చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ఇష్టపడును’ అన్నారు కనుక ‘జనులు’ అని కాకుండా ‘జనము’ అనండి. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** జిలేబీ గారూ, మీ భావానికి నా పద్యరూపం.... జామకాయల చిత్రమున్ జక్కఁ బట్టి యడ్డకొడమను జేపట్టి యయ్యవారు పద్యమత్స్యముల్ బట్టఁగ వచ్చినార లిటుల సాగించె జమజమాయిచుకొనుచు. **** లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ఫలము + అమృత’ అన్నప్పుడు సంధి తప్పక జరుగుతుంది. విసంధిగా వ్రాయరాదు. ‘అడవిలో గాచునది మేటి యమృతఫలము’ అనండి. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఫలముల నిదియే రాజని
రిప్లయితొలగించండియిల జనులీ జామనెపుడునిష్టపడునులే
యల సామాన్య జనుల యా
పిలండ్రు చౌకగ దొరకును విపణిని యిదియే
జామపండ్ల రాశి చవులూరగా జేసె
రిప్లయితొలగించండినొకటి రెండు దినిన నొప్పు గాని
యంత కంటె నెక్కు వైనయెడ ల జీర్ణ
శక్తి తగ్గి యగును చర్మ రోగి
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
చౌకగా దొరకెడు - జామ పండు :
01)
_______________________________
ఆకు పచ్చగ నున్నచో ♦ నాపిలు వలె
పసుపు పచ్చగ నున్నచో ♦ పనస వలెను
నద్భుతంబైన రుచి గల్గు ♦ నమృత ఫలము
జనులు చవిగొని మెచ్చగా ♦ జగము నందు
చౌక ధరలోన దొరకెడు ♦ జామ పండె !
_______________________________
రిప్లయితొలగించండిజామ కాయలను ఫోటో బట్టి
అడ్డకొడమ చేబట్టి అయ్యవారు
పద్య మత్స్యముల రచనవేట
సాగించి 'జమ'జమాయించిరి !!
జిలేబి
ఫలములు పలు విధములుగా
రిప్లయితొలగించండినిల లభియించు, నిట జామనీ రీతిగ క
న్నులకింపుగ లేదని నే
పలుకుట సభ్యతయు కాదు పదుగురిలోనన్.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఇష్టపడును’ అన్నారు కనుక ‘జనులు’ అని కాకుండా ‘జనము’ అనండి.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....
జామకాయల చిత్రమున్ జక్కఁ బట్టి
యడ్డకొడమను జేపట్టి యయ్యవారు
పద్యమత్స్యముల్ బట్టఁగ వచ్చినార
లిటుల సాగించె జమజమాయిచుకొనుచు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అడవి కాచుమేటిఫలము అమృత ఫలము
రిప్లయితొలగించండిబండి మీదపేర్చగ పండ్లు దండి గాను
చూడ బోవకొనగ ధర చుక్క లంటు
అగ్గు వగ్గువ నుచువట్టి అరపు మిగిలె
అన్ని ఫలములలో జామ యమృత ఫలము
రిప్లయితొలగించండిపేదవారికి నచ్చిన ప్రియ ఫలమ్ము
నీరసమ్మును బాపును నిశ్చయముగ
నందుబాటులో ధరలుండు ననవరతము
ఫలరాజంబని చెప్పనేర్తురుకదా వ్యాపారసంఘంబులున్
రిప్లయితొలగించండిబలమున్ గూర్చునటంచుఁ బల్కిరికదా వైద్యుల్ ముదంబంది స
త్ఫలమౌ పూజలకెల్లవేళలనిరే భక్తాళి "జాంపండు" నీ
కలికాలామృతమై చెలంగెనిది సద్గ్రాహ్యంబుగానిద్ధరన్.
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఫలము + అమృత’ అన్నప్పుడు సంధి తప్పక జరుగుతుంది. విసంధిగా వ్రాయరాదు. ‘అడవిలో గాచునది మేటి యమృతఫలము’ అనండి.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అందును చౌకగ జనులకు
రిప్లయితొలగించండినందలి నౌషధ గుణములు నారోగ్య మిడున్
విందును జేయును కనులకు
మందము నరికట్టు జామి మధురము గాదే!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ధన్య వాదములు శంకరయ్య గారూ !
రిప్లయితొలగించండిఅడవిలో గాచునది మేటి యమృతఫలము
బండి మీదపేర్చగ పండ్లు దండి గాను
చూడ బోవకొనగ ధర చుక్క లంటు
అగ్గు వగ్గువ నుచువట్టి అరపు మిగిలె
అందరి కందే ఫలములు
రిప్లయితొలగించండిఅందముగా నుండు చూడ నంతట దొరకున్
అందరును జామపండును
దిందురు సంప్రీతితోడ తియ్యగ నుండున్.
అందరి కందే ఫలములు
రిప్లయితొలగించండిఅందముగా నుండు చూడ నంతట దొరకున్
అందరును జామపండును
దిందురు సంప్రీతితోడ తీయగ నుండున్.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అందే’ అన్నది వ్యావహారికం. ‘అందెడు’ అనండి.
గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
రిప్లయితొలగించండిజామ పండ్లను దినినను జలుబు చేయు
నన్న వారికిని దెలియ దసలు గుణము
జామ పండ్లలోనను జవ సత్తువుండు
తిన్న వారికి కలుగును మిన్న ఫలము.
దోర దోర జామ దొరికిన పండుగ!
రిప్లయితొలగించండినూరు నెవరి కైన నోరు జూడ!
పంటి రకము దెల్ప వడుపుగా జీల్చిరి
యాకు జేర్చ వాటి యందమెగసె!
రిప్లయితొలగించండికుసుమ సుదర్శన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.