్చు మహిలో శాంతిన్
    నోరిమి కలిగిన జనులకు
    కారణ మేదైన గాని కాంతుల నొసగున్

    రిప్లయితొలగించండి
  22. గురువుగారూ! ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! అంత సీనేం లేదండీ.

    రిప్లయితొలగించండి
  23. బారెడు జఠరాగ్ని యణగ
    తీరుగ బిర్యాని వండి తినరా! వడిగా;
    కారపు బజ్జీ కలిపిన
    మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!

    రిప్లయితొలగించండి


  24. ఏరాలమ్మగు నష్టము
    మారణహోమమ్ము కూర్చు మహిలో; శాంతిన్
    ధారాళమ్ముగ కోరన్
    వారావధియై సహనము వచ్చు నరులకున్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. వీరులు రాహుల యోధులు
    చేరుచు నిమ్రాను తోడ చెడుగుడు లాటన్
    పోరగ పాకిస్తానున
    మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్

    రిప్లయితొలగించండి