3, జూన్ 2014, మంగళవారం

పద్య రచన – 579

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:


  1. మానిటర్ల మద్య చిక్కుకున్న
    మనుషులు చేతిలో మౌసు
    చెవిలో ఫోను ; ప్చ్ జీవితం
    'కాలాతీట' కాల్చే కాలం !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. గణన యంత్రము ముందర గంటలేమి
    రోజులెన్నైన గడుపుచు రూఢిగాను
    జ్ఞాన సముపార్జనముజేసి జగతినందు
    బ్రతుకుతెరువును బొందెడు ప్రజల జూడు

    రిప్లయితొలగించండి
  3. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. వేల కొలదిగ జనములు వేరువేరు
    గణన యంత్రము ముందర, గంట నుండి
    చేయుచుండిరి తమతమ చేయు పనులు
    శ్రద్ధ తోడన చూడుడు శర్మ గారు !

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘గణన యంత్రాల ముందర’ అంటే బాగుంటుంది కదా.

    రిప్లయితొలగించండి
  6. జయ తెలంగాణ!

    ఆనంద హేలయై యావిర్భవించిన
    ....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
    జనగణాకాంక్షల సాకార రూపమౌ
    ....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
    చెన్నొదవెడు పది జిల్లాల భాగ్యమౌ
    ....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
    ప్రగతి పథమ్ములో పరవళ్ళు త్రొక్కెడు
    ....జయ తెలంగాణ రాష్ట్రమ! జయమ్ము!
    జయము భూదేవి రత్న భూషణ వరమ్మ!
    జయము సంక్షేమ పర్వమా! జయము జయము
    జయము సౌజన్య నిలయమా! జయము జయము
    జయ తెలంగాణ రాష్ట్రమ! జయము జయము

    రిప్లయితొలగించండి
  7. కాలాతీతము కాదని
    వేలకొలది యంత్ర తతుల వేడుక యమరెన్
    మేలెంతో యొనగూడిన,
    మూలపు మానవ యుపాధి మూలన పడదే?

    రిప్లయితొలగించండి
  8. విశ్వ కూలి పనుల విఖ్యాతి గాంచిరి
    భరత దేశ యువత భవిత కొరకు
    దేశప్రగతి మరల దేదీప్య మానమై
    విశ్వ పటము నందు వెలుగు టెపుడొ?

    రిప్లయితొలగించండి
  9. గణనపు యంత్రమ్ములెయౌ
    గణనీయపు నార్జనలకు కలికాలమునన్
    అణువణువున నిండెను బో
    క్షణమైనను వీడకుండ సాధన చేయన్

    రిప్లయితొలగించండి
  10. శరత్ చంద్ర గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మానవ + ఉపాధి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘జనులకు నుపాధి’ అంటే సరి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘విశ్వ కూలిపనులు’ అనడం అభ్యంతరమే... ‘విశ్వమంత జేరి విఖ్యాతి గాంచిరి’ అందామా?
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. తలకొక కంప్యూట రిడగ
    తలపెట్టియు, నమలుపరచె దానిని చైనా!
    తలలన్నియు మానిటరుల
    తలదూర్చిన, యాంత్రికముగ తలపులు మారున్!

    రిప్లయితొలగించండి
  14. గణన యంత్రాలతో నన్ని గదులు నింపి
    వాటి ప్రోగ్రాములన్నింటి పాఠ ములుగ
    నేర్పుచున్నారు టీచర్లు నిత్య ముగను
    గణన యంత్రాల నిపుణులు కాఁకఁ దేఱు

    రిప్లయితొలగించండి
  15. తల ' పెట్టగ ' చదువుల నీ
    ' తలపెట్టెలు ' పెట్టినారు తలలకు ముందే
    తల ' పట్టున ' చదువులు మరి
    ' తలపట్టగ ' వలయునేమొ దారుణ మగునో !

    తలపెట్టె = కంప్యూటరుకు నా తలను పుట్టిన పేరు

    రిప్లయితొలగించండి
  16. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి