24, జూన్ 2014, మంగళవారం

భారత గర్భ రామాయణము - 9

రామాయణము-
చం.    వరసుతజన్మమున్ (రమనుఁ బ్రౌఢుఁడునౌ ధృతరాష్ట్రుఁ డంత) జా
ల రమణతో వినెం, (బలువ లక్షణముల్ గలవారి నూఱు) నా
యురువిమలాత్ముఁడున్ (గురుసుయోధనముఖ్యులఁ గూర్మితోడఁ) గ
ల్గు రసికుఁ డర్మిలిం (గనెను, గోర్కుల బీదలఁ గాంక్షఁ దన్పెఁ)దాన్. (౨౪)

భారతము-
తే.      రమనుఁ బ్రౌఢుఁడునౌ ధృతరాష్ట్రుఁ డంత
బలువ లక్షణముల్ గలవారి నూఱు
గురు సుయోధనముఖ్యులఁ గూర్మితోడఁ
గనెను, గోర్కుల బీదలఁ గాంక్షఁ దన్పె. (౨౪)


టీక- ధృతరాష్ట్రుఁడు = (రా) రాష్ట్రమును ధరించినవాఁడు- దశరథుఁడు; పలువ లక్షణముల్... విమలాత్ముఁడు = (రా) దుస్స్వభావులనుఁ జంపు శుద్ధుఁడు; గురుసుయోధనముఖుల = గొప్ప వీరశ్రేష్ఠుల; అర్మిలిం గనెను = (రా) సంతస మందెను.

2 కామెంట్‌లు:

  1. పద్య మొకటిగా గనబడు దధ్య మదియ
    చదివి జూడగ రెండుగో చరమగు మఱి
    తేట గీతియు గాదేని యాటవెలది
    రెంటి లోనన నొకటిగా గంట బడును

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి