22, నవంబర్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1552 (ధైర్యంబే లేనివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధైర్యంబే లేనివాఁడు ధరణిన్ గెలిచెన్.
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. శౌర్యముతో భువిని గెలుచు
    కార్యంబున గ్రీకు రాజు కష్టమె యయినన్
    కార్యోన్ముఖుడై వచ్చి య
    ధైర్యంబే లేనివాఁడు ధరణిన్ గెలిచెన్

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా ! యేపని జేయడు
    ధై ర్యంబే లేనివాడు, ధరణిని గెలిచెన్
    ధారుణి దిరిగిన మోడీ
    భా రీ గా నోట్లు గడిచి బా హాటముగాన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పిరికివాడైన అప్పారావుతో - దైర్యశాలి ధరణికి - పెళ్ళి జరిగిన క్షణంలో :

    01)
    ________________________

    సూర్యుని కొమరిత ధరణిని
    నార్యాపతి సత్కుమారు ♦ డప్పారావే
    భార్యగ బొందిన క్షణమున
    ధైర్యంబే లేనివాఁడు ♦ ధరణిన్ గెలిచెన్ !
    ________________________

    రిప్లయితొలగించండి
  4. ఆంగ్లేయులు, యితర విదేశీయులు
    కుట్ర, కుతంత్రాలతో గాక
    దైర్యంతోనా భారతదేశాన్నాక్రమించినది :

    02)
    ________________________

    శౌర్యము, ధైర్యము గల పతు
    లార్యావర్తంబు నేల ♦ నక్రమ రీతిన్
    క్రౌర్యము గల పరదేశపు
    ధైర్యంబే లేనివాఁడు ♦ ధరణిన్ గెలిచెన్ !
    ________________________

    రిప్లయితొలగించండి
  5. పుష్కరుడు గెలిచినది - దైర్యముతో కాదు గద :

    03)
    ________________________

    ధైర్యముగల నల రాజును
    శౌర్యముతో గెలువ లేక ♦ స్ఖాలిత్యముతో
    క్రౌర్యుండగు పుష్కరుడదె
    ధైర్యంబే లేనివాఁడు ♦ ధరణిన్ గెలిచెన్ !
    ________________________

    రిప్లయితొలగించండి
  6. దుర్యోధనుడు గెలిచినది కపటద్యూతినే గదా :

    04)
    ________________________

    శౌర్యము గల పాండవులను
    దైర్యముగా నడ్డలేక ♦ దంబపు పాళిన్
    క్రౌర్యముగా రారాజదె
    ధైర్యంబే లేనివాఁడు ♦ ధరణిన్ గెలిచెన్ !
    ________________________

    రిప్లయితొలగించండి
  7. చిన్న మార్పుతో :

    05)
    ________________________

    ఆర్యుండగు శ్రీరాముని
    భార్యను తా తస్కరించె ♦ పౌలస్త్యుండే
    దుర్యాగము నే గాదొకొ
    ధైర్యంబే లేనివాఁడు ♦ ధరణిజ గెలిచెన్ !
    ________________________

    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. రక్తసంబంధం సినిమాలో రేలంగి ప్రేమించిన అమ్మాయి
    యింటి ముందు నిరాహార దీక్ష చేస్తాడు !
    ఆ అమ్మాయి పేరు ధరణైతే :

    06)
    ________________________

    నిర్యాణము బొందు వరకు
    పర్యంకము పైనె యుందు - భార్యగ ధరణి
    న్నార్యా నా కిడు మంచును
    ధైర్యంబే లేనివాఁడు ♦ ధరణిన్ గెలిచెన్ !
    ________________________

    రిప్లయితొలగించండి
  10. కార్యార్థియై వెడలబడి
    ఆర్యు డొకడు సీమలోన నంబువుఁ ద్రాగన్
    శౌర్యంబడరగ తనువున
    ధైర్యంబేలేని వాడు ధరణిన్ గెలిచెన్

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారి పూరణలో మూడు నాలుగు పాదములలో ప్రాస సరిచేయాలి.

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
    (నా బాల్యంలో మిస్సయిన సినిమాలలో ‘రక్తసంబంధం’ ఒకటి. టీవీలో ఎన్నోసార్లు వచ్చినా అక్కడక్కడ చూడడం తప్ప పూర్తి సినిమాను చూడలేదు)
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    సుబ్బారావు గారి పద్యంలో ప్రాసను నేను గమనించలేదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణలో చివరి రెండు పాదాలను ఇలా మారుద్దాం...
    కార్యోన్ముఖుఁ డయి మోడీ
    చర్యలు కురిపించె నోట్లు చయ్యన గెలువన్.

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా !
    యూ ట్యూబ్ లో ఉంటుంది !
    తప్పకుండా చూడండి !
    ఎన్ టి యార్ కు పేరు తెచ్చిన గొప్ప సినిమాలలో అదొకటి !
    మీరు చూడక పోవడం - నాకు బాధగా ఉంది !

    ముళ్ళపూడి వారి రచన
    మధుసూదనరావు దర్శకత్వం
    ఘంటసాల వారి సంగీతం

    సావిత్రి ఎన్ టి యార్లు - అన్నా చెల్లెళ్ళుగా
    వాళ్ళను విడదీసే పాత్రలో సూర్యకాంతం
    చెప్పనలవి కాదు చూడవలసినదే !

    రిప్లయితొలగించండి
  14. బి.యస్.యస్. ప్రసాద్ గారూ (మీ పూర్తి పేరు తెల్పండి)
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘శౌర్యపు మార్గముల బడక’ అనండి.
    ****
    వసంత కిశోర్ గారూ,
    తప్పక చూస్తాను. ధన్యవాదాలు. అందులో ‘చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే’ నాకెంతో ఇష్టమైన పాట. ఇక ‘బంగారుబొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే’ అందరికీ ఇష్టమైన పాట!

    రిప్లయితొలగించండి
  15. ఆర్య హరిశ్చంద్రుడి నౌ
    దార్యమ్మును సత్య నిష్ట, ధర్మము జూపన్
    గార్యాశయ గాధేయుడ
    ధైర్యంబేలేని వాడు ధరణిని గెల్చెన్!

    రిప్లయితొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులకు నమస్సులు . తప్పుకు క్షమించాలి మార్పుతో మరల ప్రచురించినాను
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ (BSS ప్రసాద్ )

    శౌర్యపు మార్గముల బడక
    కార్యమ్మున దీక్ష యుంచి కైంకర్యములన్
    కౌర్యమ్మే వీడి యతడు
    ధైర్యంబే లేనివాఁడు ధరణిన్ గెలిచెన్.

    రిప్లయితొలగించండి
  18. ర్యోన్ముఖుఁడుద్ధతిగన
    వార్యపరాక్రమవిభూతి వైభవమెసఁగన్
    క్రౌర్యంబును బుధధూషణ
    ధైర్యంబేలేనివాఁడు ధరణిన్ గెలిచెన్.

    రిప్లయితొలగించండి

  19. పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వ౦ దనములు

    కార్యము సాధింఛ డెపుడు

    ధైర్యంబే లేనివాడు.ధరణిని గెలిచెన్

    వీర్యము,తెలివియు గలిగిన

    శౌర్యధనుడు శ్రద్ద,దీక్ష సాహసమొప్పన్

    రిప్లయితొలగించండి
  20. వీర్యం బెంతయు నున్నను
    ధైర్యం బే లేనివాడు ధరణిని నోడున్
    వీర్యంబును లేకయును,న
    ధైర్యంబే లేనివాడు ధరణిన్ గెలుచున్

    క్రౌర్యంబు గలిగి పరులను
    ధైర్యంబుగ జంపు వాడు ధార్మికుడగు నా
    క్రౌర్యం బంతంబౌ నెడ
    ధైర్యంబే లేనివాడు ధరణిన్ గెలుచున్

    ఆర్యులు ధర్మము నీతిని,
    ధైర్యము చేగొన గెలుపది తధ్యము గనరే
    క్రౌర్యము వీడిన యపుడే
    ధైర్యంబే లేనివాడు ధరణిన్ గెలుచున్

    అర్యముడైనను దినమది
    పూర్యము గాగా నణగును,పొందిన ప్రభలన్
    ధైర్యము రిక్కలు వెలుగును
    ధైర్యంబే లేని వాడు ధరణిన్ గెలుచున్

    వీర్యము క్రౌర్యము బెంచిన
    వీర్యం బదియే చెరచును,వీరుడు నగునా
    తుర్యము ధర్మము కావగ
    ధైర్యంబేలేని వాడు ధరణిన్ గెలుచున్

    రిప్లయితొలగించండి
  21. కె ఈశ్వరప్ప గారి పూరణ

    ధైర్యపు దశదిశ లెన్నో
    కార్యాచరణమ్ము నందు కనిపించునుగా
    శౌర్యంబందు నశోకుడ
    ధైర్యంబే లేనివాడు ధరణిని గెలిచెన్

    రిప్లయితొలగించండి
  22. శ్రీగురుభ్యోనమ:

    మౌర్యుని పౌత్రు డశోకుడు
    శౌర్యమునన్ రణము గెల్చి చలనము కలుగన్
    క్రౌర్యంబును కనుగొనగన్
    ధైర్యంబే లేనివాఁడు ధరణిన్ గెలిచెన్

    రిప్లయితొలగించండి
  23. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యప్రారంభంలో ‘కా’ టైప్ కాలేదు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదుపూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. ఆర్యా! విభీషణుండే
    శౌర్యమ్మునుజూపకెపుడు శాంతము తోడన్
    క్రౌర్యంకుసహకరించక
    ధైర్యంబే లేనివాడు ధరణిని గెలిచెన్!!!


    రిప్లయితొలగించండి
  25. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘క్రౌర్యంకు’ అనరాదు కదా... ‘క్రౌర్యమునకు తోడుపడక..’ అనండి.

    రిప్లయితొలగించండి
  26. సూర్యుని వెలుగున వెలుగుచు
    ముర్యుచు ముద్దుల సొలపులు పున్నమి రేడై
    శౌర్యమ్మించుక లేకయె
    ధైర్యంబే లేనివాఁడు ధరణిన్ గెలిచెన్

    రిప్లయితొలగించండి


  27. ఆర్యావర్తము లోనన్
    ధైర్యంబే లేనివాఁడు ధరణిన్ గెలిచెన్
    శౌర్యంబుకూడ లేదౌ
    క్రౌర్యంబేయాయుధమ్ము కవివర గానన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి