12, జూన్ 2014, గురువారం

పద్యరచన - 588

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(నేటినుండి పాఠశాలల పునఃప్రారంభము)

21 కామెంట్‌లు:

  1. చదువులు మొదలా యెనుకద
    పదరా పోయెదము బడికి పంతుల దరికిన్
    చదివిన చదవక యున్నను
    పదవులు దొరుకంగ మేలు పాలన జేయన్

    రిప్లయితొలగించండి
  2. గడచెను వేసవి సెలవులు
    నడచుచు నున్నారు బడికి నవ్వుచు పాఠుల్
    బడియే బ్రతుకుల నిధియని
    గుడియని, జ్ఞానంబు పొంద గురువుల కడకున్

    రిప్లయితొలగించండి
  3. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘పంతులు దరికిన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పాఠుల్’....? పాఠము చదివేవారు పాఠులు అనుకున్నారా? కాని ఏ నిఘంటువులోనూ ఆ పదం లేదు.

    రిప్లయితొలగించండి
  5. చేయి చేయిని బట్టుకు జెలిమి దోడ
    బడికి పోవుచు నుండిరి వడివడి గను
    అక్క మఱి యును దమ్ముడు జక్క గాను
    సంతసంబును గలిగించె నెంతొ నాకు

    రిప్లయితొలగించండి
  6. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ కండి శంకరయ్య గురువరులకు నమస్కారములు

    'పాఠి' = పఠించు వాడని శబ్ద రాత్నాకరములో నున్నది
    దాని బహువచన రూపము పాఠులు అవుతుందని వ్రాశాను
    'పాఠుల్' బదులు 'పఠితుల్' అంటాను

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మినారాయణ గారూ,
    మీ పాఠమే సరియైనది.. నేను పొరబడ్డాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  9. పల్లె బిడ్డలు చదువుకై పట్టుబట్టి
    పోవుచున్నారు స్కూలుకు ముదముతోడ
    నేటి బాలలే రేపటి మేటి యువత
    పేరు తెచ్చుట ఖాయము విశ్వమంత

    రిప్లయితొలగించండి
  10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పలకా బలపముఁ బట్టుకు
    చిలకా గోరింక లల్లె చెట్టా పట్టాల్
    బలమో బలహీపతయో
    తెలుసు కొనెడి శక్తి నొసగి,తీర్చును బడిలో

    రిప్లయితొలగించండి
  13. సీ. పాఠశాలలు పునః ప్రారంభమైనవి బడికి చనుడు నేడు బాలలార!
    పలకలూ బలపాలు పట్టుకు వడిగాను బడిని చేరగ రండి బాలలార!
    బారత దేశంపు బంగారు భవితకు పట్టుకొమ్మలు మీరు బాలలార!
    విద్య తోపాటుగా విజ్ఞానమును పొంది యేలుకోండిభువిని బాలలార!
    ఆ.వె. గ్రుడ్డి నమ్మకములు కుటిలపాలోచనల్
    దరికి చేరనీక తరిమికొట్టి
    కన్నవారి కలలు కల్లలు కానీక
    మంచి వృద్ధి మీరు కాంచ వలెను

    రిప్లయితొలగించండి
  14. చిరు హాసమ్మును బాగుగా ముఖముపై చిందించు చిన్నారులై
    కరముల్ మోయుచు నుండగా పలకలన్ స్కందాలపై సంచులన్
    చిరు ప్రాయమ్మున మోయుచున్ బడికి సంక్షేమమ్ముగా పోవుచున్
    పరువుల్ పెట్టిరి బాల బాలికలు సప్తాశ్వుండు దీపించగా!

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘గోరిక లల్లె’అని గ్రామ్యాన్ని వాడినారు. ‘గోరింకల వలె’ అనండి. బలహీనతలో టైపాటు.న కు బదులు ప టైపయ్యింది.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    చక్కని సీసపద్యంతో అలరించారు. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ వృత్తమూ, అందలి వృత్తాంతమూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. సూర్యనారాయణ గారూ,
    ‘కుటిలంపు + ఆలోచనల్’ అన్నప్పుడు టుగాగమం వచ్చి కుటిలంపు టాలోచనల్ అవుతుంది. అందువల్ల అక్కడ ‘కుటిలంపు యోచనల్’ అనండి.

    రిప్లయితొలగించండి
  17. సవరణకు ధన్యవాదములు మాష్టారు ....
    సీ. పాఠశాలలు పునః ప్రారంభమైనవి బడికి చనుడు నేడు బాలలార!
    పలకలూ బలపాలు పట్టుకు వడిగాను బడిని చేరగ రండి బాలలార!
    బారత దేశంపు బంగారు భవితకు పట్టుకొమ్మలు మీరు బాలలార!
    విద్య తోపాటుగా విజ్ఞానమును పొంది యేలుకోండిభువిని బాలలార!
    ఆ.వె. గ్రుడ్డి నమ్మకములు కుటిలంపు యోచనల్
    దరికి చేరనీక తరిమికొట్టి
    కన్నవారి కలలు కల్లలు కానీక
    మంచి వృద్ధి మీరు కాంచ వలెను

    రిప్లయితొలగించండి
  18. చిరునవ్వుల చిన్నారులు
    ధరియించుచు పుస్తకముల తమదగు శైలిన్
    అరుగుచు విద్యాలయముల
    చరియింతురు చదువులమ్మ చల్లనియొడిలో!

    రిప్లయితొలగించండి
  19. బడిబాటలోనపిల్లలు
    వడివడిగా నడుగులిడిన వైనము కనగా
    పిడికెడు విద్యాదాహము
    మడియుటకై యడుగు వేయు మాదిరి లేదా!

    రిప్లయితొలగించండి
  20. guruvugaariki dhanyavaadamulu savincina padyam:

    పలకా బలపముఁ బట్టుకు
    చిలకా గోరింకల వలె చెట్టా పట్టాల్
    బలమో బలహీనతయో
    తెలుసు కొనెడి శక్తి నొసగి,తీర్చును బడిలో

    రిప్లయితొలగించండి
  21. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి