శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘అర్కసూతి’ సరియైన ప్రయోగం. **** వసంత కిశోర్ గారూ, మొదటి పాదం చివర గణదోషం. సవరించండి. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. **** కె.యస్, గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరియైన వచ్చి యడిగిన
రిప్లయితొలగించండిగురిపించును వితరణంబు కుంతీ సుతుడే
సరిలేని దానగుణుడన
హరికి కవచ కుండలముల యంహతి కరియౌ
(అంహతి =దానము , కరి = నిదర్శనము )
సరిరా గర్ణున కెవరును
రిప్లయితొలగించండినరి వచ్చిన గురియు ధనము నాతని చేతిన్
నొరులకు దానము చేయును
కరియే గద దానమీయ కన్నని కపుడున్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
దానకర్ణుడు :
01)
___________________________
అడగ వచ్చిన వారెవ్వ - రైన గాని
కరిని గాచిన శ్రీహరి - కరణి వేగ
గురిని దప్పక యర్థుల - కోర్కి దీర్చు
శ్వాస నడిగిన జంకక - సరియె యనును
కవచ కుండలము లడగ - కౌశికునకు
కోసి యిచ్చిన దాతృత్వ - కోవిదుండు
దాన మిడుటను కర్ణుడే - ధరణి యందు
మేటి గావున నాతని - సాటి యతడె !
___________________________
గురి = లక్ష్యము , నిశ్చయత
గురి గుదిరి వచ్చియడిగిన
రిప్లయితొలగించండియరియైనను వెళ్ళమనక నడిగినదిచ్చున్
సరిలేరు దానమందున
కరిమీదకు నెక్కి చెపుదు కర్ణుని గొప్పన్.
సరి తూగ నెవడు కలడే
రిప్లయితొలగించండిగురిలో ధరణీ చరిత్ర ? కోసియె నిచ్చెన్
అరి యర్ధించ కవచమున్
కరియైనింకేదివలయు? కర్ణుని కొలవన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సరియే’ అనండి. చివరిపాదం భావాన్ని వివరించండి.
****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కోసియె యిచ్చెన్’ అనండి.
సరిలేరు నార్క సూతికి
రిప్లయితొలగించండియరి కైన నొసంగుగాదె యతిసర్గములన్
గురిగానిలిచెను ధర తొల
కరిదొర చొక్కిలగ సహజ కవచాదులిడెన్
తొలకరిదొర =ఇంద్రుడు
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండితప్పిపోయిన "శత్రువు" తో మరల
దానకర్ణుడు :
1అ)
___________________________
అరియె స్వయముగ నర్థించ - నానందముగ
కరిని గాచిన శ్రీహరి - కరణి వేగ
గురిని దప్పక యర్థుల - కోర్కి దీర్చు
శ్వాస నడిగిన జంకక - సరియె యనును
కవచ కుండలము లడగ - కౌశికునకు
కోసి యిచ్చిన దాతృత్వ - కోవిదుండు
దాన మిడుటను కర్ణుడే - ధరణి యందు
మేటి గావున నాతని - సాటి యతడె !
___________________________
అరిబలము హరియించగ గురికొని హరి
రిప్లయితొలగించండికరిపురము జొచ్చె కొనగను కవచ కుండ
లముల నంచు నెరింగియు రమణ తోడ
ధర్మ మార్గ మనుసరించి దాన మిచ్చె
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అర్కసూతి’ సరియైన ప్రయోగం.
****
వసంత కిశోర్ గారూ,
మొదటి పాదం చివర గణదోషం. సవరించండి.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరార్యులకు ధన్యవాదములతో
రిప్లయితొలగించండిదానకర్ణుడు :
1ఆ)
___________________________
అరియె స్వయముగ నర్థించ - నరుసముగను
కరిని గాచిన శ్రీహరి - కరణి వేగ
గురిని దప్పక యర్థుల - కోర్కి దీర్చు
శ్వాస నడిగిన జంకక - సరియె యనును
కవచ కుండలము లడగ - కౌశికునకు
కోసి యిచ్చిన దాతృత్వ - కోవిదుండు
దాన మిడుటను కర్ణుడే - ధరణి యందు
మేటి గావున నాతని - సాటి యతడె !
___________________________
పూజ్యులు గురుతుల్యులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిఅరిది విజయము సాధింప ననిని క్రీడి
అభ్రకరివాహనుడడుగ నచ్చెరువుగ
సహజ కవచ కుండలముల సరిగ నొసగె
అడుగు రిపువైన! దానకర్ణుడు యతండు!
అరిపిత కోరగ కవచము
రిప్లయితొలగించండికరియౌ గద నిచ్చుటదియ,కదనము నందున్
గురి యాత డర్జునునకై
సరి దానము చేయనెవరు సాటిగ రారే!
(కరి=సాక్ష్యము)
గురితప్పదు బాణము విడ
సరి లేరిల దానమునను,శక్రుడు కోరన్
నరియైన నిచ్చె కవచము
కరికిని సాటగును శూర గణమున నెందున్
గురి యయ్యెను శాపములకు
సరి లేరతనికి బవరము సలుపగ దానాల్
అరి నందెను మృత్యువతడు
కరి బోలినయోధుడయిన,ఘనముగ దాతై
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ
రిప్లయితొలగించండిఅరి యతడంచు,పుత్రుడగునర్జుని కావగ వచ్చెనంచు తా
నెరిగియు త్యాగియై కవచ మిచ్చెను.కర్ణుని కేరి ధారుణిన్
సరి?గురియౌ గదా యినుము సమ్మెట నగ్నినిగూడినట్లు లో
క రిపువు గా కనంబడును కర్ణుడు కౌరవ నాథ మిత్రుడై
అరివీర భయంకరుడని,
రిప్లయితొలగించండిగురికల వాడని జడియుచుఁ గొమరుని గావన్
హరి కరికరి పెట్టిన నూ
సరిల్లక కవచముఁ దీసి సత్రమొసంగన్!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కె.యస్, గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరి యే గర్ణున కెవరును
రిప్లయితొలగించండినరి వచ్చిన గురియు ధనము నాతని చేతిన్
నొరులకు దానము చేయును
కరియే గద దానమీయ కౌశికు న కునున్
సరిలేదు దానమున నలు
రిప్లయితొలగించండిగురిలో పేరందెనతడు గుణకోవిదుడై
యరినైన కాచు తానిల
గరిమను దేవేంద్రునైన ఖర్వము చేయున్
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కె ఈశ్వరప్పగారి పూరణ
రిప్లయితొలగించండిపదుగురి సంతసంబె తనపట్టు నటంచును దానకర్ణుడై
కదలగ, దానినెట్లు అరి కట్టుట న౦చును యింద్రు డెంచగా
ఆదరని సూర్యుడట్లు సరియైన పథమ్మున సాగుచుండగా
వదలడుదానధర్మపు నివాసిగ శాంకరి యన్నపూర్ణలా
అరిభీకరుడైనను, పో
రిప్లయితొలగించండికరియై దుర్జనుల తోడ కలిసినకతమో
గురి తప్పెను దానఫలము
సరి నిలువగలేక మడఁగె చక్రి సఖునిచేన్.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.