18, జూన్ 2014, బుధవారం

పద్యరచన - 594

కవిమిత్రులారా,
మాస్కోలో హిందూ దేవాలయము
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:


  1. కట్టినది 'శివ్వెరుపు'రంగు అంగిరైక
    అయ్యరే అమ్మణ్ణి మాస్కో అంగరేక !
    పెట్టినది మరి భక్తునికి శటగోప ఊనిక
    ఇదీ విశ్వ హైందత్వ అంఘ్రినామక !!



    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. హిందూ దేవాలయములు
    బంధుర ముగ కలుపు నంట పలు దేశములన్
    న్నెందరు కొలిచిన నొక్కడె
    నందరికీ దీవెన లిడు నర్చక వనితల్

    రిప్లయితొలగించండి
  3. జిలేబీ గారూ,
    _/\_
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దేశముల/ న్నెందరొ కొలిచిన నొక్కడె/ యందరికిని...’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. గుడి పూజారిణి జూడుము
    వడివడిగా నిచ్చు చుండె భక్తున కచట న్
    కుడి చేతిని బైకెత్తియు
    జడగా గల శిరసు పైన శఠ గోపమునున్

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పర దేశమందు మాస్కో
    పురమున దేవాలయమున పూజార్చనతో
    శిరమున శఠగోపురమును
    తరుణీమణి పెట్టి 'స్వస్తి' తడయక జెప్పున్

    రిప్లయితొలగించండి
  7. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. భోజన వడ్డెన లేనా?
    రాజై రాజ్యంబు నేలు రమణీ మణియే!
    బాజా భజంత్రు లందున
    పూజారిగ నాలయమున ముదితల గనమే!

    రిప్లయితొలగించండి
  9. పశ్చిమ దేశపు మగుపలు
    నిశ్చయముగనన్ని పనుల నేర్తురు గనగా
    నాశ్చర్యంబేల?గుడుల
    శశ్చోటులకంటె మేలు సచ్ఛీల మణుల్!



    రిప్లయితొలగించండి
  10. పశ్చిమ దేశపు మగుపలు
    నిశ్చయముగనన్ని పనుల నేర్తురు గనగా
    నాశ్చర్యంబేల ? గుడుల
    శశ్చోటులకంటె మేలు సద్గుణ మణల్!

    రిప్లయితొలగించండి
  11. చూస్కో శఠారి నినటన
    మస్కారము జేయు వాన్కి మగువే బెట్టెన్
    మస్కాగాదిది నిజమే
    మాస్కోలో గుడిని జూడ మంటిని గనుమా !

    రిప్లయితొలగించండి
  12. సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘భోజనవడ్డెనలు’ దుష్టసమాసమే..
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యం....

    వివిధదేశాల వనితలు ప్రీతితోడ
    విష్ణుపూజలు సలుపుచు తృష్ణతోడ
    మదిని తృప్తిపఱచి తాము మనుచునుండ
    దైవపూజ లన్ని మఱచి తిరుగుచుండ్రి
    మన ప్రజలు సుఖశాంతులు మరచిపోయి.

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి