1, జులై 2014, మంగళవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 16

రామాయణము-
చ.      ప్రణుతులఁ జేయుచున్ (నృపతి పాండుసమాఖ్యజు లెచ్చు రామ)ల
క్ష్మణులు నొనర్చినన్ (మృదులమంజులగాత్రసమేతమాత)లం
గణుతి, మునీంద్రుతో (నెనసి కాండములం గొని యేగి రంతఁ) ద
త్క్షణమున, గంగనుం (గనిరి క్ష్మాపజు లేడ్తెఱగా ముదంబు)నన్. (౩౧)

భారతము-
తే.      నృపతి పాండుసమాఖ్యజు లెచ్చు రామ,
మృదులమంజులగాత్రసమేత, మాత
నెనసి, కాండములం గొని, యేగిరంతఁ
గనిరి క్ష్మాపజు లేడ్తెఱగా ముదంబు. (౩౧)

టీక- నృపతి పాండుసమాఖ్యజులు = (రా) రాజగు, తెల్లని కీర్తిగలవాని (దశరథుని) కుమారులు, (భా) పాండురాజపుత్రులు; కాండములు = బాణములు; ఏడ్తెఱ = ఎక్కువ; ఎచ్చు = హెచ్చు.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి