17, జూన్ 2014, మంగళవారం

పద్యరచన - 593

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. వనదేవత యొక్కతె తన
    మన మూయల లూగుచుండ మధురోహలతో
    వనసీనలలో నూయల
    గని యూగుచునుండె నహహ కనుపండువుగా

    రిప్లయితొలగించండి
  2. మధువనిలో రాధిక వలె
    మధు రోహల నూయలందు మమతలు విరియన్
    న్నెదలోపల వెన్నుని గని
    ముదమందుచు పరవశించి ముచ్చట బడగన్

    రిప్లయితొలగించండి
  3. పండిత నేమాని వారూ,
    వనదేవత ఊహల డోలారోహణను గురించిన మీ పద్యం సుందరంగా ఉంది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పద్యం ముద మందించింది. అభినందనలు.
    ‘విరియ/ న్నెద..’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. వృక్షపు కొమ్మలన్ గలిపి పేనిన తాడును గట్టి నూయలన్
    లక్షణమైన రీతి తను లాస్యము జేయుచు నూగుచుండగన్
    ప్రేక్షక పాత్రలో ప్రకృతి వేడుక జూచుచు సంతసంచెగా!
    చక్షువు లెన్నియున్ గొదువె శ్రావణ సోయగమంకురించగన్!

    రిప్లయితొలగించండి
  5. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    ఒంటిగ నీవనాంతరము నూయలలూగగ వచ్చినట్టి యో
    కొంటె వయారి! నీ సొబగు గూర్చిన యా నలువన్ నుతింతునా!
    మింటను య౦టునీ చలన మేగి దివిన్ తల దన్నునా? యటన్
    బంటును సేసి యచ్చరల వాసిని వంచున?యెంచి చూడగన్


    రిప్లయితొలగించండి
  6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యం....

    ఊగుచున్నది వనకన్య యూయలందు
    మదను బాణతతిని బడి ముదముతోడ
    తియ్యనౌ యూహలందున తేలిపోయి
    ప్రియును రాకకై తానిప్డు వేచియుండె.

    రిప్లయితొలగించండి
  7. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘త్రాడును గట్టి యూయలన్’, ‘శ్రావణశోభన లంకురించగన్’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మింటను + అంటు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మింటిని తాకు’ అందామా? అచ్చరలు అని బహువచనాన్ని వాడారు కనుక ‘బంటుల జేసి’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మదన బాణ హతిని’ అంటే ఇంకా బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  8. ఎవ్వతె కోమలాంగి వని కెందులకొంటిగ వచ్చినావు? ఏ
    దవ్వులనుండి వచ్చితివొ తామరసాక్ష తదీయనవ్యమౌ
    యవ్వన ప్రాయమందునను, హాయిగ నూయల నూగుచుంటివే!
    జవ్వని,మానవాకృతిని జంతువు లుందురు బద్రమే చెలీ!


    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    మీ సూచనలకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  10. సోయగ మందు చక్కనగు చుక్క సువర్ణపు మేనిఛాయతో
    ప్రాయము నందు నున్న నొక భామిని తెల్లని చీర కట్టుతో
    హాయిని గొల్పుమారుతము నందున తన్మయమొంది చెట్టుపై
    నూయల నూగు చున్నది వియోగిని చందము కానలోపలన్!

    రిప్లయితొలగించండి
  11. ఉద్యాన వనమందు ఉయ్యాల లూగేటి సుదతి యెవ్వతెయీమె సుందరాంగి
    అందాలు చిందేటి కుందన వదనమ్ము సోగకన్నులతోడ సుందరాంగి
    చల్లగాలికి కురులు మెల్లగా కదులుతూ చూడ ముచ్చట గొల్పు సుందరాంగి
    ఊయల నూగుచు నూహించు కొనుచుండె డెందమందు ప్రియుని సుందరాంగి
    ప్రకృతి పరవశించె తన రూపమును చూసి
    దేవకన్యల తలదన్నుఠీవి మెరసె
    చిత్రపటమును గీసేన చేయి యెదియొ
    యిన్ని వన్నెల నీబొమ్మ నెవరి కలయొ!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి శుభాశీస్సులు.
    ఒక మంచి సీస పద్యమును వ్రాసేరు. అభినందనలు.
    కొన్ని సూచనలు:
    ఊగేటి, చిందేటి, కదులుతూ అని వ్యావహారికములను వాడేరు.
    ఊగెడు, చిందెడు, కదలుచు అనుట మంచిది.
    3వ పాదములో చల్ల గాలికి కురుల్ అనండి - లేకున్నచో గణభంగము. సుందరాంగి అను పదమును 4 సారెలు వాడేరు - పునరుక్తి దోషము. వేరు వేరు పదములను వాడినచో బాగుండును.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు. మీ సూచనలకు ధన్యవాదములు. మార్పులు చేశాను. యెంత వరకు సరిగా యున్నదో మరి ....
    ఉద్యాన వనమందు ఉయ్యాల లూగెడు సుదతి యెవ్వతెయీమె సుందరాంగి
    అందాలు చిందెడు కుందన వదనమ్ము సోగకన్నులతోడ సోయజాక్షి
    చల్లగాలికి కురుల్ మెల్లగా కదులుచు చూడ ముచ్చట గొల్పు చూపరులకు
    ఊయల నూగుచు నూహించు కొనుచుండె హృదయమందు ప్రియుని మధుర రూపు
    ప్రకృతి పరవశించె తన రూపమును చూసి
    దేవకన్యల తలదన్నుఠీవి మెరసె
    చిత్రపటమును గీసేన చేయి యెదియొ
    యిన్ని వన్నెల నీబొమ్మ నెవరి కలయొ!

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. చక్కని భావాలను వెల్లడించారు సీసపద్యంలో. అభినందనలు.
    నేమాని వారి సూచనలను అనుసరించి మీరు సవరించిన పద్యంలోనూ కొన్ని దోషాలున్నాయి. నా సవరణలతో మీ పద్యం....

    ఉద్యాన వనములో నుయ్యాల లూగెడు సుదతి యెవ్వతె యీమె సుందరాంగి
    అందాలు చిందెడు కుందనపు ముఖమ్ము సోగకన్నులతోడ సుజలనేత్రి (కుందన వదనము అని సమాసం చేయరాదు, సుజల = పద్మ)
    చల్లగాలికి కురుల్ మెల్లగా కదులుచు చూడ ముచ్చట గొల్పు చూపరులకు
    ఊయల నూగుచు నూహించు కొనుచుండె హృదయమ్ములో ప్రియహితుని రూపు (ఉత్తరార్థంలో ప్రాసయతి తప్పింది)
    మిగిలిన పద్యం బాగుంది.

    రిప్లయితొలగించండి
  15. ధన్యవాదములు మాష్టారు ... తప్పులు మళ్ళీ దొర్లకుండా ప్రయత్నిస్తాను

    రిప్లయితొలగించండి
  16. చిత్తరువులనెన్నింటినొ
    కొత్తగ వ్రాయంగ నేర్చి కొందరు మన యీ
    చిత్తములను పలు మారులు
    చిత్తుగనోడించుచుంద్రు చిత్రము సుమ్మీ!

    రిప్లయితొలగించండి