14, జూన్ 2014, శనివారం

పద్యరచన - 590

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. కావచ్చు నదియొక్క కార్యాలయం బందు
    ....పని చేయుచుండెను పడతి యొకతె
    కానిచో నదియె యొకానొక బేంకగు
    ....వ్యవహారముల గాంచు నతివ యొకతె
    ఎందరు నెందరో యేదెంచుచుండగా
    ....నందరి కొరకు సహాయ పడుచు
    తీరికయే లేక దినదిన మ్మారీతి
    ....కష్టించు నా యధికారిణి గన
    సంఘ సేవయే యామెకు శాంతి గూర్చు
    చాల ఓర్పుతో దిరుగుచు జనులలోన
    పేరు గాంచిన దాతల్లి వినయమలర
    నామె కభినందనల గూర్తు నాత్మలోన

    రిప్లయితొలగించండి
  2. సిగ్గన్నది లేకుండగ
    గగ్గోలిడు కస్టమర్ల గాలికి యొదలెన్
    యెగ్గిటులాడుట గాదే?
    భగ్గను హృదయముననిట్టి పనులను గనినన్

    రిప్లయితొలగించండి
  3. చప్పున పైకము గైకొని
    నొప్పుగ తామరల గోరె నూరి జనంబుల్
    మెప్పుగ తనపని జేయక
    గొప్ప్గగ నాయంత్ర మందు కోరుచు క్రీడన్

    రిప్లయితొలగించండి

  4. 'నెట్టు' పోయిన నేమి ? టైము పాసు చేయుటకు 'పదినెట్టు' ఆట గలదు !
    సౌకర్యము ఇదియే గదా నేటి కాలమున
    కౌంటర్యామణి సీటు వదిలి పోక చూడటుకున్ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    ఆ బ్యాంకు ఉద్యోగి సేవను ప్రశంసిస్తూ మీరు వ్రాసిన పద్యం బాగుంది. అభినందనలు.
    కాని ఆ చిత్రంలోని ఒక విశేషం మీ దృష్టికి రానట్టుంది. కస్టమర్లు వచ్చి నిల్చున్నా వాళ్ళ పని వెంటనే చేసి పంపించక, వాళ్ళను నిర్లక్ష్యం చేస్తా ఆ ఉద్యోగిని కంప్యూటర్‍లో కార్డ్ గేమ్ ఆడుతున్నది. ఈ విషయాన్ని మీ తర్వాత పద్యాలను వ్రాసిన సూర్యనారాయణ గారు, అక్కయ్యా గమనించారు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    వదిలెన్ అన్నదాన్ని ఒదిలెన్ అన్నారు. యెగ్గిటు అన్న యడాగమం దోషమే. ‘గాలికి విడి తా/ నెగ్గిటు లాడుట...’ అందామా?
    *
    అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పైకము యెంతున్నదియో
    వాకబు చేయగ నిలిచిరి వరసల వారల్
    పేకాట లాడ తగునే
    నీకొసగెడు జీత మేల? నీరజ నయనా!

    రిప్లయితొలగించండి
  7. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పైకము + ఎంత’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పైకము తన దెంతున్నదొ’ అందామా?

    రిప్లయితొలగించండి
  8. కష్టమర్లట నిలబడి కాచు కొనుచు
    చూచు చుండగ నామెను ,చోద్యముగను
    నాడు చున్నది పేకాట యాయ మమఱి
    యేమి చేయదా ?యేమియు యిపుడు పనిని!

    రిప్లయితొలగించండి
  9. సవరణకు ధన్యవాదములు మాష్టారు ..... సవరించిన పద్యము
    సిగ్గన్నది లేకుండగ
    గగ్గోలిడు కస్టమర్ల గాలికి విడి తా
    నెగ్గిటు లాడుట గాదే?
    భగ్గను హృదయముననిట్టి పనులను గనినన్

    రిప్లయితొలగించండి
  10. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ఏమియు నిపుడు’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. ఏమని చెప్పుదు బ్యాంకున
    బామామణి కార్డ్సు గేము పని సమయములో
    నీమము వీడియు నాడెడి
    సామాన్యపు కష్టమర్ల సంగతి గనకన్

    రిప్లయితొలగించండి
  12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ లక్ష్మీనారాయణ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనల్లు. చివరిలో గనకన్ అనుట బాగులేదు. వ్యతిరేక అర్థక పదము తరువాత ద్రుతము రాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. పరుల కుపకరించు నెలవు పదిల పరచు
    మాట లాటల బాధ్యత మరువ వలదు
    భక్తి కంటెను శ్రేష్ఠంబు బాధ్యతగును
    ధర్మనిరతికి వశవర్తి దైవమెపుడు

    రిప్లయితొలగించండి
  16. ఆక్కౌంటున బ్యాలెన్సును
    ముక్కొక్కటి చెప్పమంటి మూణ్ణిమిషాలా?
    ముక్కలె చూచుచునుంటిని
    ముక్కేదియొ బోధపడక మూల్గుచునుంటిన్ !

    రిప్లయితొలగించండి
  17. ఒక్కటె ముక్కన జెప్పుము
    చెక్కిచ్చితి పైకమిందు జేరెన మేడం ?
    చిక్కులు ముక్కలతోనే
    ముక్కొక్కటి తేలకుంటి మూడాఫాయెన్ !

    రిప్లయితొలగించండి
  18. శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు
    అమూల్యమైన మీ సూచ నకు కతజ్ఞున్ని

    ఏమని చెప్పుదు బ్యాంకున
    బామామణి కార్డ్సు గేము పని సమయములో
    నీమము వీడియు నాడెడి
    సామాన్యపు కష్టమర్సు సంగతి వీడెన్ .


    రిప్లయితొలగించండి
  19. yesterday's

    భామామణి శాకుంతల
    కోమలి ప్రియ సఖులతోను గూడియు విరులా
    రామమున గోసుకొని తన
    ధామమునకు బోవుచుండ దలసూచి దిగెన్.

    రిప్లయితొలగించండి
  20. ప్రయాగ శ్రీరామచంద్ర మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    సందర్భం అలాంటిది కనుక అన్యదేశ్యాలు అంగీకరింపదగినవే.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మీ నిన్నటి శీర్షికకు వ్రాసిన పద్యం కూడా బాగున్నది. కాని ‘శకుంతల’ను ‘శాకుంతల’ చేయడమే అభ్యంతరం.

    రిప్లయితొలగించండి
  21. గురువు గారికి, మిగిలిన పెద్దలకు నమస్కారం.
    ఇప్పుడే ఒక సాహిత్యకార్యక్రమంలో పాల్గొని వస్తున్నా. నలవైఆరేళ్ళక్రిందట్నే అంటే అరవై ఎనిమిదిలో చంద్రాభొట్ల సత్యనారాయణమూర్తి గారు ఒక పద్యరచయిత గారు "పుష్పవిలాసం" అనే పేరుతో ముప్ఫైనాలుగు పద్యాల ఖండికనొకదాన్ని వ్రాసినారు.ఈరోజు వారు స్వయంగా సభలో చదివి వినిపించినారు.
    ఎంతోఅందమైన ఛందోబద్ధమైన పాపయ్యశాస్త్రిగారి పుష్పవిలాప పద్యాలకు దీటైన పద్యాలలో పువ్వులను కోయవద్దని తరుణులకు తను చెప్పబోగా ఒక చిన్ని పువ్వు కోయకుండా మా బ్రతుకులను నిరర్థకం చేయవద్దని నిష్ఠురమాడినట్టు (జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అభిమాని వీరు, మాటమాటకు వారి ని తలచుకుంటూనే పద్యపఠన గావించినారు గాని ఇది నా వాదన అంటూ ) వ్రాసినారు.
    "హరి చరణాలనో , తరుణుల శిరో భూషణాలుగా కాక తొడిమనుంచి సోలి, రాలి మాతృగర్భంలో మేము సమాధికావలెనా?
    మీ కవితాసౌరభాలు రసజ్ఞులను అలరించాలని మీరు కోరినట్టే మా పరిమళాలు జగత్తును అలరించాలని మేము కోరరాదా?
    నానాగుణవర్ణాదులలో కదంబమాలగా మేము అందగించినట్టు నానాగుణవర్ణాదులున్న మానవజాతి ఐకమత్యమనే సూత్రంలో అందం చేకూర్చాలని మా మౌనసందేశం కోసి మాలగా కడితేనే కదా!
    గుచ్చినా, సూదులు గుచ్చినా మా ముక్తి కొరకే అయితే తప్పేముంది.మీ వైద్యులు శస్త్రచికిత్సలో మిమ్మల్ని బాధపెట్టే కదా మీకు మంచి చేస్తారు! ఇదీ అలానే కదా!"
    ఎంతో నచ్చింది నాకు. వారు తోచింది వ్రాసుకుంటున్నారంట కానీ ప్రచురణ జోలికి పోవడం లేదంట. కాశీలో దైవసాన్నిధ్యంలో కాలం గడుపుతున్నారు.

    రిప్లయితొలగించండి
  22. నిన్నటి చిత్రానికి పద్య రచన

    ఆశ్రయ మిచ్చినట్టి తన యప్పను వీడచు బాధ నొంది ఆ
    యాశ్రమ మెట్లు వీడుటని ఆంగిక మందున ముల్లుదీయుచున్
    విశ్రమ మొంది చూచె నటు వేదనతో కడసారి చూపుగా
    నాశ్రయ మొంద భర్తకడ కర్గ శకుంతల వెళ్ళిపోవుచున్!

    రిప్లయితొలగించండి
  23. భామ శకుంతల సద్గుణ
    కోమలి తా చెలులతోడ గూడియు విరులా
    రామమున గోసుకొని తన
    ధామమునకు బోవుచుండ దలసూచి దిగెన్.

    రిప్లయితొలగించండి
  24. లక్ష్మీదేవి గారూ,
    చంద్రాభొట్ల సత్యనారాయణమూర్తి గారి గురించి మీరు తెలిపిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యం....

    కష్టమర్లపాట్లు కనకుండ వినకుండ
    పేక లాడుచుండె వీడి పనిని
    ప్రజలరాజ్యమందు పనిదొంగ లందఱు
    చీడపురుగు లటుల జేరినారు.

    రిప్లయితొలగించండి
  26. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి