27, జూన్ 2014, శుక్రవారం

పద్యరచన - 603 (కప్పల పెండ్లి)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. కప్పల పెండ్లి యటంచును
    కుప్పలు తప్పలుగ జేరె కోలనుల నిండా
    నిప్పటి మనుజుల కంటెను
    నొప్పుగ మనముంటి మిలను నోచిన ఫలమౌ

    రిప్లయితొలగించండి

  2. కప్పల పెండ్లి జేసి మురియు జనులారా
    అప్పలు నాటి నాటికి దేశమున కుప్పలుగ
    రేపుల ఒడిలో కాలము చెందుట జూసియు
    జూడకున్నట్టు ఏమి జేయకుండుట సబబా ??

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కప్పల పెండ్లిని జేయగ
    గొప్పగ వానలు కురియును కువలయమందున్
    తప్పక చేయుదు రెప్పడు
    నొప్పుగ భేకముల పెండ్లి నోహో! నాహా!

    రిప్లయితొలగించండి
  4. అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం.....

    కప్పలకును పెండ్లి ఘనముగా జేయుచు
    మురియుచుంద్రు జనులు పుడమిమీద
    స్త్రీజనమ్ముపట్ల చేసెడి దౌర్జన్య
    ములను కనుల జూడబోరు, సబబె?
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. కప్పల పెండ్లిని జేయగ
    గప్పుచు నాకాశమంత కరిమేఘములే
    తెప్పలుగ చెరువు నిండగ
    నిప్పుడె వానల్లు గురియు నిజమది వింటే.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యము...

    తిప్పలఁ బెట్టఁగ వరుణుఁడు
    కప్పలపెండిలి సలిపిరి కమనీయముగన్
    గుప్పున వర్షము కురిసెను
    తెప్పలుగ చెఱువులు నిండె తీరగు రీతిన్.

    రిప్లయితొలగించండి
  8. వానలు కురియగ వేడిరి
    నానావిధముల జపముల నయముగ వరుణున్.
    మేనాలనుఁ దెచ్చి జనులు
    నీనాటికి కప్పపెండ్లి యెట్లు సలిపిరో?

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. వాన రాకడ కొఱకునై వరుణ దేవు
    నకిల యాగము గావిం త్రు నఖిల జనము
    మఱియు పెండ్లిండ్లు సేతురు మంచి గాను
    కప్ప జంటల కిచ్చట కమల !వినుము

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. కప్పల పెళ్లిళ్లు మనకు
    తిప్పలఁ దప్పించి వాన దెప్పించుననే
    గొప్పవౌ భావనలే
    తప్పక వాన గురిపించుఁ దగు హోమములై!

    రిప్లయితొలగించండి
  13. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. డప్పులు మ్రోగించుకొనుచు
    కప్పల పరిణయము నెంతొ ఘనముగ జరిపెన్
    తిప్పలు తప్పుట కొరకై
    గొప్పగ వర్షంబు కురియు గోరికమీరన్

    రిప్లయితొలగించండి
  15. మెండుగ వానలు కోరుతు
    మండూకంబులకు పెళ్లి మనుషులు చేసెన్
    యుండవలె హేతువనుచును
    ఖండించుచు హేతువాది కారణ మడిగెన్

    రిప్లయితొలగించండి
  16. కప్పల కుపెండ్లి చేసిన
    కప్పలె కరిపిం చువాన కారుణ్యమునన్
    ఎప్పటి నమ్మక మోయిది ఇప్పటికీయాచరింత్రుయెల్లెడజనముల్.

    రిప్లయితొలగించండి