3, నవంబర్ 2014, సోమవారం

న్యస్తాక్షరి - 13

అంశం- కురుసభలో కృష్ణుఁడు విశ్వరూపాన్ని ప్రదర్శించుట.
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘వి - శ్వ - రూ - ప’ ఉండాలి.

35 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్సులు.
    నా జ్వరతీవ్రత ఇంకా తగ్గలేదు. మందులు తీదుకుంటున్నాను. ఈరోజు మిత్రుల పూరణల, పద్యాల సమీక్ష చేయగలననే అనుకుంటున్నాను.
    నా స్వాస్థ్యాన్ని గురించి ప్రస్తావించిన అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. వినుడు సంధి యపుడు వినుమంచు హితవు న
    శ్వరుడు కౌరవులకు శాంతి గోరి
    రూపరహితు డచట రూపమ్ము జూపించె
    పగను వారు కోరె భండనమ్ము

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. వినతి విజ్ఞతలను పెడచెవిఁ బెట్టుచూ
    శ్వశుర పుత్రులు హరిఁ బట్టఁ బోవ
    రూప మంతఁ బెంచె లోకాలఁ జూపుచు!
    పర్వుని గన లేక వాలి రచట!
    (శ్వశురుడు=మామ)

    రిప్లయితొలగించండి
  5. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చెవిఁ బెట్టుచూ’ అన్నదాన్ని ‘చెవిఁ బెట్టుచున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. వివిధ దేవతలను వేవేల సూర్యులన్
    శ్వ సు రాది బంధు శతము జూచి
    రూప మధ్భుతంబు రూడిగా (దలపోసి
    పలవరించినాడు పాండు సుతుడు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  7. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పద్యం:
    వినతి విజ్ఞతలను పెడచెవిఁ బెట్టుచున్
    శ్వశుర పుత్రులు హరిఁ బట్టఁ బోవ
    రూప మంతఁ బెంచె లోకాలఁ జూపుచు!
    పర్వుని గన లేక వాలి రచట!
    (శ్వశురుడు=మామ)

    రిప్లయితొలగించండి
  8. వినుము సంధి కనిన వినకపేట్రేగి శ్రీ
    శ్వరునికురు రాజు బట్ట బోవ
    రూపు దాల్చె విశ్వ రూపమ్ము సభలోన
    పలుకు రాక కూలె పాపులంత



    రిప్లయితొలగించండి
  9. విక్రమించి తనదు విశ్వరూపమును వి
    శ్వ సృజు తండ్రి జూపసభనడుమను
    రూపముగని పడె కురువిభుని మూకలు
    పరవశించె కాంచి భద్ర సుతుడు

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందఱకు నమస్కారములు!

    వినయ మెసఁగఁ జేరి వృష్ణియు సరగున
    శ్వశురు సభను గురులు బాంధవులకు
    రూఢిఁ దనదు విశ్వరూపమ్మునుం జూపి
    రమపదముఁ జేరు పథముఁ దెలిపె!

    రిప్లయితొలగించండి
  11. శైలజగారూ మీ పద్యం యొక్క రెండవపాదం సవరించాలి, గణ భంగం జరిగింది.

    రిప్లయితొలగించండి
  12. విఫల మవ్వ సంధి విశ్వరూపమ్మును
    శ్వశుర సభకు జూపె శైల ధరుడు
    రూపు గాంచ లేక రోసులు వ్రాలెను
    పరవశించి జూచె భక్తులంత

    రిప్లయితొలగించండి
  13. శ్రీ కామేశ్వర శర్మగారికి ధన్యవాదములు..సవరణతో...

    వినుము సంధి కనిన వినకపేట్రేగి శ్రీ
    శ్వరునిరాజరాజు బట్ట బోవ
    రూపు దాల్చె విశ్వ రూపమ్ము సభలోన
    పలుకు రాక కూలె పాపులంత

    రిప్లయితొలగించండి
  14. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    కురుసభలో విశ్వరూపానికి బదులు మీరు కురుక్షేత్రంలో విశ్వరూపాన్ని ప్రస్తావించినట్టున్నారు.
    ‘శ్వసురాది’ అన్నచోట గణభంగం.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కురురాజు’ అన్నచోట గణభంగం. అక్కడ ‘కౌరవపతి’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. 2.
    విష్ణు మూర్తి తనదు విశ్వ రూపమునప్డు
    శ్యశుర సభను జూప, సర్ప శయను
    రూప కాంతి గాంచి, భూపతి తనయులు
    పడిరి ధాత్రిపైన భయముతోడ

    రిప్లయితొలగించండి
  16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. "శ్వశుర" టైపు తప్పును సవరించి మరల పంపుచున్నాను
    విష్ణు మూర్తి తనదు విశ్వ రూపమునప్డు
    శ్వశుర సభను జూప, సర్ప శయను
    రూప కాంతి గాంచి, భూపతి తనయులు
    పడిరి ధాత్రిపైన భయముతోడ

    రిప్లయితొలగించండి
  18. వినుడు సభికు లార!వినిపింతు నొకటి న
    శ్వర మ గునది యనుచు శాంతి కామి ,
    రూప రహితు డపుడు రూపము దనది చూ
    పంగ దనివి దీర వారు కనిరి

    రిప్లయితొలగించండి
  19. వినని కౌరవులను వేడె సంధిగొన, న
    శ్వరమటంచు దెలిపె దొరతనమ్ము.
    రూఢిపరచ విశ్వ రూపమ్ము జూపించె
    పడిరి యుద్ధమందు వైరమొంది!

    రిప్లయితొలగించండి
  20. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ***
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. విష్ణుమూర్తి యపుడు విశ్వరూపము జూప
    శ్వరపు మనుజులపుడు శ్వాస యాపి
    రూక్షనేత్రు నపుడు దీక్షగా నుతియింప
    పలుకుమాని సభయె వణక సాగె

    రిప్లయితొలగించండి
  22. మల్లెల వారిపూరణలు
    వినుతి జేయ పాండవేయుల కోర్కెశా
    శ్వతుడు కృష్ణు డేగి సభకు తెలిపె
    రూఢి పాండు సుతుల రోచిస్సు యుధ్ధాన
    పరగె విశ్వరూపు వారు తెలియ
    2. విశ్వలోకహితుడు పెద్దౌచుదూత శా
    శ్వతుదు కృష్ణ మూర్తి సభకుతెలిపె
    రూఢిపాండవాళి రౌద్ర౦బు శక్తిని
    పర్వెవిశ్వరూపు భావ మచట

    రిప్లయితొలగించండి
  23. కె.ఈశ్వరప్ప గారి పూరణ
    వినుడు పాండు సుతుల విన్నపమున కృష్ణ
    శ్వశుర సంతు తనను పట్టబూన
    రూపు జూపె విశ్వరూపమ్ము గమనించి
    పలుకరైరి కౌరవాదులెల్ల

    రిప్లయితొలగించండి
  24. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
    విగ్రహమ్ము వలదు వినుడనెను కృష్ణుడు
    శ్వస్తమందు జనుల శా౦తి గోరి
    రూక్ష కౌరవుండు శిక్షి౦ప బూనిన
    పనుకు విశ్వ రూపమును వెలార్చె

    రిప్లయితొలగించండి
  25. వినక సంధిమాట వెర్రిగాజేయ వి
    శ్వప్రయత్నములను శౌరి బట్ట
    రూఢ మైన తనదు రూపము విశ్వరూ
    పముగ మార్చె కౌరవ సభయందు

    రిప్లయితొలగించండి
  26. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ***
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ***
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వినుడనెను’ అన్నచోట గణదోషం. ‘వినుడనె’ అంటే సరి.
    మీ పద్యాలలో టైపు దోషాలు తరచుగా ఉంటున్నాయి. పోస్ట్ చేసే ముందు ఒకసారి సరిచూసుకోండి.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. చూపుల కాంతులు నింపగ
    రేపను కొంగ్రొత్త యాశ రేపగ వడిగా
    నా పరమేశుడు నిత్యము
    దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్.

    రిప్లయితొలగించండి
  28. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. గురువుగారు,

    ఈ పూరణ వేరొక చోటది.

    విశ్వరూపం న్యస్తాక్షరికి నేను నిన్న రాసిన పూరణ కనిపించడం లేదు.
    మీ మెయిల్ కు వచ్చిందంటారా?

    రిప్లయితొలగించండి
  30. విష్ణువు తనయందు వేడుకతోడ వి
    శ్వమునుఁ జూపి తాను సభను, తగు ని
    రూపణమ్ముఁ జేసె. లోకముల కనుల
    పండుగవగ, పుణ్యఫలమనంగ.

    రిప్లయితొలగించండి
  31. లక్ష్మీదేవి గారూ,
    మీ న్యస్తాక్షరి పూరణ బాగుంది. అభినందనలు.
    మీరు నిన్న పంపానన్న పూరణ నా మెయిల్‍కు కూడా రాలేదు.

    రిప్లయితొలగించండి