25, జూన్ 2014, బుధవారం

పద్యరచన - 601

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:


  1. నేల పై బింబం కృతి కర్త అందం
    నీటిలో ప్రతిబింబం ప్రకృతి చందం
    బింబప్రతిబింబాల మధ్య దూరం
    తెర మరుగైన చైతన్యస్రవంతి !!


    శుభోదయం
    జిలేబి
    (విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం ... !)

    రిప్లయితొలగించండి
  2. బకము వెదకు చుండె బంగారు చేపకై
    నీడ గాంచి దరిని నిక్కి నిక్కి
    మిక్కుటంపు దెలివి మీనము నాదంచు
    నీటి యడుగు నుండె రాటు దేలి

    రిప్లయితొలగించండి
  3. మాటు వేసెను నాకొంగ నీటి యందు
    పిల్ల చేపను లేదేని పెద్ద చేప
    పట్టు కొఱకునై నోటను బిట్టు గాను
    నార్య !జూ డ నా చిత్రము నటుల దోచె

    రిప్లయితొలగించండి
  4. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

    కొంగ​ చేయుచునుండెను దొంగజపము
    చేప దొరుకునటంచును చెరువు చెంత
    దక్కునంతవరకును తా నక్కడుండు​
    పిదప పోవును గూటికి ప్రీతితోడ.

    రిప్లయితొలగించండి
  5. బక పికము లే వి ధరణిన
    నికరమ్ముగ జడియవు తమ నీడను జూడన్!
    సకలమ్మెరిగెడు మనుజులు
    నొకచో తమనీడఁ దామె యోర్చగ జడుపే!

    రిప్లయితొలగించండి
  6. అందమైనకొంగ హంసవోలె మెఱిసి,
    నీటిముకురమందు నీడ జూసి,
    మురిసెననుచు నెంచ మురిపెమ్మునాకది
    తోటయింట దృశ్యతోరణమ్ము.

    రిప్లయితొలగించండి
  7. కొంగ కొలనులోనిలబడి దొంగ జపము
    జేయు చుండెను జేపలు చేరి నపుడు
    టక్కుమని ముక్కు తో బట్టి డొక్కలేయ
    కాంచె తన నీడనే చేప గాంచ లేదు

    రిప్లయితొలగించండి
  8. ఏటియందునున్న నీటిలో తిరుగాడు
    చిన్నచిన్న పిల్లచేపలఁ దినఁ,
    బొడుగుముక్కుతోడఁ బొడుచుచూ నీటిలో,
    తెల్లకొంగ యొకటి తిరుగుచుండె

    రిప్లయితొలగించండి
  9. కొలను దాపున తిరుగుచు కొక్కెరొకటి
    చిన్న చేపలు బట్టగ చింత తోడ
    తొంగి చూడగ నీటిలో కొంగ కనగ
    మరొక బకమది యనుకుని మధన పడెను

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజంతా కొన్ని కార్యక్రమాలలో వ్యస్తుణ్ణై అలసి ఉన్న కారణంగా పద్యాలను విడివిడిగా సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
    చిత్రానికి తగిన పద్యాలను రచించిన.....
    రాజేశ్వరి అక్కయ్యకు,
    సుబ్బారావు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    సహదేవుడు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    శైలజ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి