హిందు, ముస్లిము, క్రైస్తవు - లందరిచట నన్ని మతముల వారితో - నఱమరికలు లేక యన్నదమ్ముల వలె - నేక మైన సకల జనుల సంక్షేమమె - సాధ్యమగును దేశ దేశాలలో మేటి - దేశ మన్న భరత దేశమె యని గొప్ప - ప్రథను గాంచు ! ___________________________ ప్రథ = కీర్తి
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘జతగా నాబండి...’ అనండి. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యానికి నా సవరణలు...... అల్లదె చిత్రము చూడుము మెల్లగ నాబ్రాహ్మణుండు, మ్లేచ్ఛ గురువుతో దెల్లటి వాహన మెక్కియు నుల్లము లలరంగ బోవ నుత్సాహించెన్. **** వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘చిత్రం’ అని వ్యావహారికపదంతో పద్యాన్ని ముగించారు. ఆ పాదాన్ని ‘నిజమత| మని కనులకు చూపు చిత్ర మందు ముదమునన్’ అనండి. **** బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘కలిపే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘మనసు లొకటిగా’ అనండి. ‘మానవత + ఎ’ అన్నప్పుడు సంధి లేదు. ‘మానవతయె’ అనండి. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మతములు వేరే యైనను
రిప్లయితొలగించుజతగాయా బండిపైన సహగాములుగన్
మతతత్వ శక్తులకిడెను
సుతిమెత్తని వాతలెల్ల చూడుడు వారిన్
బ్రాహ్మ ణుం డును మఱి యును బ్రాహ్మ ణే త
రిప్లయితొలగించురుండు నొకబైకు పైన ని రువురు బోవు
చుండ ముచ్చట గొలిపెను చూడగానె
భిన్న మతముల బొత్తుల నెన్న దరమె ?
అల్లదె చిత్రము చూడుము
మెల్లగ నాబ్రా హ్మ ణుండు, మేరీ గురువున్
దెల్లటి యా బైకు పైనన
నుల్లము లలరంగ బోవ నుత్సా హించెన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించుఅందరి పూరణలూ అలరింప నున్నవి !
జైహింద్ :
01)
___________________________
హిందు, ముస్లిము, క్రైస్తవు - లందరిచట
నన్ని మతముల వారితో - నఱమరికలు
లేక యన్నదమ్ముల వలె - నేక మైన
సకల జనుల సంక్షేమమె - సాధ్యమగును
దేశ దేశాలలో మేటి - దేశ మన్న
భరత దేశమె యని గొప్ప - ప్రథను గాంచు !
___________________________
ప్రథ = కీర్తి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఇంత పిలక నుంచు నితడుముడినివేసి
రిప్లయితొలగించునల్ల కుచ్చు టోపి నచ్చు నతడు
నితడు తిరుగు తూర్పు నతడెంచుపడమర
కలసి తిరుగ యి టుల కలగు శుభము
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘జతగా నాబండి...’ అనండి.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యానికి నా సవరణలు......
అల్లదె చిత్రము చూడుము
మెల్లగ నాబ్రాహ్మణుండు, మ్లేచ్ఛ గురువుతో
దెల్లటి వాహన మెక్కియు
నుల్లము లలరంగ బోవ నుత్సాహించెన్.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చిత్రం’ అని వ్యావహారికపదంతో పద్యాన్ని ముగించారు. ఆ పాదాన్ని ‘నిజమత| మని కనులకు చూపు చిత్ర మందు ముదమునన్’ అనండి.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కులమతమ్ముల గోడలన్ కూల్చివేసి
రిప్లయితొలగించుఅన్న దమ్ముల వలె ప్రజ లున్న చోట
కరము సుఖమును శాంతిని గాంచ వచ్చు
ఖ్యాతి గల్గు విశ్వమ్మునా జాతి కప్డు
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించుమత సామరస్య మొప్పగ
వెత జెందక స్కూటరెక్కి వెనుకన గూర్చు౦
డె తడబడక విప్రుడు తా
స్థితప్రజ్ఞుడగుట చేత సేవింపంగన్
మనుజ మతము మాదనుచున్
రిప్లయితొలగించునినదించగ బండి మీద నేర్పుగ వారల్
పెనవేసిన స్నేహముతో
కనిపించగఁ కవితరాదె? కఠినులకైనన్!
ఆకలు లొకటే యైయైనన్
న్నీకలిలో వృత్తులెన్నొయెల్లరి కెరుకౌ!
శ్రీకరు లొకరే యైనన్
ప్రకటించెడు మతము లెన్నొ ప్రాభవమొప్పన్!
(శ్రీకరులు=శుభములు కురిపించే భగవంతులు)
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మనుజ మతము మాదనుచున్
రిప్లయితొలగించునినదించగ బండి మీద నేర్పుగ వారల్
పెనవేసిన స్నేహముతో
కనిపించగఁ కవితరాదె? కఠినులకైనన్!
ఆకలు లొకటే యైయైనన్
న్నీకలిలో వృత్తులెన్నొయెల్లరి కెరుకౌ!
శ్రీకరు లొకడే యైనన్
ప్రాకటముగ మతము లెన్నొ ప్రాభవమొప్పన్!
(శ్రీకరులు=శుభములు కురిపించే భగవంతులు)
గురుదేవులకు ధన్యవాదములు.రెండవ పద్యం చివరి పాదం మొదటి అక్షరం గురువుగా సవరించాను. పరిశీలించ ప్రార్థన.
రిప్లయితొలగించుమతము లెన్ని యున్న మానవత్వ మొకటె
రిప్లయితొలగించుకలసిమెలసి యున్న కలదుసుఖము
భరతభూమిని మతవైవిధ్యమున్నను
చేయుచందురు సహజీవనమును!
మనసున గౌరవముండిన
రిప్లయితొలగించుమనిషికితర మనుషులన్న మనసులుకలిపే
మన మానవతే నిజమత
మని కనులకు చూపు చిత్ర మందు ముదమునన్
అహ్మదప్పుడాగి ఆ "రాం" సె బైఠనె
రిప్లయితొలగించుశాస్త్రి ' లిఫ్టు ' నడుగ శహరు నందు
చల్లగుండ మనుచు "అల్లా " నె యనియెక్కె
మనసు కలిసినపుడు మతములడ్డ ?
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కలిపే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘మనసు లొకటిగా’ అనండి. ‘మానవత + ఎ’ అన్నప్పుడు సంధి లేదు. ‘మానవతయె’ అనండి.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
జతగా పోవుచు నుండిరి
రిప్లయితొలగించుహితమే తమ మతమనుచును పిందూ ముస్లిమ్
సతతము నిలుచును చెలిమని
బతుకున కర్ధమ్ము తెలిపె భాయీ! భాయీ!
శైలజ గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.