30, జూన్ 2014, సోమవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 15

రామాయణము-
సీ.      అభివృద్ధి నొందెఁ జేయఁగ దైత్యులు (కడుగ
ను నసూయ దుర్యోధనుఁడునుఁ బాండు)
యశుఁడగు రాముండు; కుశికతనూజుండు
పగను మారీచసుబాహుముఖ్య
ఘననిజయజ్ఞవిఘ్నకరదితి(సుతుల
పైఁ గని యేగి, భూపతిని, వారి)
గూల్ప రాఘవుఁ (బంపఁ గోరెఁ బవిత్రంబు
వారణావ)ళి సింహవర్గ మాడు
ఆ.      కొను స్వసవత(తతలమునకు, వీఁగియునుఁ దు
దఁ ననుపంగ) నీయకొనె నితం డ
తులితుఁ డుక్కుతునుక నిలువు నీరగు టేల
యనుపు మని వశిష్ఠుఁడు నుడువంగ. (౩౦)

భారతము-
తే.      కడుగను నసూయ దుర్యోధనుఁడునుఁ బాండు
సుతులపైఁ గని యేగి, భూపతిని వారిఁ
బంపఁ గోరెఁ బవిత్రంబు వారణావ
తతలమునకు, వీఁగియును దుద ననుపంగ. (౩౦)

టీక- (రా) దుర్యోధనుఁడు = యోధులకు భేదింపరానివాఁడు; పాండుయశుఁడు = తెల్లని కీర్తి గలవాఁడు; వారణావళి...తతలమునకు = జాతివైషమ్యములను గూడ మఱచి, విశ్వామిత్రుని ప్రభావముచేత నతని యాశ్రమమందు నేనుఁగులు సింహము లాడుకొనిచున్న వనుట; స్వసవతత తలము = తన యజ్ఞముచేయు విశాలమగు చోటు.
(భా) పాండుసుతులపైన్ = పాండవులపై; వారణావతతలమునకు = వారణావతమను స్థలమునకు; ఉక్కుతునుక = పరాక్రమము గలిగినవాఁ డనుట.

రావిపాటి లక్ష్మీనారాయణ

2 కామెంట్‌లు:


  1. కఠి న పదముల కర్ధమ్ము గనుగొ నంగ
    రెండు పద్యాల యడుగున నిండు గాను
    సులభ ముగనర్ధ మగునట్లు సొంపు మీర
    నీయ బడె నార్య !వివరణ యితని చేత

    రిప్లయితొలగించండి